బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రీసత్యసాయి

10 articles

విద్యార్థినులతో వ్యక్తిగత సేవలు.. టీచర్ రూపా నిర్వాకంపై తీవ్ర విమర్శలు
జిల్లా వార్తలు

విద్యార్థినులతో వ్యక్తిగత సేవలు.. టీచర్ రూపా నిర్వాకంపై తీవ్ర విమర్శలు

శ్రీసత్యసాయి జిల్లాలోని నంబుళపూలకుంట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో టీచర్ రూపా విద్యార్థినులతో వ్యక్తిగత సేవలు చేయించుకున్న వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యాశాఖ అధికారులు ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసి, నివేదికల ఆధారంగా రూపాపై కఠిన శాఖాపర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

29, జులై 2026

అది.. పుష్పక విమానం కాదు నాయనా..!
జిల్లా వార్తలు

అది.. పుష్పక విమానం కాదు నాయనా..!

ఒకరా ఇద్దరా.. పైగా అందులో చిన్నపిల్లలూ కారు.. ! ఒకే బైక్‌పై ఏకంగా ఆరుగురు యువకులు ప్రయాణించిన తీరు చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు.

25, జులై 2026

పుట్టపర్తి మున్సిపాలిటీలో పాలన గాడితప్పి.. ప్రజా సమస్యలు పెనుభారంగా
జిల్లా వార్తలు

పుట్టపర్తి మున్సిపాలిటీలో పాలన గాడితప్పి.. ప్రజా సమస్యలు పెనుభారంగా

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మున్సిపాలిటీలో కమిషనర్, రెవెన్యూ, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి పనులు, సేవల నిర్వహణ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారి విస్తరణ, చెత్త తొలగింపు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, కంపాక్టర్ల మరమ్మతులు వంటి అంశాలు బిల్లులు, టెండర్లు నిలిచిపోవడంతో అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ శ్రీనివాసులు పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని పేర్కొన్నప్పటికీ నేలమట్టంలో స్పష్టమైన మార్పు కోసం ప్రజలు ఇంకా ఎదురుచూస్తున్నారు.

18, జులై 2026

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు బాలకృష్ణ, నిమ్మల భూమిపూజ
జిల్లా వార్తలు

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు బాలకృష్ణ, నిమ్మల భూమిపూజ

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని రాచనపల్లిలో మడకశిర బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.790 కోట్ల వ్యయంతో 71 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ పనులు పూర్తయ్యాక కాలువ నీటి వహన సామర్థ్యం పెరిగి, హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో తాగునీటి, సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

13, జులై 2026

వీబీ జీ రామ్ జీ పథకంతో గ్రామాల్లో అభివృద్ధి : మంత్రి సవిత
జిల్లా వార్తలు

వీబీ జీ రామ్ జీ పథకంతో గ్రామాల్లో అభివృద్ధి : మంత్రి సవిత

రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత హనుమప్ప పల్లిలో వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ, బీటీ రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఎంజేపీ గురుకులాల శాశ్వత భవనాలు, బీసీ హాస్టళ్లు, ప్రభుత్వ ఐటీఐ భవనం నిర్మాణం, విద్యార్థులకు స్పోర్ట్స్ సదుపాయాలు కల్పించడం ద్వారా బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

2, జులై 2026

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవం
జిల్లా వార్తలు

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవం

శ్రీసత్యసాయి జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తొలి స్నాతకోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ హాజరుకానుండగా, విశ్వవిద్యాలయం పరిసరాలను రెడ్ జోన్, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

1, జులై 2026

ఏపీలో పిడుగుల హెచ్చరిక..  : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
వ్యవసాయం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

22, జూన్ 2026

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ
జిల్లా వార్తలు

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ

మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయని, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. అమర్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

18, జూన్ 2026

ఘాట్‌ రోడ్డులో ఘోరం: ఐచర్‌ వాహనం లోయలో పడి క్లీనర్‌ మృతి
జిల్లా వార్తలు

ఘాట్‌ రోడ్డులో ఘోరం: ఐచర్‌ వాహనం లోయలో పడి క్లీనర్‌ మృతి

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు–పులివెందుల ఘాట్‌ రోడ్డులో టమాటా, కట్టెలు లోడుతో వెళ్తున్న ఐచర్‌ వాహనం 50 అడుగుల లోయలో పడిపోవడంతో క్లీనర్‌ నవేంద్ర (30) అక్కడికక్కడే మృతి చెందాడు. నెల్లూరు జిల్లాకు చెందిన డ్రైవర్‌ వెంకటరమణారెడ్డి ప్రమాదం తర్వాత కనిపించకుండా పోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, జూన్ 2026

టిడ్కో ఇళ్ల గందరగోళం: శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల మందికి రూ.3.4 కోట్లు బకాయి
జిల్లా వార్తలు

టిడ్కో ఇళ్ల గందరగోళం: శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల మందికి రూ.3.4 కోట్లు బకాయి

టిడ్కో ఇళ్ల కోసం సొమ్ము చెల్లించిన లబ్ధిదారులు ఇళ్లూ దక్కక, డబ్బూ తిరిగి రాక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనే సుమారు 10 వేల మందికి రూ.3.4 కోట్లు రావాల్సి ఉండగా, అందులో కొంత మాత్రమే జమైంది. కొత్త కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి, పత్రాలు పూర్తి చేసిన అర్హులైన వారికి దశలవారీగా చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతుండగా, లబ్ధిదారులు తమ సొమ్ము త్వరగా అందాలని ఎదురు చూస్తున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters