బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అరెస్ట్‌

36 articles

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం
తమిళనాడు

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం

తంజావూరులో నిరసన సందర్భంగా నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో భారీ రాజకీయ కలకలానికి దారితీశాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, భాజపా సహా పలు పార్టీలు దీనిని స్వాగతించగా డీఎంకే అణచివేత చర్యగా విమర్శించింది. ఉదయనిధి వ్యాఖ్యలను భాజపా, ఎండీఎంకే, పీఎంకే నేతలు తీవ్రంగా ఖండించగా, డీఎంకే మాత్రం ఆయన ప్రసంగంలో అవమానకర అంశాలు లేవని వాదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది.

5, ఆగ 2026

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల
జిల్లా వార్తలు

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్ట్‌పై అసెంబ్లీ బులిటెన్ విడుదల

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని ఆగస్టు 2 తెల్లవారుజామున చిప్పగిరిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్‌లో వెల్లడించారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 37/2026, 38/2026 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, మొత్తం 34 మందిపై చర్యలు తీసుకుని, ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

5, ఆగ 2026

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్
రాజకీయాలు

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్

వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

23, జులై 2026

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌
జిల్లా వార్తలు

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని అక్కడే యథాతథంగా తితిదే ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

23, జులై 2026

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం
జిల్లా వార్తలు

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం

నీట్‌ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. కడపలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, ధర్నాలో నాయకులు విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, పరీక్షలపై నమ్మకం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పరీక్షా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, బాధ్యులపై కఠిన చర్యలు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌
జాతీయం

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్‌ ఏ మహ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేసింది.

17, జులై 2026

భారత్‌లోకి  యూస్‌ మాజీ సైనికుల చొరబాటు
అంతర్జాతీయం

భారత్‌లోకి యూస్‌ మాజీ సైనికుల చొరబాటు

భారత్‌-నేపాల్‌ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (SSB) మరో అమెరికన్‌ను అదుపులోకి తీసుకుంది. మణిపుర్‌లో అమెరికా డ్రోన్ నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్‌ను ఇటీవల భారత సైన్యం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా..

14, జులై 2026

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్‌ – 25 బైకులు స్వాధీనం
జిల్లా వార్తలు

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్‌ – 25 బైకులు స్వాధీనం

అనంతపురం టూ టౌన్ పోలీసులు భారీ బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, సుమారు రూ.19 లక్షల విలువైన 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బండారు మురళీకృష్ణ, పొన్నూరు షేక్ ఆలీ అక్బర్ అనే ఇద్దరు నిందితులు అనంతపురం జిల్లా సహా తెలంగాణలో కూడా బైకులు దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఈ అరెస్ట్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

13, జులై 2026

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై నమోదైన కేసు, అరెస్ట్ చేసిన స్థలం, కేసు నేర స్వరూపంపై అధికారిక వివరాలు వెలుబడకపోవడంతో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కేసు పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై స్పష్టత కోసం రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

13, జులై 2026

తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్‌..
జిల్లా వార్తలు

తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్‌..

తిరుపతి డ్రగ్స్ కేసులో అరెస్టైన ముగ్గురిలో ఒకరు టీటీడీకి చెందిన గోవిందరాజస్వామి ఆలయ అర్చక భవన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్‌గా గుర్తించడంతో కలకలం రేగింది. రేణిగుంట పోలీసులు 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకుని, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర ముఠా కోణంలో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జులై 2026

కదిరిలో భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌
జిల్లా వార్తలు

కదిరిలో భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌

కదిరిలో భార్య సునీత హత్య కేసులో భర్త గంగరాజును పోలీసులు అరెస్టు చేసి, కత్తి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. బొమ్మనహాళ్ మండలంలో బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఆలయంలో బాల్యవివాహం జరిపిన ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రాయదుర్గం కోర్టులో హాజరు పరచగా, బాల్యవివాహాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

11, జులై 2026

ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌
జిల్లా వార్తలు

ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావలిగిలో ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో 80 ఏళ్ల చిగురుపాటి ఆంజనేయపై ఏడుగురు దాడి చేయగా, ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దర్యాప్తులో నిందితులను గుర్తించిన ఉరవకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, గ్రామంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచుతూ, ఇతర ఆస్తి వివాదాలపై కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

11, జులై 2026

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..
రాజకీయాలు

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..

అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

9, జులై 2026

మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్  పోలీసులతో వాగ్వాదం.. రోడ్డుపై బైఠాయింపు
రాజకీయాలు

మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్ పోలీసులతో వాగ్వాదం.. రోడ్డుపై బైఠాయింపు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడుకుని అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు..

9, జులై 2026

సీఎం విజయ్‌పై వ్యాఖ్యలు: డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్‌
జాతీయం

సీఎం విజయ్‌పై వ్యాఖ్యలు: డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్‌

టీవీకే అధినేత, సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్‌. రాధాకృష్ణన్‌ను మద్రాస్‌ హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించగా, రాజకీయ వర్గాల్లో డీఎంకే–టీవీకే మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

3, జులై 2026

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు

వాట్సాప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌ సైబర్‌ నేరాలు, ఫిషింగ్‌, ఇంపర్సనేషన్‌, డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. MeitY, యూజర్‌నేమ్‌ వ్యవస్థ అమలు విధానం, భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల గుర్తింపు ధృవీకరణపై మూడు రోజుల్లో వివరణ కోరుతూ, సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయవద్దని సూచించింది.

2, జులై 2026

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.. తాడిపత్రిలో ఉద్రిక్తత
రాజకీయాలు

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.. తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

26, జూన్ 2026

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌
జాతీయం

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌

సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది.

25, జూన్ 2026

జిమ్‌ ట్రైనర్‌ విజయ్‌ హత్యకు రూ.50 లక్షల సుపారీ?
నేరాలు

జిమ్‌ ట్రైనర్‌ విజయ్‌ హత్యకు రూ.50 లక్షల సుపారీ?

కర్ణాటకలో జిమ్‌ ట్రైనర్‌ విజయ్‌ యాదవ్‌ హత్య కేసు సంచలనం రేపుతోంది. నాలుగు మంది రౌడీషీటర్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు, హత్య వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయ్‌ బంధువు వాసుదేవరెడ్డి, ఒక ప్రముఖ రియల్టర్‌–వ్యాపారవేత్త రూ.25–50 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించాడని, కొంతమంది న్యాయవాదుల ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపిస్తూ వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

23, జూన్ 2026

తెదేపా కార్యకర్తపై హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్‌
జిల్లా వార్తలు

తెదేపా కార్యకర్తపై హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్‌

కర్నూలు నగరంలో తెదేపా కార్యకర్తపై జరిగిన హత్యాయత్నం కేసులో వైకాపా వర్గీయులైన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు పాతబస్తీ ఖడక్‌పురకు చెందిన జలీల్‌ అహ్మద్‌, అతని కుమారులు జునైద్‌, ఫైసల్‌, వారి బంధువు ఆరిఫ్‌ను కర్నూలు ఒకటో పట్టణ పోలీసు అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

20, జూన్ 2026

ఏపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ అరెస్ట్‌
నేరాలు

ఏపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ అరెస్ట్‌

ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది.

18, జూన్ 2026

తమిళనాడు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌
జిల్లా వార్తలు

తమిళనాడు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

సిద్దవటం పోలీసులు తమిళనాడుకు చెందిన అంతర్‌ రాష్ట్ర దొంగలు ముత్తుపాండి ముత్తు రామలింగం, వెంకటేశ్‌ బాలమురుగన్‌లను వాహనాల తనిఖీల సమయంలో పట్టుకుని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 11 తులాల బంగారు నగలు, ద్విచక్ర వాహనం, రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమయంలో ప్రతిఘటనకు ప్రయత్నించడంతో ఇద్దరు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలు కాగా, నిందితుల నేర చరిత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

18, జూన్ 2026

స్వర్ణకారుడి ఇంట్లో రూ.23 లక్షల చోరీ కేసు భేదం – ఇద్దరు నిందితుల అరెస్ట్‌
జిల్లా వార్తలు

స్వర్ణకారుడి ఇంట్లో రూ.23 లక్షల చోరీ కేసు భేదం – ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ప్రొద్దుటూరు సూపర్‌బజార్‌ రోడ్డులో స్వర్ణకారుడు అనికేత్‌ జయవంత్‌ బాబర్‌ ఇంట్లో జరిగిన రూ.23 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించి, గుమస్తా ప్రథ్మేష్‌, అతని స్నేహితుడు మిలింద్‌ చంద్రకాంత్‌ ఖండేఖర్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.22.91 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విబూకృష్ణ తెలిపారు. మిగిలిన నగదు, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

18, జూన్ 2026

డ్రగ్స్‌ ఇచ్చి ఐఏఎఫ్‌ అధికారి భార్యపై అఘాయిత్యం
నేరాలు

డ్రగ్స్‌ ఇచ్చి ఐఏఎఫ్‌ అధికారి భార్యపై అఘాయిత్యం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయాజ్‌ తాజ్‌ మదారే సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మౌలానా కోసం గాలింపు కొనసాగుతోంది.

16, జూన్ 2026

రోప్‌ జంపింగ్‌లో నిర్లక్ష్యం.. తాడు కట్టకుండానే నెట్టివేయడంతో యువతి మృతి
నేరాలు

రోప్‌ జంపింగ్‌లో నిర్లక్ష్యం.. తాడు కట్టకుండానే నెట్టివేయడంతో యువతి మృతి

బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో వాడుకలో లేని ‘స్కెలెటన్ బ్రిడ్జ్’పై రోప్‌ జంపింగ్‌ కార్యక్రమంలో తాడు కట్టకుండానే 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్‌ను నెట్టడంతో ఆమె 40 మీటర్ల ఎత్తు నుంచి పడి మృతి చెందింది. ఈ ఘటనపై ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, హత్య ఉద్దేశ్యమా లేక తీవ్రమైన నిర్లక్ష్యమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తుండగా, వంతెన నిర్వహణ బాధ్యతపై స్థానిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.

16, జూన్ 2026

వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా పోలీసు కస్టడీకి.. కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్

వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా పోలీసు కస్టడీకి.. కోర్టు అనుమతి

హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర కేసులో అరెస్టయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మూడు రోజుల పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. గండిపేట సమీపంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారు. వీటి ఆధారంగా ఈ కేసులో అరెస్టయిన మరికొందరు నిందితులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు.

15, జూన్ 2026

నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్.. నలుగురు అరెస్ట్‌
జాతీయం

నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్.. నలుగురు అరెస్ట్‌

నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైన వేళ బీహార్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

15, జూన్ 2026

కేరళ సీఎం సతీశన్‌కు హత్య బెదిరింపులు: అట్టింగల్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్‌
జాతీయం

కేరళ సీఎం సతీశన్‌కు హత్య బెదిరింపులు: అట్టింగల్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్‌

కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ మరియు ఆయన కుటుంబాన్ని హతమార్చేస్తానంటూ తిరువనంతపురం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసిన అట్టింగల్‌కు చెందిన సోనీ థామస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మద్యం మత్తులో వరుసగా రెండు సార్లు కాల్‌ చేసి బెదిరింపులు, దూషణలు చేసిన అతడిపై కేసులు నమోదు చేసి, ముఖ్యమంత్రి భద్రత అంశంగా ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో దర్యాప్తు చేస్తున్నారు.

13, జూన్ 2026

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి
జాతీయం

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది పెళ్లి పేరుతో మహారాష్ట్రలో 25 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు, బంగారం మోసం చేసినట్లు ఠానే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ మహిళలను టార్గెట్‌ చేసి, పెళ్లి తర్వాత డబ్బు, ఆభరణాలు తీసుకుని పరారవుతూ, ఆ డబ్బుతో BMW కారు కొనుగోలు చేసిన అతడిని అరెస్టు చేసి, అతని కుమారుడిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జూన్ 2026

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌ : తాడిపత్రిలో ఉద్రిక్తత
రాజకీయాలు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌ : తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘వెన్నుపోటు రెండేళ్లు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించగా, వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు ప్రకటించడంతో శాంతిభద్రతల దృష్ట్యా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters