రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను కలిసిన ఆయన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇటీవల ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి సర్జరీ చేసింది.







