రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశం వాగ్వాదంతో దద్దరిల్లింది. జడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులతో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది.
సభ్యులు లేవనెత్తిన సమస్యలకు ఓపికగా, సమగ్రంగా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ప్రతిపక్ష సభ్యులను బెదిరించేలా మాట్లాడటం సరికాదని జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ అభిప్రాయపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యే ప్రవర్తనపై వైసీపీ జడ్పీటీసీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమావేశంలో కనిపించింది.
జిల్లాలో ఎల్నినో పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, నీటి సమస్యలపై ఈ సమావేశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల వారీగా చేపట్టిన చర్యలపై సభ్యులు వివరాలు కోరారు.
జడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ చివరి సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, చెరువుల నింపుదల, అవగాహన కార్యక్రమాల అమలు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సభ్యులు తమ తమ మండలాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాల వారిగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. HNSS, HLC ద్వారా ప్రతి చెరువును పూర్తిస్థాయిలో నింపుతామన్నా
ఎల్నినో ప్రభావం తగ్గించే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎంపీ, ఎమ్మెల్యే వివరించినప్పటికీ, వాటి అమలు స్థాయిపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని ప్రాంతాల్లో చెరువులు ఇంకా పూర్తిగా నిండలేదని, నీటి పంపిణీ సమర్థవంతంగా జరగడం లేదని సభ్యులు పేర్కొన్నారు.
సమావేశం మొత్తం ఎల్నినో పరిస్థితులు, నీటి వనరుల వినియోగం, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై చర్చ సాగింది. సభ్యుల ప్రశ్నలు, ప్రజా సమస్యలపై వచ్చిన స్పందన మధ్యలో చోటుచేసుకున్న వాగ్వాదం కారణంగా సమావేశం ఉద్రిక్తంగా మారినప్పటికీ, అనంతరం చర్చ కొనసాగింది.













