దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం 2026ను పురస్కరించుకుని హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’ను ప్రకటించింది. రూ.10,000 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక ప్లాన్‌లో ఏకంగా 15 నెలల సర్వీస్ వ్యాలిడిటీని కంపెనీ కల్పిస్తోంది. ప్రస్తుతం జియో బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో 15 నెలల వ్యాలిడిటీతో లభిస్తున్న ఏకైక ప్లాన్ ఇదే కావడం విశేషం.

ఈ కొత్త ఫ్రీడమ్ ప్యాక్‌ను జిఓ ఫైబర్ , జిఓ ఎయిర్ ఫైబర్ వినియోగదారులు పొందవచ్చు. జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మై జిఓ యాప్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. రూ.10,000 చెల్లించి ఈ ప్యాక్ తీసుకునే వినియోగదారులకు 15 నెలల పాటు నిరంతర బ్రాడ్‌బ్యాండ్ సేవ లభిస్తుంది.

ప్లాన్ ప్రయోజనాల పరంగా చూస్తే, వినియోగదారులకు 100 Mbps డౌన్‌లోడ్ స్పీడ్, 100 Mbps అప్‌లోడ్ స్పీడ్‌ను జియో అందిస్తోంది. అదనంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉచితంగా కల్పిస్తోంది. దీంతో ఇంటర్నెట్ వినియోగంతో పాటు వాయిస్ కాల్స్ అవసరాలను కూడా ఈ ఒక్క ప్లాన్‌తో తీర్చుకునే వీలుంటుంది.

ఈ ఫ్రీడమ్ ప్యాక్‌తో JioTV ద్వారా 1,000కు పైగా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. దీంతో ప్రత్యేకంగా DTH కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే టీవీ ఛానళ్లను ఇంటర్నెట్ ద్వారా చూడగలుగుతారు. టీవీ వినోదానికి ఇది అదనపు సౌలభ్యంగా భావిస్తున్నారు.

ఇక ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తం 12 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు వినియోగదారులకు ఉచితంగా లభిస్తాయి. వీటిలో జిఓ హాట్ స్టార్ , సోనీ LIV, జీ 5, సన్ NXT, Hoichoi, డిస్కవరీ +, టైమ్స్ ప్లే , తరంగ్ ప్లస్ , ఎరోస్ నౌ , లయన్స్ గేట్ ప్లే , ShemarooMe, ETV విన్ ఉన్నాయి. ఈ OTT సబ్‌స్క్రిప్షన్ల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, టీవీ షోలు వంటి విభిన్న వినోద కంటెంట్‌ను మొబైల్, టీవీ, ట్యాబ్లెట్ తదితర డివైస్‌లలో వీక్షించవచ్చు.

ఈ ప్యాక్‌ను తీసుకునే కస్టమర్లకు జియో ఉచిత Set-Top Box (STB)ను కూడా అందిస్తోంది. ఈ STB ద్వారా అన్ని OTT యాప్‌లను నేరుగా టీవీలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో DTH కనెక్షన్ లేకుండానే టీవీ ఛానళ్లు, OTT కంటెంట్ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఆస్వాదించవచ్చు.

ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేకత JioPC సపోర్ట్. ఇది క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవ. దీని ద్వారా టీవీని కంప్యూటర్‌లా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ప్రత్యేకంగా స్టూడెంట్స్, వర్క్ ఫ్రం హోమ్ వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశముందని కంపెనీ సూచిస్తోంది.

దీర్ఘకాలం బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒకేసారి పొందాలనుకునే వినియోగదారులకు, 100 Mbps స్పీడ్‌తో పాటు OTTలు, టీవీ ఛానళ్లు, ఉచిత STB వంటి అదనపు ప్రయోజనాలు కోరుకునే వారికి జియో రూ.10,000 ఫ్రీడమ్ ప్యాక్ ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్, టీవీ, OTT అవసరాలన్నింటినీ ఒకే ప్లాన్‌లో పొందాలనుకునే కుటుంబాలకు ఈ ప్లాన్ మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.