బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#సుప్రీంకోర్టులో

13 articles

ఇస్లాంలోకి మారితే బీసీ రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
జాతీయం

ఇస్లాంలోకి మారితే బీసీ రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు, హిందూ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇస్లాం మతంలోకి మారిన తర్వాత బీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కొనసాగవని స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఇదే విషయంపై ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. మతమార్పిడి తర్వాత ఆ వ్యక్తి కొత్త మతానికి సంబంధించిన సామాజిక వర్గాల కేటగిరీల్లోకే వస్తాడని ఈ తీర్పు ద్వారా స్పష్టత వచ్చింది.

15, అక్టో 2026

ఓటు చోరీ, ఓటర్ల జాబితా అక్రమాలపై చర్యలు కోరుతూ రాహుల్‌ గాంధీ రిట్‌ పిటీషన్‌
జాతీయం

ఓటు చోరీ, ఓటర్ల జాబితా అక్రమాలపై చర్యలు కోరుతూ రాహుల్‌ గాంధీ రిట్‌ పిటీషన్‌

ఓటు చోరీ, ఓటర్ల జాబితా అక్రమాలపై తక్షణ చర్యలు కోరుతూ రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై నిర్వహించిన ర్యాలీకి వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవాదులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా స్వామ్యవాదులు విస్తృతంగా స్పందించగా, ఇది ఓటు హక్కు పరిరక్షణ కోసం సాగిన ప్రజాస్వామ్య ఉద్యమంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

13, అక్టో 2026

ఏపీలో బీసీ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీసీ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు విచారణలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు విధానాన్ని ప్రభుత్వం పునర్విమర్శ చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండగా, రిజర్వేషన్ శాతం తగ్గే ప్రమాదం, రాజ్యాంగ పరిమితి పాటించాల్సిన అవసరం మధ్య వాదోపవాదాలు మళ్లీ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి.

9, అక్టో 2026

ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్ల ఆలస్యం పై సుప్రీంకోర్టు ఆగ్రహం
జాతీయం

ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్ల ఆలస్యం పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఫిరాయింపుల కేసుల్లో అనర్హత పిటిషన్లపై స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయాలు వాయిదా వేస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న గత ఆదేశాలు అమలుకావడం లేదని కోర్టు ఆక్షేపిస్తూ, ఈ ఆలస్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభల పనితీరు దెబ్బతింటోందని హెచ్చరించింది. ఇదే సమయంలో కేసుల విచారణలో న్యాయవ్యవస్థ కూడా తన ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ సూచించారు.

29, సెప్టెం 2026

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట
జాతీయం

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట

కోల్ స్కామ్‌లో నమోదైన క్రిమినల్ కేసు నుంచి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ఊరట కల్పించింది. సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ, 2015లో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లు, అప్పటి తీర్పును రద్దు చేసి విచారణను ముగించింది. యూపీఏ కాలం నాటి ఈ పెద్ద కేసులో ఆయనపై నేరాభియోగాలకు బలమైన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

29, జులై 2026

సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. న్యాయశాస్త్ర విద్యార్థుల అరెస్టు
నేరాలు

సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. న్యాయశాస్త్ర విద్యార్థుల అరెస్టు

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయ విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

15, జులై 2026

సాయికృష్ణ కేసు.. 23కి వాయిదా వేసిన సుప్రీం
నేరాలు

సాయికృష్ణ కేసు.. 23కి వాయిదా వేసిన సుప్రీం

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగింది.

15, జులై 2026

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే

తమిళనాడులో బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర చట్టాలు అనుమతించిన వధను పూర్తిగా నిషేధించడం చట్టబద్ధం కాదని తమిళనాడు ప్రభుత్వం వాదించగా, హైకోర్టు ఆదేశాలు ప్రస్తుత చట్టాలకు విరుద్ధమా అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమికంగా పరిశీలించి, ఆ ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

13, జులై 2026

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..
ఆంధ్రప్రదేశ్

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

9, జులై 2026

సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట
తమిళనాడు

సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై బహిరంగ ప్రకటనలు చేయకుండా తమిళనాడు సీఎం విజయ్, మంత్రి ఆధవ్ అర్జున, TVK నేతలను నిరోధించాలని కోరుతూ DMK జనరల్ సెక్రటరీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోకుండా తిరస్కరించింది. దీంతో DMK తరఫు న్యాయవాదులు అప్లికేషన్‌ను ఉపసంహరించుకోగా, ఈ నిర్ణయంతో సీఎం విజయ్, TVK నేతలకు తాత్కాలిక ఊరట లభించినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

7, జులై 2026

ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే    : సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
జాతీయం

ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే : సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ కార్యక్రమం ఇంకా ప్రయగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దాని ఫలితాలు వచ్చే ఏడాదికల్లా వెల్లడి అవుతాయని తెలిపింది.

30, జూన్ 2026

మీనాక్షి నాటరాజన్‌కు కి దక్కని ఊరట!
రాజకీయాలు

మీనాక్షి నాటరాజన్‌కు కి దక్కని ఊరట!

రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

11, జూన్ 2026

మహిళపై అత్యాచారం కేసు: సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది
ఆంధ్రప్రదేశ్

మహిళపై అత్యాచారం కేసు: సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ నిరాకరించబడింది. హైకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రభుత్వం చిన్నమల్లయ్యను విధుల నుంచి తొలగించింది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters