రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటతీరుతో పాటు వ్యాపార పరంగా కూడా రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు (RCB) జట్టు తన దూకుడు కొనసాగిస్తోంది. బ్రాండ్ విలువ పరంగా అరుదైన మైలురాయిని నమోదు చేస్తూ, ఈ ఫ్రాంచైజీ కొత్త రికార్డు సృష్టించింది.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హాయిహాన్ లోకీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం RCB $312 మిలియన్ బ్రాండ్ విలువను సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మేరకు ఆ జట్టు బ్రాండ్ విలువ ప్రస్తుతం రూ.2,986 కోట్లుగా నమోదైంది. ఆటలోనూ, ఆదాయంలోనూ RCB తగ్గేదేలే అన్నట్టుగా ఈ గణాంకాలు స్పష్టతనిస్తున్నాయి.
బ్రాండ్ విలువ, మార్కెట్ ఆకర్షణ, అభిమానుల ఆదరణ, వ్యాపార ఒప్పందాలు, స్పాన్సర్‌షిప్‌లు వంటి అంశాల సమ్మిళిత ఫలితంగా ఈ విలువ నిర్ధారించినట్లు నివేదికలో పేర్కొనబడింది. ఐపీఎల్లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే RCB బ్రాండ్ ప్రదర్శన గణనీయంగా ఉండటమే ఈ అరుదైన ఘనతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ భారీ ఒప్పందం ద్వారా RCB ఫ్రాంచైజీ విలువ, మార్కెట్లో దాని స్థానం ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైంది. ఐపీఎల్ చరిత్రలో ఫ్రాంచైజీ విక్రయాల్లో ఇది అత్యంత పెద్ద మొత్తాల్లో ఒకటిగా భావిస్తున్నారు. కొత్త యజమాన్యంతో RCB వ్యాపార వ్యూహాలు, బ్రాండ్ విస్తరణ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
క్రీడా రంగంలో బ్రాండ్ విలువ పెరుగుదల, పెట్టుబడిదారుల ఆసక్తి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల విశ్లేషణలు కలిసి ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో RCB సాధించిన $312 మిలియన్ బ్రాండ్ విలువ మైలురాయి, లీగ్ మొత్తం వ్యాపార పరిమాణాన్ని కూడా ప్రతిబింబిస్తున్నదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.







