రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా (COAS) ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు. ఆర్మోర్డ్ కార్ప్స్ (ట్యాంక్ రెజిమెంట్) విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్ఠించిన 7వ అధికారిగా ధీరజ్ సేథ్ రికార్డు సృష్టించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో సైనిక సంప్రదాయాల మధ్య అధికారికంగా కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఆర్మోర్డ్ కార్ప్స్‌లో (2nd Lancers) కమిషన్డ్ అధికారిగా జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్థానం ప్రారంభించారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. సైన్యంలో కీలకమైన సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్.. రెండింటికీ ఆర్మీ కమాండర్‌గా ధీరజ్ సేథ్ వ్యవహరించారు. రక్షణ విభాగంలో ప్లానింగ్, కేపబిలిటీ డెవలప్‌మెంట్‌లో విశేష అనుభవం.. సైన్యం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.







