రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 17 నుంచి 21 వరకు జరగనున్న Andhra Premier League (ఏపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కడప క్రికెట్ స్టేడియం కమిటీ ఛైర్మన్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, Andhra Cricket Association (ఏసీఏ) సభ్యుడు భరత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కడపలో మొదటిసారిగా నిర్వహించనున్న ఈ లీగ్ మ్యాచ్‌లకు జిల్లావాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.
శనివారం స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఏపీఎల్ ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రవణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కోసం స్టేడియంలో సుమారు రూ.8 కోట్లు వ్యయంతో పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
మ్యాచ్‌ల విరామ సమయంలో ప్రేక్షకుల వినోదార్థం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో గాయని సునీత, గీతామాధురి తదితరులు పాల్గొననున్నారని వెల్లడించారు. క్రికెట్‌తో పాటు సంగీతం, నృత్యాలతో స్టేడియం సందడిగా మారేలా ఏర్పాట్లు చేస్తున్నామని సమావేశంలో నిర్వాహకులు తెలిపారు.
జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు మునికుమార్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డిప్రసాద్ మాట్లాడుతూ, ఏపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకుల నుంచి ఎటువంటి రుసుం వసూలు చేయబోమని స్పష్టం చేశారు. కడప ప్రజలకు ఇది అరుదైన అవకాశం కావడంతో కుటుంబ సమేతంగా స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను ఆస్వాదించాలని వారు సూచించారు.
కడప క్రికెట్ స్టేడియం కమిటీ కన్వీనర్ సంజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు పృథ్వీ, సభ్యుడు మహేంద్రరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఎల్ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లను కడపకు తీసుకురావడానికి ఇది దోహదం చేస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.













