బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉత్తర్వులు

24 articles

వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి. యాక్ట్ అమలు
జిల్లా వార్తలు

వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి. యాక్ట్ అమలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్‌కు చెందిన రౌడీ షీటర్ షేక్ ముజాహిద్ @ ముజ్జు (21)పై వరుస నేరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986 ప్రకారం పి.డి. యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. గత రెండు సంవత్సరాల్లో, ముఖ్యంగా ఇటీవలి మూడు నెలల్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదవడంతో, ప్రజాశాంతి పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

9, ఆగ 2026

ఎం. వేణుగోపాల్ రెడ్డికి ఏపీడీఏఎస్‌సీఏసీ అదనపు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్

ఎం. వేణుగోపాల్ రెడ్డికి ఏపీడీఏఎస్‌సీఏసీ అదనపు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APDASCAC అదనపు బాధ్యతలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డికి అప్పగిస్తూ జీఓఆర్‌టీ నం.128 జారీ చేసింది. APDASCAC మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం, పరిపాలనా, అధికారిక, ఆర్థిక వ్యవహారాలన్నింటినీ ఆయన పర్యవేక్షించనున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన బి. రవి ప్రకాష్ రెడ్డి స్థానంలో తాత్కాలికంగా ఈ బాధ్యతలు అప్పగించగా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవే అమల్లో ఉంటాయి.

31, జులై 2026

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల
తమిళనాడు

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ తగిలింది. కావేరీ జల నిర్వహణ అథారిటీ, కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జూలై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటకలో, ముఖ్యంగా మాండ్యలో ఆందోళనలు ఉద్ధృతమవగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కోసం చర్చించాలని నిర్ణయించారు.

31, జులై 2026

ఏపీ బిల్డింగ్ రూల్స్–2017-2026కు కీలక సవరణలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ బిల్డింగ్ రూల్స్–2017-2026కు కీలక సవరణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ బిల్డింగ్ రూల్స్–2017లో 23 ప్రాధాన్య అంశాలు, 5 కీలక అంశాలపై సవరణలు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ హై-రైజ్ భవనాలకు 24 మీటర్ల ఎత్తు వరకు బాల్కనీలకు అనుమతి, హై-రైజ్ భవనాల్లో పార్కింగ్, మెకానికల్ లిఫ్ట్/ర్యాంపులు, ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్‌ను తప్పనిసరి చేస్తూ భద్రత, పర్యావరణ పరిరక్షణ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం లక్ష్యంగా పెట్టుకుంది.

30, జులై 2026

పోలీసు క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లికి అధికారుల వినతిపత్రం
జిల్లా వార్తలు

పోలీసు క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లికి అధికారుల వినతిపత్రం

రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పోలీసు ఇన్‌స్పెక్టర్లు, అధికారులు వినతిపత్రం సమర్పించి ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా, DSP పోస్టును స్టేట్ క్యాడర్‌గా పునర్వర్గీకరించాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది నిర్వహణలో సమర్థత, రాష్ట్రవ్యాప్త సేవల అందుబాటు కోసం G.O.Ms.No.103లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

23, జులై 2026

గోదావరి పుష్కరాల కోసం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి
ఆంధ్రప్రదేశ్

గోదావరి పుష్కరాల కోసం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి

గోదావరి పుష్కరాలు–2027 విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు, కొవ్వూరు, నర్సాపురం తదితర మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధి, రహదారి, పార్కింగ్, పారిశుద్ధ్య, తాగునీరు, వైద్య, భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

23, జులై 2026

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల ఆఫ్‌లైన్ విక్రయాలకు అనుమతి
జిల్లా వార్తలు

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల ఆఫ్‌లైన్ విక్రయాలకు అనుమతి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో ఇప్పటివరకు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతున్న ప్రసాదాల విక్రయాలకు దేవాదాయ శాఖ ఆఫ్‌లైన్ అనుమతిని కూడా ఇచ్చింది. ఇకపై భక్తులు నేరుగా ఆలయ ప్రసాద కౌంటర్ల వద్ద నగదు చెల్లించి ప్రసాదాలు పొందవచ్చు. ఈ మార్పుతో సాంకేతిక సమస్యలు, ముందస్తు బుకింగ్ ఇబ్బందులు తగ్గి, భక్తులకు సేవల అందుబాటు మరింత విస్తరించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

21, జులై 2026

ఫీజు రెగ్యులేటరీ కమిటీ సభ్యుల నియామకానికి  ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్

ఫీజు రెగ్యులేటరీ కమిటీ సభ్యుల నియామకానికి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ (APHEFRMC) సభ్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసి, పదవీకాలాన్ని మూడు సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయస్సు వరకు, ఏది ముందుగా వస్తే అది వర్తించేలా నిర్ణయించింది. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి, 2019 చట్టం ఆధారంగా ఉన్నత విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని సమీక్షించి, అధిక ఫీజుల భారాన్ని తగ్గిస్తూ పారదర్శక నియంత్రణ వ్యవస్థను బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

15, జులై 2026

పాత పెన్షన్ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

పాత పెన్షన్ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,715 మంది అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (OPS) ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై సేవలో చేరిన, ప్రస్తుతం Contributory Pension Scheme (CPS)లో ఉన్న ఉద్యోగులు మూడు నెలల్లోపు OPS ఆప్షన్ ఇవ్వాలి, ఒకసారి OPS ఎంచుకున్న తర్వాత తిరిగి CPSకు మారే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

14, జులై 2026

మూసీ పునరుజ్జీవనకు టి.సర్కార్ గ్రీన్ సిగ్నల్..   రూ.7,345 కోట్లకు ప్రభుత్వ ఆమోదం
తెలంగాణ

మూసీ పునరుజ్జీవనకు టి.సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.7,345 కోట్లకు ప్రభుత్వ ఆమోదం

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తొలి దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

9, జులై 2026

ఇరాన్‌పై అమెరికా చమురు ఆంక్షలు మళ్లీ కఠినం
అంతర్జాతీయం

ఇరాన్‌పై అమెరికా చమురు ఆంక్షలు మళ్లీ కఠినం

ఇరాన్‌ చమురు రంగంపై అమెరికా మరోసారి ఆంక్షలను కఠినతరం చేస్తూ, గత నెలలో ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసింది. Foreign Assets Control కార్యాలయం సాధారణ అనుమతిని వెనక్కి తీసుకోవడంతో ఇరాన్‌ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలపై సడలింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

8, జులై 2026

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

6, జులై 2026

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..   ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు జీఓ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు జీఓ విడుదల

పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

2, జులై 2026

ఇళయరాజా పాటలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం
సినిమా

ఇళయరాజా పాటలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం

సంగీత దర్శకుడు ఇళయరాజా 1976 నుండి స్వరపరిచిన 134 సినిమాల కొన్ని పాటలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. సరిగమ ఇండియా లిమిటెడ్ వద్ద ఆ సినిమాల ఆడియో, పూర్తి సౌండ్ రికార్డింగ్స్ కాపీరైట్ హక్కులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేస్తూ, ఇళయరాజా స్వతంత్రంగా ఆ రికార్డింగ్స్‌ను ప్రసారం చేయడం, వినియోగించడం, లైసెన్స్ ఇవ్వడం నిలిపివేయాలని ఆదేశించింది.

2, జులై 2026

క్యాట్‌లో ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌కు చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్

క్యాట్‌లో ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌కు చుక్కెదురు

ఏపీకి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో చుక్కెదురైంది. తనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది.

30, జూన్ 2026

జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత
జాతీయం

జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత

దేశంలోని ఇంధన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

30, జూన్ 2026

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతిగా మహేష్ దిక్షిత్
జాతీయం

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతిగా మహేష్ దిక్షిత్

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దిక్షిత్‌ను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ నియమించింది. ప్రస్తుత ఐబీ చీఫ్ టపన్ డేకా పదవీకాలం ముగియడంతో ఈ నియామకం జరిగింది. దేశీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైబర్ ముప్పులు వంటి సవాళ్ల నడుమ కొత్త చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో భద్రతా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

26, జూన్ 2026

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్
తెలంగాణ

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం ఆరోపణలతో మే 8న కేసు, మే 16న అరెస్ట్ కాగా, దాదాపు నెల తర్వాత లభించిన ఈ బెయిల్ రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

20, జూన్ 2026

టిమ్స్ కోసం 180 మంది డాక్టర్ల డిప్యుటేషన్‌ – ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో సేవలకు భంగం
తెలంగాణ

టిమ్స్ కోసం 180 మంది డాక్టర్ల డిప్యుటేషన్‌ – ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో సేవలకు భంగం

సనత్‌నగర్‌లో త్వరలో ప్రారంభం కానున్న Telangana Institute of Medical Sciences కోసం ఉస్మానియా, గాంధీ, NIMS వంటి బోధనా ఆసుపత్రుల నుంచి 180 మంది డాక్టర్లను డిప్యుటేషన్‌పై బదిలీ చేయాలని డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వైద్యుల కొరత ఉన్న ఈ ఆసుపత్రుల నుంచి నిపుణులను తరలించడం వల్ల న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ వంటి కీలక విభాగాల్లో సేవలు, శస్త్రచికిత్సలు, బోధన కార్యక్రమాలు దెబ్బతింటాయని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

20, జూన్ 2026

కడప జిల్లాలో రూ.16,300 కోట్ల ఇంధన, పర్యాటక ప్రాజెక్టులు
జిల్లా వార్తలు

కడప జిల్లాలో రూ.16,300 కోట్ల ఇంధన, పర్యాటక ప్రాజెక్టులు

కడప జిల్లాలో హరిత ఇంధనం, పర్యాటక రంగాల్లో రూ.16,306 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు ప్రారంభంకానున్నాయి. చింతా గ్రీన్ ఎనర్జీ, హెక్సా ఎనర్జీ సంస్థల ఇంధన ప్రాజెక్టులు, గండికోటలో జెన్ రిసార్ట్స్ ప్రతిపాదించిన రిసార్ట్ ద్వారా కలిపి సుమారు 4,200 మందికి ఉపాధి కలుగనుండగా, జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల రూపురేఖలు మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

14, జూన్ 2026

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కీలక అధికారులపై వేటు
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కీలక అధికారులపై వేటు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న భారీ ప్రమాదం నేపథ్యంలో యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదం అనంతర పరిణామాల నిర్వహణలో లోపాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు సీనియర్ అధికారులపై బదిలీ వేటు పడింది. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్లు సమాచారం.

12, జూన్ 2026

రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో స్థాయిలో భారీ బదిలీలు, కొత్త నియామకాలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో స్థాయిలో భారీ బదిలీలు, కొత్త నియామకాలు

రాష్ట్ర రెవెన్యూ విభాగంలో ఆర్డీవో స్థాయిలో ప్రభుత్వం భారీ బదిలీలు, కొత్త నియామకాలు చేసింది. పార్వతీపురం, పాడేరు, కుప్పం, తాడేపల్లిగూడెం, బాపట్ల, చీరాల, గూడూరు, తెనాలి తదితర డివిజన్లకు కొత్త ఆర్డీవోలను నియమిస్తూ, పలువురు డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు, కీలక పోస్టింగులు ఇచ్చింది. రెవెన్యూ పరిపాలన బలోపేతం, ఫీల్డ్ స్థాయి పనితీరు మెరుగుదలకే ఈ మార్పులని శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

5, జూన్ 2026

మహిళపై అత్యాచారం కేసు: సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది
ఆంధ్రప్రదేశ్

మహిళపై అత్యాచారం కేసు: సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ నిరాకరించబడింది. హైకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రభుత్వం చిన్నమల్లయ్యను విధుల నుంచి తొలగించింది.

4, జూన్ 2026

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ కీలక నిర్ణయం: ధరల మార్పుల్లేకుండానే కొత్త మద్యం పరిమాణాలు
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ కీలక నిర్ణయం: ధరల మార్పుల్లేకుండానే కొత్త మద్యం పరిమాణాలు

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం సీసాల పరిమాణాల్లో మార్పులు చేస్తూ 150, 200 మిల్లీలీటర్ల కొత్త సైజులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 90, 180, 375, 750 మిల్లీలీటర్లతో పాటు ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి. సీసాల పరిమాణాలు మాత్రమే మారుతున్నాయని, మద్యం ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters