విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రాణాయామం చేయించారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో ముఖ్యమంత్రి యోగా సాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.