రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదిన కర్మకు హాజరయ్యేందుకు ఆటోలో బయల్దేరారు. కామేపల్లి రైల్వే అండర్‌పాస్ సమీపానికి వచ్చేసరికి.. గ్రానైట్‌తో వస్తున్న లారీ మలుపుతిరుగుతూ.. ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుకొండలు (60), రమణమ్మ (50) అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఏడుగురిని సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుబ్బాయమ్మ (70) ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీ కొట్టిన లారీ.. ముగ్గురి మృతి
రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
1 నిమిషాల చదువు
123 views
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

- రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
▸ తాజా నేరాలు వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 22 Jun 2026, 14:34 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.






