వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం

తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి ప్రయత్నిచారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా, ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని వైసీపీ పార్టీ శ్రేణులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై జేసీ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు కళ్లముందే జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానికంగా,  వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాళ్లదాడి లో ఆసుపత్రి వద్ద స్కార్ఫియో ధ్వంసం అయింది. ఆసుపత్రి అద్దాలు పగిలి పోయాయి. పట్టణం లో పరిస్థితి ఉద్రిక్తత గా మారింది.