బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#యూనియన్

17 articles

రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
జిల్లా వార్తలు

రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

రాయచోటి పట్టణంలో బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషా, ట్రాఫిక్ విభాగం ప్రతినిధులు ప్రమాదాల నివారణ, మీటర్లు, వాహన పత్రాలు, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని సూచించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని యూనియన్, నాయకులు అభిలషించారు.

7, ఆగ 2026

గుత్తిలో జర్నలిస్టుల ధర్నా
జిల్లా వార్తలు

గుత్తిలో జర్నలిస్టుల ధర్నా

అనంతపురం జిల్లా గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నివాస స్థలాల పట్టాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు మస్తాన్, గోవిందు, తన్నీరు నాయకత్వంలో జరిగిన ఈ నిరసన అనంతరం వారు మండల రెవిన్యూ అధికారి ఆనందబాబుకు వినతిపత్రం అందజేయగా, ఆయన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

6, ఆగ 2026

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు
జిల్లా వార్తలు

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో 'చలో కలెక్టరేట్ ’ధర్నాకు సంబంధించి పెనుకొండలో AP అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ , CITU ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాలు, సేవా నిబంధనలు, ఇతర హక్కుల సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు.

31, జులై 2026

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు
ఉద్యోగాలు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా 2026 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 395 మేనేజర్ ఖాళీలను ప్రకటించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టులకు సంబంధిత డిగ్రీ, కొన్నింటికి అనుభవం అవసరమై, రిటన్ ఎక్సమినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. పూర్తి వివరాలు, ఫీజు, పరీక్ష విధానం నోటిఫికేషన్‌లో ఇవ్వబడినందున అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

27, జులై 2026

పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
జిల్లా వార్తలు

పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

తిరుపతి జిల్లా పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్న ఈ సదస్సులో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండడం, వాహన పత్రాలు చెల్లుబాటులో ఉంచుకోవడం వంటి అంశాలపై పోలీసులు సూచనలు ఇచ్చారు. రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

21, జులై 2026

శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు సరికాదు: APUWJ జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్
జిల్లా వార్తలు

శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు సరికాదు: APUWJ జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్

APUWJ జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్ శ్రీశైల దేవస్థానం మీడియాపై విధించిన ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రోటో కాల్ పేరుతో దళారులను అరికట్టలేని అధికారులు మీడియాను మాత్రమే నిరోధించడం పునరాలోచనీయమని పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్, ఈవో వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని, కొనసాగితే యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

19, జులై 2026

బిగ్ అలెర్ట్..  యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్!
ఉద్యోగాలు

బిగ్ అలెర్ట్.. యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

17, జులై 2026

జులై 26న నాగర్ కర్నూల్‌లో ఏఐటీయూసీ 3వ మహాసభలు
జిల్లా వార్తలు

జులై 26న నాగర్ కర్నూల్‌లో ఏఐటీయూసీ 3వ మహాసభలు

జులై 26న నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సుండీపెంటలో ఏఐటీయూసీ 3వ మహాసభలు జరగనున్నాయి. ఆర్టిజన్ల పర్మినెంట్ ఉద్యోగాలు, APSEB సర్వీస్ రూల్స్ అమలు, Jenco ప్రైవేటీకరణ వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు వంటి అంశాలపై విస్తృత చర్చతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. తాడూరు మండల కేంద్రంలో జరిగే మహా ప్రదర్శనకు కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని నాయకత్వం పిలుపునిస్తోంది.

16, జులై 2026

శేఖర్‌ మాస్టర్‌కు నాకూ గొడవలు లేవు  : స్పష్టం చేసిన జానీ మాస్టర్‌
సినిమా

శేఖర్‌ మాస్టర్‌కు నాకూ గొడవలు లేవు : స్పష్టం చేసిన జానీ మాస్టర్‌

నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌తో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్‌ అన్నారు. డ్యాన్సర్స్‌ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

13, జులై 2026

హైదరాబాద్‌లో డ్యాన్స్‌ మాస్టర్ల విభేదాలు…
సినిమా

హైదరాబాద్‌లో డ్యాన్స్‌ మాస్టర్ల విభేదాలు…

హైదరాబాద్‌లోని "అనంతజనశక్తి న్యూస్" AP & TG అసోసియేషన్‌లో డ్యాన్స్‌ మాస్టర్లు శేఖర్, జానీ వర్గాల మధ్య ఎన్నికల విధానం, సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ, నిధుల వినియోగం వంటి అంశాలపై తీవ్ర విభేదాలు చెలరేగాయి. గుంపులుగా ఏర్పడిన ఇరువర్గాల మధ్య ఆరోపణలు, మాటల యుద్ధం కొనసాగుతుండగా, వివాదం సద్దుమణిగేలా యూనియన్‌ పెద్దలు, సీనియర్‌ డ్యాన్స్‌ మాస్టర్లు మధ్యవర్తిత్వం చేయాలని సభ్యులు కోరుతున్నారు.

13, జులై 2026

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
జిల్లా వార్తలు

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

మదనపల్లె జిల్లా కేంద్రంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి ధర్నా చేశారు. వేతనాల పెంపు, పెండింగ్ ప్రమోషన్లు, పని పరిస్థితుల మెరుగుదల, సామాజిక భద్రతా పథకాలు, నవచేతన యాప్ రద్దు, పిల్లల అవసరాలకు అనుగుణంగా కొత్త అంగన్‌వాడీ కేంద్రాల మంజూరును డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కారం వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు సంకల్పం వ్యక్తం చేశారు.

10, జులై 2026

టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి! : రేపు సీఎం విజయ్‌ కీలక సమావేశం
జాతీయం

టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి! : రేపు సీఎం విజయ్‌ కీలక సమావేశం

తమిళనాడులో టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్ర పక్ష పార్టీల నేతలతో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్‌ సమావేశం నిర్వహించనున్నారు.

30, జూన్ 2026

భారత్‌లో డిజిటల్‌ మోసాలు రెట్టింపు: ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక
నేరాలు

భారత్‌లో డిజిటల్‌ మోసాలు రెట్టింపు: ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక

ట్రాన్స్‌యూనియన్‌ ‘టాప్‌ ఫ్రాడ్‌ ట్రెండ్స్‌’ నివేదిక ప్రకారం భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల్లో మోసాల రేటు 7.1 శాతం ఉండగా, అంతర్జాతీయ సగటు 3.8 శాతం మాత్రమే నమోదైంది. లాజిస్టిక్స్‌, టెలికాం, బీమా రంగాల్లో మోసాలు ఎక్కువగా ఉండి, ముఖ్యంగా అకౌంట్‌ లాగిన్‌ దశలో 3.9 శాతం మోసపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువల్ల ఐడెంటిటీ వెరిఫికేషన్‌, టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వంటి భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయాలని నివేదిక సూచించింది.

17, జూన్ 2026

‘సూర్య 50’కి ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌?
సౌత్ ఇండియా

‘సూర్య 50’కి ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌?

సూర్య 50వ చిత్రానికి ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించే అవకాశాలపై కోలీవుడ్‌లో ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో, అనిరుధ్‌ సంగీతంతో ఈ ప్రాజెక్ట్‌ రావచ్చని టాక్‌ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఏ అంశంపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు.

16, జూన్ 2026

UPSC నోటిఫికేషన్ విడుదల :  400కు పైగా ఉద్యోగ ఖాళీలు
విద్య

UPSC నోటిఫికేషన్ విడుదల : 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన నియామక నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రత్యక్ష నియామక పథకం కింద 98 రకాల పోస్టులకు 400కు పైగా ఖాళీలను ప్రకటించింది. సాంకేతిక, శాస్త్రీయ, పరిపాలనా, వైద్య, విద్యా రంగాలతో పాటు పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఉద్యోగాలు ఉండగా, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 3, 2026 సాయంత్రం 6 గంటల వరకు UPSC ORA పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

15, జూన్ 2026

గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో పాత భవనాలపై ఆందోళన
జిల్లా వార్తలు

గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో పాత భవనాలపై ఆందోళన

గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో 6, 7 ప్లాట్‌ఫారాల మధ్య ఉన్న శతాబ్దం నాటి పాత స్టేషన్‌ భవనాలు శిథిలావస్థలో ఉండటంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్రిత్ భారత్ స్టేషన్ పథకంలో గుంతకల్లు స్టేషన్‌ను చేర్చకపోవడం, పాత భవనాల బలపర్చడంపై స్పష్టమైన చర్యలు లేకపోవడాన్ని రైల్వే మజ్దూర్ యూనియన్ సహా స్థానికులు విమర్శిస్తున్నారు. భవనాలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సంతోష్‌కుమార్‌ తెలిపారు.

13, జూన్ 2026

ఇంధన సరఫరాపై ఆందోళన అవసరం లేదు
జాతీయం

ఇంధన సరఫరాపై ఆందోళన అవసరం లేదు

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్‌లో ఇంధన లభ్యతపై ఆందోళన అవసరం లేదని యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి తెలిపారు. దేశానికి 76–80 రోజుల చమురు, వాయువు నిల్వలు ఉండగా, 41 దేశాల నుంచి దిగుమతులు విస్తరించడం వల్ల సరఫరా అంతరాయం వచ్చినా సమీప భవిష్యత్తులో ఇంధన కొరత ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters