రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్
పోలీసులతో వాగ్వాదం.. రోడ్డుపై బైఠాయింపు
అనంతపురంలో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు కుడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా తనికీలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడుకుని అరెస్ట్ చేశారు. వివరాల మేరకు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్.. రాప్తాడుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు పెనుకొండలో అడ్డుకున్నారు. అనంతరం, వాగ్వాదం జరగడంతో పోలీసులు.. ఉషాశ్రీచరణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో, పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.







