రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: 2027 వన్డే ప్రపంచ కప్‌కు వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాలు మళ్లీ సంక్లిష్టంగా మారాయి. వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీకి నేరుగా అర్హత పొందే దేశాలను నిర్ణయించేందుకు ఐసీసీ ఈ సెప్టెంబర్ 30 వరకు గడువు నిర్ధారించింది. ఆ తేదీ నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు ఆటోమేటిక్‌గా ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి.
ఇవే కాకుండా సహ-ఆతిథ్య దేశాలైన సౌత్ ఆఫ్రికా , జింబాబ్వే జట్లు కూడా నేరుగా క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న వెస్ట్ ఇండీస్ జట్టు సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీ వరకు కేవలం రెండు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్‌లో ఇండియా జట్టుతో జరగనున్నాయి.
ఈ రెండింటిలో వెస్ట్ ఇండీస్ విజయం సాధించినా టాప్-8లోకి చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కరీబియన్ జట్టు భవితవ్యం ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ఐ,ర్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌పై ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ ఎనిమిదో స్థానంలో ఉండగా, ఐర్లాండ్ 12వ స్థానంలో ఉంది.
ఒకవేళ ఐర్లాండ్ ఈ సిరీస్‌ను 4-1 లేదా 5-0 తేడాతో గెలిస్తే, అలాగే ఇండియా పై వెస్ట్ ఇండీస్ రెండు వన్డేల్లోనూ విజయం సాధిస్తే మాత్రమే కరీబియన్ జట్టుకు టాప్-8లోకి వచ్చే అవకాశం ఉంటుంది. Ireland ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేసి ఆఫ్గనిస్తాన్ ను పెద్ద తేడాతో ఓడించాల్సి ఉంటుంది.
అయితే ఆఫ్గనిస్తాన్–ఐర్లాండ్ పై సిరీస్‌ను కైవసం చేసుకుంటే వెస్ట్ ఇండీస్ దాదాపుగా నేరుగా అర్హత సాధించే అవకాశాలను కోల్పోతుంది. అప్పుడు కరీబియన్ జట్టుకు ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ద్వారా మాత్రమే టోర్నీకి చేరే మార్గం మిగులుతుంది.
ఇలాంటి పరిస్థితినే వెస్ట్ ఇండీస్ 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా కూడా ఎదుర్కొంది. ఆ సమయంలో వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలవలేక ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ఆడాల్సి వచ్చింది. సూపర్ -6 దశలో స్కాట్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన వెస్ట్ ఇండీస్ తన 48 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ప్రధాన టోర్నీకి దూరమైంది.
ఇప్పుడు 2027 ప్రపంచ కప్ ముందు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతున్న నేపథ్యంలో వెస్ట్ ఇండీస్ జట్టు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్గనిస్తాన్–ఐర్లాండ్ సిరీస్ ఫలితాలు, ఇండియాపై వెస్ట్ ఇండీస్ ప్రదర్శన ఆధారంగా కరీబియన్ జట్టు భవితవ్యం నిర్ణయించబడనుంది.







