బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మొబైల్‌

13 articles

కడపలో ఎనిమిదో తరగతి బాలికల పరార్‌.. ఫోన్‌ వ్యసనమే కారణం
జిల్లా వార్తలు

కడపలో ఎనిమిదో తరగతి బాలికల పరార్‌.. ఫోన్‌ వ్యసనమే కారణం

కడప తాలూకాలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మొబైల్‌ ఫోన్‌ వ్యసనం, ఇంట్లో మందలింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి, రూ.10 వేల నగదు, ఫోన్‌లతో కలిసి హైదరాబాద్‌ Charminar ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా వారిని గుర్తించి కడపకు తీసుకువచ్చి తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించగా, ఈ ఘటనతో చిన్నారులపై మొబైల్‌ ప్రభావం, తల్లిదండ్రుల పర్యవేక్షణపై చర్చ మళ్లీ మొదలైంది.

24, జులై 2026

ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపులు…
బిజినెస్

ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపులు…

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నెట్‌ లేకుండానే పీఓఎస్‌ టెర్మినల్‌ వద్ద యూపీఐ లైట్‌ ద్వారా గరిష్ఠంగా రూ.2,000 వరకు చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోంది. విమాన క్యాబిన్లు, భూగర్భ రైలు నెట్‌వర్క్‌ల వంటి ఇంటర్నెట్‌ సమస్యలున్న ప్రాంతాల్లో చిన్న మొత్తాల డిజిటల్‌ చెల్లింపులు సులభతరం చేయడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ యాప్‌ ప్రొవైడర్లు అవసరమైన సాంకేతిక మార్పులు చేపడుతున్నారు.

22, జులై 2026

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…
జాతీయం

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

కేంద్ర కేబినెట్‌ మొత్తం రూ.2.19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి, సెమీకాన్‌ 2.0 పథకానికి రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్‌ తయారీ స్కీమ్‌కు రూ.62,500 కోట్లు కేటాయించింది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత్‌ స్థాయిని బలోపేతం చేయడం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, స్థానిక విలువ జోడింపును పెంచడం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలుగా అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

15, జులై 2026

త్వరలో మొబైల్‌ రీఛార్జ్‌లు భారం పెంచే సూచనలు
బిజినెస్

త్వరలో మొబైల్‌ రీఛార్జ్‌లు భారం పెంచే సూచనలు

దేశవ్యాప్తంగా మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలు రానున్న మూడు నుంచి నాలుగు నెలల్లో సుమారు 12-15 శాతం వరకు పెరిగే అవకాశముందని సెంటరుమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ని వేదిక పేర్కొంది. 5G నెట్‌వర్క్‌ విస్తరణకు భారీ పెట్టుబడులు, టెలికాం రంగంలో పోటీ తగ్గిపోవడం, జిఓ , ఎయిర్టెల్ ఆధిపత్యం బలపడటం వల్ల టారిఫ్‌ పెంపు అనివార్యమవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

6, జులై 2026

సినిమాను మించి ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’
సినిమా రివ్యూలు

సినిమాను మించి ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’

‘బాహుబలి: ద టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీని Netflixలో నాలుగు ఎపిసోడ్లుగా విడుదల చేయగా, రాజమౌళి విజన్‌, నటీనటుల శ్రమ, భారీ బడ్జెట్‌ సాహసం, మొదట వచ్చిన ఫ్లాప్ టాక్‌ వల్ల టీమ్‌ ఎదుర్కొన్న ఒత్తిడి వంటి అంశాలను విపులంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్త ప్రభావం, అభిమానుల భావోద్వేగ అనుభవాలను చూపిన ఈ డాక్యుమెంటరీ చివర్లో ‘బాహుబలి’ మూడో భాగం అవకాశంపై ప్రభాస్ , రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి ఇచ్చిన హింట్‌ సినీ ప్రేమికుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

2, జులై 2026

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు

వాట్సాప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌ సైబర్‌ నేరాలు, ఫిషింగ్‌, ఇంపర్సనేషన్‌, డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. MeitY, యూజర్‌నేమ్‌ వ్యవస్థ అమలు విధానం, భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల గుర్తింపు ధృవీకరణపై మూడు రోజుల్లో వివరణ కోరుతూ, సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయవద్దని సూచించింది.

2, జులై 2026

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ సదుపాయం
ఆంధ్రప్రదేశ్

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ సదుపాయం

కేంద్రం MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా WhatsAppలో ఆధార్ డౌన్‌లోడ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. 9013151515 నంబర్‌కు మెసేజ్ పంపి, DigiLocker Services ఎంపికను ఎంచుకుని ఆధార్ నంబర్, OTP నమోదు చేస్తే రిజిస్టర్డ్ మొబైల్, DigiLocker సహాయంతో కొన్ని సెకన్లలోనే ఆధార్‌ను PDF రూపంలో పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాలు సహా మొబైల్ వినియోగదారులకు ఇది ప్రభుత్వ సేవలు, ఆర్థిక లావాదేవీలలో ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేయనుంది.

30, జూన్ 2026

కలెక్టర్‌ సంతకాలు ఫోర్జరీ : రూ.6.99 లక్షలు కాజేసిన ఉద్యోగి
జిల్లా వార్తలు

కలెక్టర్‌ సంతకాలు ఫోర్జరీ : రూ.6.99 లక్షలు కాజేసిన ఉద్యోగి

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నిరంజన్‌కుమార్‌ కలెక్టర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు సంయుక్త ఖాతా నుంచి రూ.6.99 లక్షలు రెండు విడతలుగా విత్‌డ్రా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుదర్శన్‌ అనుమానం వ్యక్తం చేసి ఖాతా వివరాలు పరిశీలించడంతో విషయం బయటపడగా, కలెక్టరేట్‌ అధికారుల ఫిర్యాదు మేరకు చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా దృశ్యాలు, చెక్కుల రికార్డులు తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

21, జూన్ 2026

పంజాగుట్ట ఏఎస్సై బ్యాంకు ఖాతా నుంచి రూ.49 వేల సైబర్‌ మోసం
తెలంగాణ

పంజాగుట్ట ఏఎస్సై బ్యాంకు ఖాతా నుంచి రూ.49 వేల సైబర్‌ మోసం

హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్యకు ఆర్టీఏ చలాన్‌ పేరుతో వచ్చిన మోసపూరిత ఏపీకే లింక్‌ డౌన్‌లోడ్‌ చేయడంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 డెబిట్‌ అయ్యాయి. ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, అనుమానాస్పద లింక్‌లు, ఏపీకే ఫైళ్లను ఓపెన్‌ చేయొద్దని, అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

11, జూన్ 2026

త్వరలో SBI YONO యాప్‌ కొత్త వెర్షన్‌ 3.0
బిజినెస్

త్వరలో SBI YONO యాప్‌ కొత్త వెర్షన్‌ 3.0

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు State Bank of India తన YONO మొబైల్‌ యాప్‌ను త్వరలో 3.0 వెర్షన్‌గా తీసుకురానున్నట్లు ఛైర్మన్‌ చెల్ల శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 కోట్ల మంది యాప్‌లోకి లాగిన్‌ అవుతుండగా, జూన్‌ చివరికల్లా 5 కోట్ల కస్టమర్ల మైలురాయిని దాటే అవకాశం ఉందని, కొత్త వెర్షన్‌లో ప్రస్తుత సేవలను మరింత శక్తివంతం చేసి ఇతర బ్యాంకులకు కూడా ఫిన్‌టెక్‌ వేదికగా ఉపయోగపడేలా రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

9, జూన్ 2026

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో చిన్న కార్లకు మళ్లీ డిమాండ్‌
బిజినెస్

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో చిన్న కార్లకు మళ్లీ డిమాండ్‌

దేశీయ కార్ల మార్కెట్లో చిన్న, హ్యాచ్‌బ్యాక్‌ కార్లకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలు, తొలిసారి కారు కొనుగోలు చేసే కస్టమర్ల నుంచి డిమాండ్‌ రావడంతో మారుతి సుజుకీ Alto, S-Presso, Celerio విక్రయాలు గణనీయంగా పెరిగాయి. SUVల అధిక ధరలు, నిర్వహణ ఖర్చులు, చిన్న కార్ల అందుబాటు ధర, మైలేజీ, GST తగ్గింపు వంటి అంశాలు ఈ ధోరణికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

7, జూన్ 2026

ప్రీమియం సెగ్మెంట్‌లోకి Motorola Edge 70 Pro+ ప్రవేశం
బిజినెస్

ప్రీమియం సెగ్మెంట్‌లోకి Motorola Edge 70 Pro+ ప్రవేశం

మోటోరొలా ప్రీమియం విభాగంలో మోటోరోలా ఎడ్జ్‌ 70 ప్రో+ను రూ.47,999 ధరతో లాంచ్‌ చేసింది. 6.8 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ, 90W టర్బో ఛార్జింగ్‌, మీడియా టెక్ డిమెంసిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌, 50MP క్వాడ్‌ కెమెరా సెటప్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హలో UI, IP68/IP69 రేటింగ్‌లతో ఈ ఫోన్‌ జూన్‌ 11 నుంచి ఫ్లిప్కార్ట్ , మోటోరోలా వెబ్‌సైట్‌ మరియు రిటైల్‌ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

4, జూన్ 2026

ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే బాధితుల ఖాతాల్లోకి డబ్బు రివర్స్‌: కొత్త విధానంతో 19 మందికి ఉపశమనం
నేరాలు

ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే బాధితుల ఖాతాల్లోకి డబ్బు రివర్స్‌: కొత్త విధానంతో 19 మందికి ఉపశమనం

సైబర్‌ మోసాల వల్ల రూ.50 వేలలోపు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ ఊరట కల్పించే విధానాన్ని అమలు చేస్తోంది. గోల్డెన్‌ పీరియడ్‌లో 1930కి సమాచారం ఇస్తే NCRTC పోర్టల్‌ ద్వారా నగదును వెంటనే ఫ్రీజ్‌ చేసి, ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సైబర్‌ నేరాలు పెరగడంతో ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters