జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన..

ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ పురస్కారం

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ మొత్తం 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. ‘చందూ ఛాంపియన్‌’, ‘భ్రమయుగం’లో నటనకు గానూ కార్తిక్‌ ఆర్యన్‌, మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా యామి గౌతమ్‌ (ఆర్టికల్‌ 370) పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్‌ పెరియాసామి (అమరన్‌) ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ (committee kurrollu) జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా ‘రాయన్‌’ నిలిచింది.

జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలు వీళ్లే

  • ఉత్తమ నటుడు: కార్తిక్‌ ఆర్యన్‌ (చందూ ఛాంపియన్‌)

  • ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)

  • ఉత్తమ నటి: యామి గౌతమ్‌ (ఆర్టికల్‌ 370)

  • ఉత్తమ చిత్రం: ఆర్టికల్‌ 370 (ఆదిత్య సుహాస్‌ జంబాలే)

  • ఉత్తమ దర్శకత్వం: అమరన్‌ (రాజ్‌కుమార్‌ పెరియసామి)

  • ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే)

  • ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్‌ (మహారాజ)

  • ఉత్తమ సహాయ నటుడు: సంజయ్‌ మిశ్రా (భక్షక్‌)

  • ఉత్తమ బాలల చిత్రం: చిన్న కథ కాదు (దర్శకుడు-నంద కిషోర్‌)

  • ఉత్తమ జాతీయ, విలువల చిత్రం: కెప్టెన్‌ మిల్లర్‌ (దర్శకుడు- అరుణ్‌ మాథేశ్వరన్‌)

  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (నాగ్‌ అశ్విన్)

  • ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణ్‌దీప్‌ హుడా (స్వాతంత్ర్య వీర్‌ సావర్కర్‌)


  • ఉత్తమ యాక్షన్‌: మహారాజ (తమిళ్‌)

  • ఉత్తమ కొరియోగ్రఫ్రీ: విజయ్‌ గంగూలీ (ఆజ్‌ కిరాత్‌ -స్త్రీ2)

  • ఉత్తమ గేయరచన: మనోజ్‌ ముంతాషిర్‌ (జానేదో-మైదాన్‌)

  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్ కుమార్‌ (అమరన్‌)

  • ఉత్తమ సంగీతం (సాంగ్స్‌) : శశ్వాంత్‌ సచ్‌దేవ్‌ (ఆర్టికల్‌ 370)

  • ఉత్తమ మేకప్‌: పి. రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు)

  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: దీపాలి నూర్‌, సీతల్‌ శర్మ (పుష్ప2)

  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైనర్‌: నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

  • ఉత్తమ ఎడిటింగ్‌: ఆర్‌ కలైవానన్‌ (అమరన్‌)

  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: మానస్‌ చౌదరి (భూల్‌ భూలయ్య 3-హిందీ)

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (అడాప్టెడ్‌): యోగేశ్‌ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుదిర్‌ ఫాడ్కే)

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్‌): సుకుమార్‌ (పుష్ప2)

  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్‌ జలాల్‌ (భ్రమయుగం)

  • ఉత్తమ గాయని: వైకోమ్‌ విజయలక్ష్మీ (ఏఆర్‌ఎం)

  • ఉత్తమ గాయకుడు: అభయ్‌ జోథ్‌ పూర్కర్‌ (గరాత్‌ గణపతి)

  • ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్‌ బెనర్జీ, తపోమయ్‌ దేవ్‌, గీతాశ్రీ చక్రవర్తి (ఆంకో కి కితిన్‌ -బెంగాలీ)

  • ఉత్తమ బాల నటుడు : అరుణ్‌దేవ్‌ పోతుల (35 - చిన్న కథ కాదు)

  • ఉత్తమ బాల నటుడు: అతిశ్‌ శెట్టి

  • స్పెషల్‌ మెన్షన్‌: మెయ్యజగన్‌-తమిళ్‌ (ఫిల్మ్‌ సౌండ్‌ మిక్స్‌ ఇంజినీర్‌: సురేన్‌ జి ) కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళ్‌): ధనుష్‌

అవార్డు దక్కించుకున్న ప్రాంతీయ చిత్రాలివే!

  • ఉత్తమ తుళు ఫిల్మ్‌: ఇంబు

  • ఉత్తమ గర్వాలీ ఫిల్మ్‌: ధోలి

  • ఉత్తమ తెలుగు ఫిల్మ్‌: కమిటీ కుర్రోళ్లు

  • ఉత్తమ తమిళ్‌ ఫిల్మ్‌: రాయన్‌

  • ఉత్తమ ఒడియా ఫిల్మ్‌: లహరి

  • ఉత్తమ మరాఠీ ఫిల్మ్‌: ముక్కమ్‌ పోస్ట్‌ బొంబిల్‌ వాడి

  • ఉత్తమ మణిపురి ఫిల్మ్‌: సునిత

  • ఉత్తమ మలయాళం ఫిల్మ్‌: ఫెమినిచ్చి ఫాతిమా

  • ఉత్తమ కొంకణి ఫిల్మ్‌: మోగ్‌ ఆసుమ్‌

  • ఉత్తమ కన్నడ ఫిల్మ్‌: మిథియా  

  • ఉత్తమ హిందీ ఫిల్మ్‌: శ్రీకాంత్‌

  • ఉత్తమ గుజరాతీ ఫిల్మ్‌: మారన్‌

  • ఉత్తమ బెంగాలీ ఫిల్మ్‌: చలిచిత్ర ఎకోన్‌

  • ఉత్తమ అస్సామీ ఫిల్మ్‌: జుయ్‌ఫిల్మ్‌ (ఆరెంజ్‌ అండ్‌ పర్పుల్‌)

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీ

  • స్పెషల్ జ్యూరీ: చోలా డోరా ఔర్‌ సుయ్‌ (హిందీ); భద్రకాళి నాటకం (మలయాళం)

  • ఉత్తమ స్క్రిప్ట్‌: ఓబర్‌ (హిందీ కశ్మీరీ) ఫరాజ్‌ అలీ

  • ఉత్తమ వాయిస్‌ ఓవర్: లిటిల్‌ ప్లానెట్‌: ఏ టేల్‌ ఆఫ్‌ ఫ్రాగ్స్‌ (ఇంగ్లీష్‌) సుందరాయ జయచంద్రన్‌

  • ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్షన్‌: పరాట్‌ 41డిగ్రీస్‌ ఛాయా మగవీర్‌: శివ్‌ పాల్‌సింగ్‌ కాంగ్‌

  • ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: హమ్‌సఫర్‌ (మరాఠీ)

  • ఉత్తమ యానిమేషన్‌ ఫిల్మ్‌: టచ్డ్‌ ఏజ్‌ వాటర్‌

  • ఉత్తమ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌ : పిప్లంత్రి: ఏ టేల్‌ ఆఫ్ ఎకో ఫెమినిజం

  • ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్‌-నామి (హిందీ)

  • ఉత్తమ ఆర్ట్‌/కల్చర్‌: మెయిన్‌ నిదా (హిందీ)

  • ఉత్తమ హిస్టారికల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కాంపిలేషన్‌ మూవీ: కకోరి (హిందీ)