రాయలసీమ న్యూస్, అన్నమయ్య:
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నిరసన : మదనపల్లెలో చలో కలెక్టరేట్
మదనపల్లె: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ ప్రతిభకు పాతరేసి, ఉద్యోగాలను అమ్ముకోవడంపై యువతలో నిరసన వ్యక్తం అవుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే డీఎస్సీను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పిలుపుతో ఆ పార్టీ యువజన విభాగం నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్యక్రమం మదనపల్లెలో విజయవంతమైంది. మెగా డీఎస్సీ నియామకాలు అక్రమాలమయమని.. వాస్తవాలు కళ్లకు కనిపిస్తున్నా ప్రభుత్వం నటిస్తోందని, తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతిభగల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే డీఎస్సీ కాదని, అది ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన దళారుల సెలక్షన్ కమిటీ అని వారు ఆరోపిచ్చారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ మాధవకృష్ణారెడ్డికి నేతలు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకురాలు అనీషారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నేతలు శివప్రసాద్‌రెడ్డి, కిషోర్, కిశోర్‌కుమార్‌రెడ్డి, అశోక్, యూనిస్, ఫిరోజ్, ఆనంద్ రెడ్డి, చక్రధర్, గౌతం, భాస్కర్, బాలాజీ, హర్షవర్దన్‌రెడ్డి, దావూద్, కౌషిక్, వాసుదేవరెడ్డి, షేక్ ఇర్ఫాన్, ఖాదర్, హేమంత్, ద్వారకనాధరెడ్డి, పవన్, నాగరాజు రెడ్డి, ఆనంద్, శరత్ రెడ్డి పాల్గొన్నారు.













