తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా

‘ఓ సుకుమారి’ టీజర్ ఆకట్టింపు

‘మసూద’, ‘పరేషాన్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో తిరువీర్, కొత్త రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. తిరువీర్ హీరోగా, స్టార్ నటి ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సుకుమారి’. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి గల ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటూ, సినిమాపై అంచనాలను పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే హిలేరియస్ సన్నివేశాలతో టీజర్ ప్రేక్షకులకు క్రేజీ రైడ్ అనుభూతిని కలిగించేలా కట్ చేశారు.

టీజర్ ప్రారంభంలోనే భావోద్వేగంతో కూడిన ఒక డైలాగ్ ద్వారా కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు.

సినిమాలో తిరువీర్ ఒక సాధారణ గ్రామీణ యువకుడిగా, రాజకీయాల్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న కాబోయే నాయకుడిగా కనిపిస్తున్నారు. తన చుట్టూ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి తనకు కాబోయే భార్య ఎంతో అందంగా, సున్నితంగా, పద్ధతిగా ఉండాలని కలలు కంటూ ఉంటాడు.

అంటూ హీరో పలికే తెలంగాణ యాస డైలాగులు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథలో అసలు మలుపు హీరోయిన్ సుకుమారి ఎంట్రీతో మొదలవుతుంది. హీరో ఊహించినట్లుగానే ఎంతో పద్ధతిగా ఉండే సుకుమారిని చూసిన క్షణంలోనే అతడు ప్రేమలో పడిపోతాడు.

అయితే సుకుమారి తండ్రి ఒక ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టినట్టు టీజర్‌లో చూపించారు.

పెళ్లి పీటల వరకు వెళ్లిన ఈ ప్రేమకథలో అసలు ట్విస్ట్ పెళ్లి తర్వాత వస్తుంది. హీరోయిన్‌ను ముట్టుకోగానే హీరోకి షాక్ తగలడం, దాని వెనుకున్న కారణం ఏమిటన్న ఆసక్తిని టీజర్ చివర్లో పెంచారు.

ఈ టీజర్‌లో తిరువీర్ నటన, ఆయన హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు తగినంత బలం చేకూర్చాయి. ఐశ్వర్య రాజేష్ పాత్రను టీజర్‌లో పూర్తిగా బయటపెట్టకపోయినా, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. మొత్తంగా, థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ అనుభూతి ఇవ్వబోతున్నామనే నమ్మకాన్ని ‘ఓ సుకుమారి’ టీజర్ ద్వారా చిత్ర బృందం కలిగించింది.