రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.14,500 వరకు ధర తగ్గింపు అందిస్తోంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ ధర రూ.59,999గా ఉండగా, ప్రస్తుతం అమెజాన్ లో రూ.45,499కు లభిస్తోంది.
ఇదే కాకుండా అమెజాన్ పే ఐసీసీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసే వినియోగదారులకు రూ.1,364 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. అదే కార్డ్‌పై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను ఎంచుకుంటే వడ్డీ రూపంలో రూ.1,186 వరకు అదనంగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వినియోగదారులకు గరిష్టంగా రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభించేలా ఆఫర్‌ను రూపొందించారు.
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫీచర్ల పరంగా చూస్తే, ఇందులో 6.7 ఇంచుల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ ప్రత్యేకతలు. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విసిట్స్+ సపోర్ట్‌ను కల్పించారు.
పనితీరు విషయానికి వస్తే, రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని Exynos 2400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ 8GB RAMతో పాటు 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
బ్యాటరీ విభాగంలో 4,700mAh సామర్థ్యం గల బ్యాటరీని ఏర్పాటు చేశారు. 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌కు లభ్యమవుతోంది. దీంతో వేగంగా చార్జింగ్ చేసుకోవడంతో పాటు, వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యాన్ని కూడా వినియోగదారులు పొందగలరు.
కెమెరా విభాగంలో గెలాక్సీ S25 FE ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ కలిగిన 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. దీంతో నీటి చుక్కలు, ధూళి వంటి వాటి నుంచి ఫోన్‌కు అదనపు రక్షణ లభిస్తుంది. ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన స్పెసిఫికేషన్లు, ప్రస్తుతం కొనసాగుతున్న భారీ డిస్కౌంట్ ఆఫర్‌లతో శాంసంగ్ గెలాక్సీ S25 FE మార్కెట్లో ఆకర్షణీయ ఎంపికగా మారింది.







