లండన్‌: వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ఆరిన సబలంక ప్రయాణం నాలుగో రౌండ్లోనే ముగిసింది. బెలారస్ కు చెందిన ఈ స్టార్‌ ఆటగాళ్లను ప్లేయర్‌ ఔట్‌ చేసింది. సబలెంకా 2-6, 6-7 (2-7) సెట్ల తేడాతో ఒసాకా చేతిలో పరాజయం పాలైంది.

మొదటి సెట్లోనే ఒసాకా దూకుడుగా ఆడి ఆధిపత్యం చాటింది. సబలెంకా సర్వీస్‌, గ్రౌండ్‌ స్ట్రోక్స్‌పై ఒత్తిడి తెచ్చిన ఒసాకా కీలక పాయింట్లను సొంతం చేసుకుంది. రెండో సెట్లో సబలెంకా పోరాడినా టైబ్రేక్‌లో ఒసాకా మెరుగైన ఆటతో మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఈ ఏడాది వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ రేసు నుంచి ప్రపంచ నంబర్‌వన్‌ తప్పుకుంది.

ఇదిలా ఉండగా, నాలుగో సీడ్‌ (అమెరికా) క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆమె తన దేశానికే చెందిన జోవిచ్‌ పై 4-6, 6-3, 6-1 సెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి సెట్లో వెనుకబడిన పేగుల రెండో సెట్లో బలంగా పుంజుకుని మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుంది.

రెండో, మూడో సెట్లలో పేగుల పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బేస్‌లైన్‌ నుంచి ఆగ్రెసివ్‌గా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ మ్యాచ్‌లో పేగుల రెండు ఏస్‌లు, 21 విన్నర్లు నమోదు చేసింది. కీలక సందర్భాల్లో సర్వీస్‌ను కాపాడుకోవడంతో పాటు రిటర్న్‌ గేమ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

మరోవైపు పదో సీడ్‌ కరోలినా ముచావా (చెక్‌) కూడా తుది ఎనిమిదిలో స్థానం దక్కించుకుంది. నాలుగో రౌండ్లో ఆమె తన దేశానికే చెందిన బార్బోరా క్రేజ్సికోవా (చెక్‌)ను 7-5, 5-7, 6-3 సెట్ల తేడాతో ఓడించింది. మూడు సెట్ల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ బలమైన సర్వీస్‌, శక్తివంతమైన గ్రౌండ్‌ స్ట్రోక్స్‌తో ప్రేక్షకులను అలరించారు.

ముచావా కీలక పాయింట్ల వద్ద ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 9 ఏస్‌లు, 50 విన్నర్లు కొట్టింది. నెట్‌ ప్లే, క్రాస్‌కోర్ట్‌ షాట్లతో క్రేజ్సికోవా పై ఆధిపత్యం చాటింది.

మహిళల విభాగంలో ఆరో సీడ్‌ ఆమడ అనిసిమోవ్ (అమెరికా), 9వ సీడ్‌ లిండా నోస్కోవా (చెక్‌) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఈ విజయాలతో మహిళల సింగిల్స్‌ డ్రాలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. టోర్నీలో టాప్‌ సీడెడ్‌ ఆటగాళ్లలో పలువురు ఇప్పటికే నిష్క్రమించడంతో టైటిల్‌ రేసులో కొత్త పేర్లు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.