బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#లీగ్‌లో

21 articles

ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ రెండో వరుస విజయం
క్రీడలు

ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ రెండో వరుస విజయం

జాంబియాలో జరుగుతున్న Asian Legends League‌లో Indian Royals జట్టు Pakistan Panthers‌పై 2 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 168 పరుగుల లక్ష్యాన్ని రిషి ధావన్, సారుల్ కీలక ఇన్నింగ్స్‌లతో 17.4 ఓవర్లలో ఛేదించగా, శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్‌పై భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

3, ఆగ 2026

అరుదైన ఘనతతో ముందంజలో RCB
క్రీడలు

అరుదైన ఘనతతో ముందంజలో RCB

రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు (RCB) బ్రాండ్ విలువ $312 మిలియన్‌ (రూ.2,986 కోట్లు) చేరుకుని, ఐపీఎల్‌లో ఈ మైలురాయిని సాధించిన తొలి జట్టుగా హాయిహాన్ లోకీ నివేదికలో నిలిచింది.యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ , ఐపీల్ -2026కు ముందు RCBని బ్లాక్స్టన్ , బోల్ట్ వెంచర్స్ , ఆదిత్య బిర్లా గ్రూప్స్ , తొలి కన్సార్షియం కలిసి రూ.16,705 కోట్లకు కొనుగోలు చేయగా, ఈ ఒప్పందం ఫ్రాంచైజీ వ్యాపార బలం, మార్కెట్ స్థాయిని మరింత స్పష్టంగా చూపించింది.

30, జులై 2026

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి..   ఏకంగా తుపాకీతో కాల్పులు
నేరాలు

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు

ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.

27, జులై 2026

ది హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో MI లండన్ విజయం
క్రికెట్

ది హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో MI లండన్ విజయం

ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ శర్మ అక్కడే కొనసాగుతూ, ‘ది హండ్రెడ్ 2026’ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌ను లండన్ ఓవల్‌లో MI లండన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరం, సామ్ కరన్ అజేయ భాగస్వామ్యంతో MI లండన్ సన్ రైజర్స్ లీడ్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి, నికోలస్ పూరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

22, జులై 2026

హాకీ వరల్డ్ కప్‌కు భారత్ 20 మంది జట్టు ప్రకటింపు
క్రీడలు

హాకీ వరల్డ్ కప్‌కు భారత్ 20 మంది జట్టు ప్రకటింపు

పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు భారత్ 20 మంది జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. పూల్ డిలో ఉన్న భారత్ ఆగస్టు 15 నుంచి వేల్స్, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లతో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుండగా, రక్షణ, మధ్యరేఖ, దాడి విభాగాల్లో సమతుల్యంగా అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో జట్టును రూపొందించారు.

21, జులై 2026

టీజీ20 తొలి సీజన్‌ ఛాంపియన్‌గా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌
క్రీడలు

టీజీ20 తొలి సీజన్‌ ఛాంపియన్‌గా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌

టీజీ20 తొలి సీజన్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు ఖమ్మం ఏసెస్‌పై ఫైనల్లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 158 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించడంలో కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి, వైష్ణవ్‌ రెడ్డి, షణ్ముఖ అశ్విన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, బౌలింగ్‌లో యశ్వీర్‌ గౌడ్‌ 3 వికెట్లతో మెరిశాడు.

13, జులై 2026

టీజీ20లో కొనసాగుతున్న హైదరాబాద్‌ దూకుడు
క్రికెట్

టీజీ20లో కొనసాగుతున్న హైదరాబాద్‌ దూకుడు

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ జట్టు క్వాలిఫయర్‌-2లో Karimnagar Diamonds‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. లీగ్‌ దశలో వరుసగా ఏడు విజయాల తర్వాత క్వాలిఫయర్‌-1లో ఓటమి ఎదురైనా, త్వరగా కోలుకుని మళ్లీ దూకుడు కొనసాగించింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో హైదరాబాద్‌ , అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

11, జులై 2026

విదేశీ కోచ్‌లపై  వ్యామోహం వద్దు
క్రీడలు

విదేశీ కోచ్‌లపై వ్యామోహం వద్దు

అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ పడిపోతున్న భారత హాకీ జట్టు ప్రమాణాలపై మాజీ గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆసియా స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తే సరిపోదని... బలమైన జట్లతో నిరంతరం పోటీపడితేనే మరింత మెరుగయ్యే అవకాశం ఉందని అన్నాడు.

4, జులై 2026

ప్లేఆఫ్స్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దృష్టి
క్రికెట్

ప్లేఆఫ్స్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దృష్టి

టీ జీ20 లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బుధవారం హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ వరంగల్‌ వారియర్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌ స్థానం దాదాపు ఖాయం చేసుకునే అవకాశంలో ఉంది. కెప్టెన్‌ అభిరథ్‌ బ్యాటింగ్‌ ఫామ్‌, అజయ్ దేవ్ గౌడ్ , శ్రీనికేత్ , ప్రణవ్ వర్మ, షణ్ముఖ్ ల బౌలింగ్‌ జట్టుకు బలం కాగా, వరుస ఓటములతో దిగువన ఉన్న వరంగల్‌ వారియర్స్‌ ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని చూస్తోంది.

1, జులై 2026

టీజీ20లో అగ్రస్థానంలో ఈ ఛాంపియన్స్‌ – మెదక్‌ ఫాల్కన్స్‌పై హ్యాట్రిక్‌ లక్ష్యం
క్రికెట్

టీజీ20లో అగ్రస్థానంలో ఈ ఛాంపియన్స్‌ – మెదక్‌ ఫాల్కన్స్‌పై హ్యాట్రిక్‌ లక్ష్యం

టీజీ20 లీగ్‌లో వరుసగా రెండు విజయాలతో అగ్రస్థానంలో ఉన్న Hyderabad E Champions శనివారం Medak Falcons‌పై హ్యాట్రిక్‌ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి, సాయివికాస్‌ రెడ్డి, ప్రణవ్‌ వర్మల ఫామ్‌ జట్టుకు బలం కాగా, యశ్వీర్‌ గౌడ్‌ భారత్‌ Under-19 జట్టుకు చేరడంతో అతని లోటు తీరుస్తుందో లేదో చూడాలి. వరుస పరాజయాలతో ఉన్న Medak Falcons‌కు ఈ మ్యాచ్‌ పెద్ద సవాలుగా మారింది.

27, జూన్ 2026

అదరగొట్టిన నల్గొండ బ్యాటర్లు.. వరంగల్ వారియర్స్‌కు 260 పరుగుల లక్ష్యం
క్రికెట్

అదరగొట్టిన నల్గొండ బ్యాటర్లు.. వరంగల్ వారియర్స్‌కు 260 పరుగుల లక్ష్యం

టీజీ20 లీగ్‌లో నల్గొండ నైట్స్‌ బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడి వరంగల్ వారియర్స్‌కు 20 ఓవర్లలో 260 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్ధేశించారు. గౌరవ్ రెడ్డి, నితీశ్ రెడ్డి చెరో 81 పరుగులతో మెరిశారు. వరంగల్ బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురవగా, ఈ భారీ స్కోరును కాపాడేందుకు నల్గొండ బౌలర్లు ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

26, జూన్ 2026

ఏపీఎల్ లో విజయవాడ సన్‌షైనర్స్‌ మెరుపు విజయం
క్రీడలు

ఏపీఎల్ లో విజయవాడ సన్‌షైనర్స్‌ మెరుపు విజయం

ఆంధ్ర ప్రిమియర్ లీగ్‌లో విజయవాడ సన్‌షైనర్స్‌ రాయల్స్ ఆఫ్ రాయలసీమపై 19 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను బలపరుచుకుంది. ప్రశాంత్ కుమార్‌ 60, షేక్ జహీర్ అబ్బాస్‌ 53 నాటౌట్‌తో 208 పరుగులు కట్టిపడేసి, బౌలర్లలో ప్రణవ్ రెడ్డి 4 వికెట్లతో రాయలసీమను 189 పరుగులకే పరిమితం చేశారు. ఈ విజయంతో భీమవరం బుల్స్‌, విజయవాడ సన్‌షైనర్స్‌, సింహాద్రి వైజాగ్ లయన్స్‌, అమరావతి రాయల్స్‌ తలా 8 పాయింట్లతో సమంగా నిలవగా, నెట్ రన్‌రేట్‌ ఆధారంగా భీమవరం, విజయవాడ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

26, జూన్ 2026

రంగారెడ్డి ఓపెనర్లు ఔట్‌.. హైదరాబాద్‌కు రెండు వికెట్లు
క్రికెట్

రంగారెడ్డి ఓపెనర్లు ఔట్‌.. హైదరాబాద్‌కు రెండు వికెట్లు

టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ 12 ఓవర్లకు 98/2గా నిలిచింది. ఓపెనర్‌ అవనీశ్‌ 53 పరుగులు చేసి 72 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. అనంతరం ఆరోన్‌ 35 పరుగుల వద్ద ఔటవడంతో రెండో వికెట్‌ 95 వద్ద పడగా, ప్రస్తుతం తనయ్ త్యాగరాజన్‌ 2, ఆదిత్య 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

25, జూన్ 2026

స్వాప్‌ డీల్‌.. మళ్లీ దిల్లీకి రిషభ్‌ పంత్‌
క్రికెట్

స్వాప్‌ డీల్‌.. మళ్లీ దిల్లీకి రిషభ్‌ పంత్‌

ఐపీఎల్‌లో భాగంగా జరిగిన స్వాప్‌ డీల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చేరగా, కుల్దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి లక్నో కు మారాడు. లక్నో లో వరుసగా రెండు సీజన్‌ల్లోనూ పంత్‌ ఫార్మ్‌, జట్టు ఫలితాలు నిరాశపరచడంతో అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకుని, పారితోషికం తగ్గించుకుని ఢిల్లీ కి తిరిగొచ్చాడు.

24, జూన్ 2026

టీజీ20లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ ఘన ఆరంభం
క్రికెట్

టీజీ20లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ ఘన ఆరంభం

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు ఘన ఆరంభం చేసింది. పాలమూరు స్ట్రైకర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అజయ్‌ దేవ్‌ గౌడ్‌ నేతృత్వంలో బౌలర్లు పాలమూరును 141 పరుగులకే కట్టడి చేయగా, అనంతరం అన్విత్‌ రెడ్డి, గణేశ్‌ గడుగు అజేయ అర్ధసెంచరీలతో 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.

24, జూన్ 2026

టీజీ20లో నేడు రంగంలోకి హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌
క్రికెట్

టీజీ20లో నేడు రంగంలోకి హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌

టీజీ20 లీగ్‌లో అత్యంత ఖరీదైన జట్టు Hyderabad E Champions నేడు ఉప్పల్ స్టేడియంలో Palamuru Strikers‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. రంజీ అనుభవం ఉన్న అభిరథ్ రెడ్డి సారథ్యంలో, ఎక్కువ మంది ఆల్‌రౌండర్లతో సమతూకంగా ఉన్న ఈ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన Palamuru Strikers ఈసారి తొలి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఉప్పల్‌లో ఆసక్తికర పోరు నెలకొననుంది.

23, జూన్ 2026

దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌
క్రీడలు

దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి Delhi Capitals బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించేందుకు ఫ్రాంచైజీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. వరుసగా ప్లేఆఫ్స్‌కు దూరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుత కోచింగ్‌ స్టాఫ్‌ను మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఇదే సమయంలో క్రికెట్‌ డైరెక్టర్‌గా Sourav Gangulyని, అలాగే Rishabh Pantను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలపై కూడా చర్చలు సాగుతున్నాయి.

20, జూన్ 2026

సూర్యకుమార్ ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌బై చెబుతాడా?
క్రికెట్

సూర్యకుమార్ ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌బై చెబుతాడా?

టీమ్‌ఇండియా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ పడిపోవడంతో టీ20 జట్టులో స్థానం, కెప్టెన్సీ కోల్పోయిన సమయంలో, అతడు IPLలో ముంబయి ఇండియన్స్‌ నుంచి దూరమయ్యే అవకాశాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబయి ఇండియన్స్‌, హార్దిక్‌ పాండ్యలను ఫాలో చేయకపోవడం, ఫ్రాంఛైజీకి సంబంధించిన ఎక్కువ పోస్టులను డిలీట్‌ చేయడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

8, జూన్ 2026

టీజీ20 లీగ్‌ ఆటగాళ్ల వేలం పూర్తి..
క్రికెట్

టీజీ20 లీగ్‌ ఆటగాళ్ల వేలం పూర్తి..

హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న TG20 లీగ్‌లో ఆటగాళ్ల వేలం పూర్తయ్యింది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఆక్షన్‌లో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా, ఉషోదయ ఎంట్రప్రెస్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు రూ.58.95 లక్షలు వెచ్చించి 20 మందిని తీసుకుంది. ఈ జట్టులో అజైదేవ్ గౌడ్ , అభిరత్ రెడ్డి లకు చెరో రూ.11 లక్షలతో అత్యధిక ధర లభించగా, త్వరలో ఇతర జట్ల జాబితాలు, మ్యాచ్‌ల షెడ్యూల్‌ను HCA ప్రకటించనుంది.

8, జూన్ 2026

జాతీయ జట్టుకు నాయకత్వం బాధ్యత పెంచింది:   భారత టీ20 జట్టు సారథ్యంపై శ్రేయస్ అయ్యర్ స్పందన
క్రికెట్

జాతీయ జట్టుకు నాయకత్వం బాధ్యత పెంచింది: భారత టీ20 జట్టు సారథ్యంపై శ్రేయస్ అయ్యర్ స్పందన

భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్, ఇది తనకు గొప్ప గౌరవమని, నాయకత్వ బాధ్యతలతో తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఇన్నేళ్లుగా తనకు అండగా నిలిచిన అభిమానుల మద్దతు ఎంతో విలువైనదని శ్రేయస్ పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ నాయకత్వ నైపుణ్యాలు టీమిండియా భవిష్యత్తుకు ఉపయోగపడతాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

7, జూన్ 2026

టీజీ20 లీగ్‌ వేలంలో తిలక్ వర్మకు రూ.33 లక్షలు.. మెదక్ ఫాల్కన్స్ జట్టులో చోటు
క్రికెట్

టీజీ20 లీగ్‌ వేలంలో తిలక్ వర్మకు రూ.33 లక్షలు.. మెదక్ ఫాల్కన్స్ జట్టులో చోటు

హైదరాబాద్‌లో జరిగిన టీజీ20 లీగ్ వేలంలో తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ రూ.33 లక్షలకు దక్కించుకుని ఇప్పటివరకు అత్యధిక ధర చెల్లించిన జట్టుగా నిలిచింది. తన్మయ్ అగర్వాల్‌ను కరీంనగర్ డైమండ్స్ రూ.8 లక్షలకు, సి.వి. మిలింద్‌ను అన్విత ఖమ్మం ఏసెస్ రూ.17 లక్షలకు కొనుగోలు చేయగా, జూన్ 20 నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ లీగ్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియో హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters