భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయంగా అతి పిన్న వయస్సులో 300 మ్యాచులు ఆడిన బ్యాటర్‌గా నిలిచింది. 29ఏళ్ల స్మృతి ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 మ్యాచులు ఆడింది. మొత్తం 10వేలకుపైగా పరుగులు చేసింది. ఇందులో 17 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్‌ తరఫున 2013లో స్మృతి మంధాన అరంగేట్రం చేసింది. 

విఫలమైన షఫాలీ.. మంధాన హాఫ్ సెంచరీ

ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో భారత మహిళ జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటికే ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించింది. అయితే, ఓపెనర్ షఫాలీ వర్మ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. అనంతరం వచ్చిన యస్తికా భాటియా (12) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా రోడ్రిగ్స్ (35) దూకుడుగా ఆడింది. మంధానతో కలిసి మూడో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నిర్మించింది. వాంగ్‌ బౌలింగ్‌లో బయటకు వెళ్లే బంతిని వెంటాడిన జెమీమా బౌల్డ్‌ అయింది. తొలి సెషన్‌ ముగిసే సమయానికి భారత్‌ స్కోరు 25 ఓవర్లకు 122/3. క్రీజ్‌లో మంధాన (56*), హర్మన్‌ ప్రీత్ (14*) ఉన్నారు.