బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#politics

127 articles

ప్రొద్దుటూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. మల్లెల లింగారెడ్డి గాంధీ పార్కులో వాకర్స్‌ను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు పథకాల ప్రయోజనాలు, అమలు పరిస్థితులను బూత్ స్థాయిలో ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇతర ప్రాంతాలు, గ్రామాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

9, ఆగ 2026

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్
జిల్లా వార్తలు

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్

కదిరి ప్రాంతంలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న బి.యస్. మక్బూల్, DSC–2025 నియామకాలలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులు నియామకాలలో పారదర్శకత లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం, నిరుద్యోగ భృతి అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు.

9, ఆగ 2026

అహోబిలంలో ‘అహోబిలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ ప్రారంభం
జిల్లా వార్తలు

అహోబిలంలో ‘అహోబిలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ ప్రారంభం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘అహోబిలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ ప్రారంభించినట్లు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి తెలిపారు. చెంచు గిరిజనుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి లక్ష్యంగా 80 శాతం సబ్సిడీతో గొర్రెలు, పాడి గేదెలు, విత్తనాలు, కుట్టు మిషన్లు వంటి ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొంటూ, అహోబిలం బ్రహ్మోత్సవాలకు నారా లోకేష్‌ను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

7, ఆగ 2026

ఎమ్మిగనూరు 10వ వార్డులో ఇంటింటికీ ప్రచారం, అభివృద్ధి పనుల పరిశీలన
జిల్లా వార్తలు

ఎమ్మిగనూరు 10వ వార్డులో ఇంటింటికీ ప్రచారం, అభివృద్ధి పనుల పరిశీలన

ఎమ్మిగనూరు పట్టణం 10వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరుతో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, Dr. B V జయనాగేశ్వర్ రెడ్డి ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. రెండు అన్నా క్యాంటీన్ల ద్వారా వేలాది పేదలు, కార్మికులకు తక్కువ ధరలో భోజనం అందుతున్నట్లు గుర్తుచేస్తూ, గోనెగండ్లలో మూడో అన్నా క్యాంటీన్ ఏర్పాటు, రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై పార్టీ నేతలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

7, ఆగ 2026

ఉన్నవి! రెండు ఎమ్మెల్సీలు :  20 మందికి పైగా పోటీదారులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
రాజకీయాలు

ఉన్నవి! రెండు ఎమ్మెల్సీలు : 20 మందికి పైగా పోటీదారులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ కానున్న రెండు గవర్నర్ నామినేటెడ్ (గవర్నర్ కోటా) ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో, 20 మందికిపైగా నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

27, జులై 2026

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ

బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. DSCలో అవకతవకలపై CBI విచారణ, సంబంధిత మంత్రి రాజీనామా, నిరుద్యోగ భృతి, ఫి రేయింబర్సుమెంట్ , వసతి దీవెన బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ, భోగాపురం Airport క్రెడిట్, Sports quota ఉద్యోగాల కేటాయింపులో ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

27, జులై 2026

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు..   సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
రాజకీయాలు

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు.

26, జులై 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం, వ్యక్తిగత నమ్మకం కీలకమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే మద్దతు లభిస్తుందని అన్నారు. జనసేనలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ వ్యూహాత్మకంగా కృషి చేయాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

24, జులై 2026

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం జల్ జీవం మిషన్ , అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో పనుల నాణ్యతపై రాజీ లేకుండా, వర్షాభావం, తాగునీటి ఎద్దడిని ముందుగానే ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

22, జులై 2026

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
రాజకీయాలు

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ ముట్టడి ప్రయత్నం సందర్భంగా బీజేపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు వార్తతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

22, జులై 2026

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి..   : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాజకీయాలు

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.

20, జులై 2026

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించేలా చర్చల్లో పాల్గొనాలని జనసేన ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై వ్యూహాలను వివరించడంతో పాటు జాతీయ చలన చిత్ర పురస్కారాలు సాధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులను ఆయన అభినందించారు.

19, జులై 2026

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్‌ పరామర్శ
రాజకీయాలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్‌ పరామర్శ

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్‌ పరామర్శించారు.

18, జులై 2026

ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయం!..:  ‘రా ఎన్టీఆర్’ వ్యవస్థాపకుడు సాయి రూప్  కీలక ప్రకటన
రాజకీయాలు

ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయం!..: ‘రా ఎన్టీఆర్’ వ్యవస్థాపకుడు సాయి రూప్ కీలక ప్రకటన

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు.

18, జులై 2026

‘రాకా’లో ప్రెగ్నెన్సీతోనే కఠిన యాక్షన్‌ సన్నివేశాలు పూర్తి చేసిన దీపికా
సినిమా

‘రాకా’లో ప్రెగ్నెన్సీతోనే కఠిన యాక్షన్‌ సన్నివేశాలు పూర్తి చేసిన దీపికా

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’లో నటిస్తున్న దీపికా పదుకొణె, గర్భిణీ అయిన సమయంలోనే కఠిన యాక్షన్‌ సన్నివేశాలను పూర్తి చేసి తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకున్నారు. మెటర్నిటీ విరామానికి ముందే తన భాగం పూర్తిచేయాలని నిర్ణయించుకుని, షూటింగ్‌తో పాటు కూతురు దువా సంరక్షణను సమతుల్యం చేస్తూ పనిచేస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

17, జులై 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ వ్యూహం పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి బలోపేతం, విజయం ప్రధాన లక్ష్యమని, అవసరమైతే జనసేన ఒక అడుగు వెనక్కు వేయడానికి సిద్ధమని, అయితే కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాల కల్పనలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

17, జులై 2026

లోకేష్‌ ను విమర్శించే అర్హత రాచమల్లుకు లేదు: ప్రవీణ్ కుమార్ రెడ్డి
జిల్లా వార్తలు

లోకేష్‌ ను విమర్శించే అర్హత రాచమల్లుకు లేదు: ప్రవీణ్ కుమార్ రెడ్డి

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నారా లోకేష్‌పై చేసిన విమర్శలను టిడిపి మాజీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, లోకేష్‌పై విమర్శించే అర్హత ఆయనకు లేదని అభిప్రాయపడ్డారు. లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ముఖ్యంగా ఐటి, పారిశ్రామిక రంగాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యక్తిగత అసంతృప్తులతో చేసే ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు నష్టం చేస్తాయని టిడిపి వర్గాలు చర్చించుకుంటున్నాయి.

17, జులై 2026

22 నుంచి ‘తల్లికి వందనం’ నిధుల జమ
రాజకీయాలు

22 నుంచి ‘తల్లికి వందనం’ నిధుల జమ

రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ నెల 22 నుంచి నిధుల జమ ప్రారంభం కానుంది. జూలై 22లోగా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని, మిగిలిన వారికి అడ్మిషన్లు, వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆగస్టులో నిధులు జమ చేయనుంది.

17, జులై 2026

పోక్సో పకడ్బందీగా అమలు చేయండి!  తెలంగాణ సీఎం రేవంత్‌ కు  పవన్ కల్యాణ్‌ లేఖ..
రాజకీయాలు

పోక్సో పకడ్బందీగా అమలు చేయండి! తెలంగాణ సీఎం రేవంత్‌ కు పవన్ కల్యాణ్‌ లేఖ..

పోక్సో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృతమైన లేఖ రాశారు.

16, జులై 2026

ముంబై ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజాల శస్త్రచికిత్స అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని జనసేన వర్గాలు తెలియజేస్తూ, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆకాంక్షిస్తున్నారు.

15, జులై 2026

కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్

కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కోనసీమ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ పరిస్థితులు, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష కోసం విస్తృత పర్యటన చేస్తున్నారు. వేమగిరి, ధవళేశ్వరం బ్యారేజీ, పిచ్చుకలంకలో రైతులతో సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతి, సమస్యలపై అధికారులతో సమీక్షించనున్నారు.

13, జులై 2026

సెప్టెంబర్ లేదా.. అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ
రాజకీయాలు

సెప్టెంబర్ లేదా.. అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జరపడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

11, జులై 2026

పవన్ కుడి భుజానికి సర్జరీ పూర్తి.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ..
రాజకీయాలు

పవన్ కుడి భుజానికి సర్జరీ పూర్తి.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ..

ఉప ముఖ్యమంత్రి పవన్ కుడి భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి డాక్టర్లు శనివారం సర్జరీ చేశారు. మూడున్నర గంటలపాటు సర్జరీ సాగింది. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు.

11, జులై 2026

శాంసంగ్ ఎగ్జిక్యూటివ్‌లతో నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

శాంసంగ్ ఎగ్జిక్యూటివ్‌లతో నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్‌లతో సియోల్‌లో సమావేశమై రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. 10 GW డేటా-సెంటర్ పైప్‌లైన్, AI-కంప్యూట్ స్టాక్ అభివృద్ధి, సర్వర్ తయారీ, సర్వీసింగ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కీలక టెక్నాలజీ హబ్‌గా మార్చే అవకాశాలను వివరించిన ఈ సమావేశం అనంతరం, శాంసంగ్‌తో మరిన్ని స్థాయిల్లో చర్చలు కొనసాగనున్నాయని అధికార వర్గాలు సూచించాయి.

10, జులై 2026

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు   సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం

వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల, జరీబు భూములకు రూ.60 వేల వార్షిక కౌలు పెంపు, నిర్వాసితులకు నెలకు రూ.10 వేల అద్దె సాయం, వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనలపై ముందడుగు వేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, CII సహా పలు సంస్థలకు భూ కేటాయింపులు, SIPB ఆమోదించిన 11 మెగా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ద్వారా రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాలు సృష్టించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.

10, జులై 2026

నల్లమలలో వెలుగులోకి అమరావతి శాసనాలు : అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
రాజకీయాలు

నల్లమలలో వెలుగులోకి అమరావతి శాసనాలు : అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

నల్లమలలో ASI సర్వే ద్వారా వెలుగులోకి వచ్చిన 13వ శతాబ్ద శాసనాలు అమరావతి చరిత్రను స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అమరావతిపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు ఇవి సమాధానమివ్వడంతో పాటు, మన వారసత్వ సంపదను గుర్తించి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంటూ అటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

8, జులై 2026

వ్యవసాయం నుంచి క్వాంటం వరకు..  ఏపీ దూసుకుపోతోంది : నారా  లోకేష్
రాజకీయాలు

వ్యవసాయం నుంచి క్వాంటం వరకు.. ఏపీ దూసుకుపోతోంది : నారా లోకేష్

నారా లోకేష్ అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం నుంచి క్వాంటం టెక్నాలజీ, సంజీవని నుంచి స్మార్ట్ హెల్త్‌కేర్ వరకు అన్ని కీలక రంగాల్లో సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది. సంప్రదాయ రంగాల బలోపేతంతో పాటు ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, యువత ఉపాధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలలో రాష్ట్రం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

8, జులై 2026

ప్రతీకార రాజకీయాలు ఆపాలి, UAPA చట్టం తొలగించాలి: ప్రకాష్ రాజ్ ట్వీట్
రాజకీయాలు

ప్రతీకార రాజకీయాలు ఆపాలి, UAPA చట్టం తొలగించాలి: ప్రకాష్ రాజ్ ట్వీట్

నటుడు ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్‌లో ప్రతీకార రాజకీయాలు ఆపాలని, సాధారణ ప్రజలపై అమలవుతున్న కఠిన UAPA చట్టాన్ని తొలగించాలని కోరారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.

7, జులై 2026

17న ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్

17న ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్

ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. రంపచోడవరం ప్రాంతంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానుండగా, విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు పంపిణీ చేసి వారి విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన, సహపాఠ్య కార్యకలాపాలపై పూర్తి సమాచారం అందించనున్నారు. తల్లిదండ్రుల సూచనలను భవిష్యత్ విద్యా ప్రణాళికల్లో పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

7, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters