బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జగన్

96 articles

తిరుపతిలో NIELIT శాశ్వత క్యాంపస్‌కు పంపిన DPR వివరాలు బహిర్గతం
జిల్లా వార్తలు

తిరుపతిలో NIELIT శాశ్వత క్యాంపస్‌కు పంపిన DPR వివరాలు బహిర్గతం

తిరుపతిలో NIELIT శాశ్వత క్యాంపస్‌ కోసం గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రక్రియకు సంబంధించిన DPR, భూకేటాయింపు వివరాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతిలోనే శాశ్వత కేంద్రం ఏర్పాటు కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయగా, NIELIT నిపుణులు సిద్ధం చేసిన DPRలో 15 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని నమోదు చేశారు. ఈ దశలోనే కేంద్రాన్ని అమరావతికి తరలించే ప్రయత్నాలపై రాయలసీమ విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ప్రాజెక్టు భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని స్థానిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

31, ఆగ 2026

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌ పర్యటన
జిల్లా వార్తలు

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌ పర్యటన

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో పులివెందుల, ఇడుపులపాయల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పులివెందులలో ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు తెలుసుకోనుండగా, ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించే కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు.

31, ఆగ 2026

59 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటర్లు
జిల్లా వార్తలు

59 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటర్లు

చిత్తూరు కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో 59 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటర్లు పంపిణీ చేశారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలు, చలనం మెరుగుపరచడమే లక్ష్యంగా ఒక్కో వాహనం సుమారు రూ.1.20 లక్షల విలువ గల స్కూటర్లను ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా పారదర్శకంగా ఇచ్చినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు.

29, ఆగ 2026

స్థానిక సంస్థల ఎన్నికలపై YSRCP దృష్టి.. నేతలకు మాజీ సీఎం జగన్ కీలక దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై YSRCP దృష్టి.. నేతలకు మాజీ సీఎం జగన్ కీలక దిశానిర్దేశం

స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ అత్యంత కీలకంగా పరిగణిస్తూ, పార్టీ భవిష్యత్తు, నేతల పనితీరును అంచనా వేసే ప్రమాణంగా చూడాలని వైఎస్ జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి చోటా పోటీని ప్రోత్సహించి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, “గెలిచినోడే సికిందర్” అన్న లక్ష్యంతో సమన్వయంతో పనిచేయాలని, అక్రమాలకు తావు ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

26, ఆగ 2026

హంద్రీనీవా నీటిని రైతులకు వినియోగించే వీలు కల్పించాలి: ఏపీ రైతు సంఘం
జిల్లా వార్తలు

హంద్రీనీవా నీటిని రైతులకు వినియోగించే వీలు కల్పించాలి: ఏపీ రైతు సంఘం

ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. జగన్నాథం జిల్లాలో కరవు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హంద్రీనీవా కాలువ నీటిని పంటల కోసం వినియోగిస్తున్న రైతులపై ఒత్తిడి తేవద్దని, మోటార్లు తొలగిస్తామని బెదిరించడం తగదని అన్నారు. పంటలను కాపాడుకోవడానికి ఈ నీటే ఆధారమైందని, రైతుల మోటార్లను తొలగించకుండా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అధికారులకు రైతులకు అనుకూలంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

24, ఆగ 2026

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, గత వైఎస్ జగన్ ప్రభుత్వం ‘నాడు–నేడు’, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల మాధ్యమం, ‘అమ్మ ఒడి’ వంటి కార్యక్రమాలతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ, పెండింగ్‌లో ఉన్న ‘నాడు–నేడు’ పనులను పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

18, ఆగ 2026

సోమవారం ప్రొద్దటూరులో  DSC అక్రమాలపై  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ
జిల్లా వార్తలు

సోమవారం ప్రొద్దటూరులో DSC అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రేపు ఉదయం 9.30 గంటలకు DSC అక్రమాలు, ఫీజు రీ ఎంబర్స్మెంట్, నోరుద్యోగ భృతి వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. మునిసిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీని రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నడిపించగా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా చేయడమే లక్ష్యంగా పార్టీ గ్రామ, వార్డు కమిటీలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

9, ఆగ 2026

చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి టీచర్ల ఆగ్రహం
జిల్లా వార్తలు

చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి టీచర్ల ఆగ్రహం

మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయ వర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తమ ఆత్మగౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్న ధోరణికి నిరసనగా టీచర్లు చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి తమ ధ్వనిని బలంగా వినిపిస్తూ, తప్పుడు ప్రచారాలు వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.

9, ఆగ 2026

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్
జిల్లా వార్తలు

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్

కదిరి ప్రాంతంలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న బి.యస్. మక్బూల్, DSC–2025 నియామకాలలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులు నియామకాలలో పారదర్శకత లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం, నిరుద్యోగ భృతి అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు.

9, ఆగ 2026

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం
జిల్లా వార్తలు

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం

జమ్మలమడుగులో రిలే నిరాహార దీక్ష సమయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు ఉద్రిక్తతకు దారితీస్తూ, వైఎస్ఆర్సిపి దీనిని అక్రమ చర్యగా అభివర్ణిస్తోంది. DSC నియామకాల్లో అక్రమాలు, పారదర్శకత లోపంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతుండగా, జమ్మలమడుగులో రాజకీయ వేడి చెలరేగింది.

8, ఆగ 2026

ప్రొద్దుటూరు చాముండేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకారం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు చాముండేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకారం

వైఎంఆర్ కాలనీలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో చాముండేశ్వరి అమ్మవారికి శాకంబరీ దేవి అలంకారం నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలతో చేసిన విశిష్ట అలంకారం, విశేష పూజా కార్యక్రమాలు చూసేందుకు ప్రొద్దుటూరు పట్టణం, పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సమృద్ధి వర్షాలు, పాడిపంటల అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.

8, ఆగ 2026

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌పై రాజకీయ కక్ష్య: రాచమల్లు ఆరోపణ
జిల్లా వార్తలు

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌పై రాజకీయ కక్ష్య: రాచమల్లు ఆరోపణ

కడపలోని జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీకి ముడిసరుకు సరఫరా నిలిపివేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష్యతో వ్యవహరిస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పరిశ్రమలపై ఇలాంటి ఒత్తిడి తంతులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల వాతావరణానికి హానికరమని, రాజకీయ భేదాభిప్రాయాలను వ్యాపార రంగంతో ముడిపెట్టడం వల్ల పెట్టుబడులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

7, ఆగ 2026

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే దీక్షలు ప్రారంభం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే దీక్షలు ప్రారంభం

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై CBI దర్యాప్తు, మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీ ఎంబర్సిమెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. మునిసిపల్ ఆఫీస్ ఎదుట జరుగుతున్న ఈ దీక్షల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వరుసగా పాల్గొంటూ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

6, ఆగ 2026

ప్రజల  దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

2, ఆగ 2026

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
జిల్లా వార్తలు

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

31, జులై 2026

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాజకీయాలు

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

31, జులై 2026

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి రహదారి కూడలిలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో తోలుఖర్జ గ్రామానికి చెందిన సహదేవుడు అక్కడికక్కడే మృతి చెందగా, జొల్లగూడకు చెందిన జగన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జగన్‌ను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెచ్చరించారు.

30, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

వరాహావతారంలో జగన్నాథుడు, నరసింహ రూపంలో బలరాముడు దర్శనం
భక్తి

వరాహావతారంలో జగన్నాథుడు, నరసింహ రూపంలో బలరాముడు దర్శనం

గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో రథయాత్ర ఉత్సవం సందర్భంగా గుండిచా మందిర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వరాహావతారంలో జగన్నాథ స్వామి, నరసింహ అవతారంలో బలరామస్వామి ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చగా, భక్తులు దీర్ఘదర్శనాలు చేసి జపాలు, భజనలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలసి చేపట్టారు.

19, జులై 2026

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట : ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు
జాతీయం

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట : ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట వల్ల డజన్ల కొద్దీ భక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా దర్శనంకోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడటంతో గ్రాండ్ రోడ్ (బడా దండా)పై ఈ గందరగోళం చెలరేగింది.

16, జులై 2026

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..
రాజకీయాలు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్‌ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.

16, జులై 2026

ఏపీలో గాడితప్పిన పాలన :  స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

ఏపీలో గాడితప్పిన పాలన : స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

16, జులై 2026

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు
జిల్లా వార్తలు

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు

కడప జిల్లా ప్రొద్దటూరు లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాచమల్లు సునీల్ రెడ్డి, ఏ సమస్య వచ్చినా కొందరు నాయకులు వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును లాగి నెపం మోపడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఆరోపణల రాజకీయాలు చేస్తూ పాలన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఈ ధోరణిని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

16, జులై 2026

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి
జాతీయం

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి  పాల్గొన్నారు.

16, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters