పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు

కారు కు కట్టి నిందితులను ఊరేగించిన పోలీసులు

మహారాష్ట్రలోని పుణె నగరంలోని కాత్రాజ్ ప్రాంతంలో నడిరోడ్డుపై పదునైన ఆయుధాలతో హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీసు వాహనం బంపర్‌కు కట్టి ప్రాంతంలో ఊరేగించారు.
ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, నేరస్థులకు గట్టి హెచ్చరిక ఇవ్వడమే ఈ చర్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.