వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిన్న శనివారం రాత్రి చిప్పగిరి మండలం కన్వీనర్ పురుషోత్తంపై దాడి చేసి, కారు ఇంట్లోని వస్తువులను ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులు ధ్వంసం చేశాడు.

తన అనుచరుడి ఫోన్ చేయగానే రాత్రి నేమకల్లుకు ఎమ్మెల్యే తన వాహనాల్లో భారీగా అనుచరులను తీసుకెళ్లి హల్‌చల్ చేశాడు. ఎమ్మెల్యే విరుపాక్షి నేమకల్ వెళ్లాక మరింతగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వీరి దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నేమకల్లులో పోలీసులు భారీగా మోహరించారు.

ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నారు.