రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఇటీవలి కాలంలో భారీ చిత్రాల విడుదల తగ్గిన నేపథ్యంలో, ఈ వారం మాత్రం మధ్యస్థాయి సినిమాలు, కొన్ని రీ రిలీజ్‌లు, అలాగే ఓటీటీల్లో కొన్ని కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ‘మా ఇంటి బంగారం’ వంటి మిడ్ రేంజ్ సినిమా విడుదల కానుండగా, ఓటీటీలో మాత్రం ‘దృశ్యం 3’ తప్ప పెద్దగా చర్చనీయాంశమయ్యే సినిమా లేదనే చెప్పాలి.
జూన్ మూడో వారంలో థియేటర్లలో, వివిధ ఓటీటీ వేదికలపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇలా ఉంది:
థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు
జూన్ 19న థియేటర్లలో వరుసగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్, వినోద ప్రధాన కథాంశాలతో కూడిన సినిమాలు ఉన్నాయి. అలాగే రెండు ప్రముఖ చిత్రాలు రీ రిలీజ్ రూపంలో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నాయి.
1) మా ఇంటి బంగారం : జూన్ 19న విడుదల
2) ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు : జూన్ 19న విడుదల
3) బాలన్ : జూన్ 19న విడుదల
4) దీవానా : జూన్ 19న విడుదల
5) వంద దేవుళ్ళు : జూన్ 19న విడుదల
6) కాక్ టెయిల్ 2 : జూన్ 19న విడుదల
7) గౌతమ్ నంద (రీ రిలీజ్) : జూన్ 19న విడుదల
8) గోలీమార్ (రీ రిలీజ్) : జూన్ 20న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
వివిధ ఓటీటీ వేదికలు కూడా ఈ వారం కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్, డ్రామా జానర్లలో రూపొందిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
9) దృశ్యం 3 : జూన్ 18 నుండి స్ట్రీమింగ్
Jio Hotstar
10) Save The Tigers Season 3 : జూన్ 19 నుండి స్ట్రీమింగ్
11) Kenath Kanom : జూన్ 16 నుండి స్ట్రీమింగ్
నెట్ఫ్లిక్
12) I Will Find You (సిరీస్) : జూన్ 18 నుండి స్ట్రీమింగ్
13) My America’s Sweethearts (వెబ్ సిరీస్ సీజన్ 3) : జూన్ 16 నుండి స్ట్రీమింగ్
14) Drinking Buddies : జూన్ 15 నుండి స్ట్రీమింగ్
సన్ NXT
15) Aashan (మలయాళం) : జూన్ 15 నుండి స్ట్రీమింగ్
ఇలా ఈ వారం మొత్తం 15 సినిమాలు, వెబ్ సిరీస్‌లు థియేటర్లు, ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. భారీ చిత్రాల లేని పరిస్థితుల్లో, మధ్యస్థాయి సినిమాలు, రీ రిలీజ్‌లు, ఓటీటీ కంటెంట్ బాక్సాఫీస్, డిజిటల్ రంగాల్లో ఎలా రాణిస్తాయో చూడాలి.







