రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాలకు ఓఎస్డీలను, అదనపు ఎస్పీలను నియమిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా మార్కాపూర్ జిల్లా ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్)గా నవ్ జ్యోతి మిశ్రాను నియమించారు. తూర్పుగోదావరి (రాజమండ్రి) అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్ మనీష్‌ను బదిలీ చేశారు. అలాగే మండా జావలి అల్ఫోన్స్‌ను పోలవరం జిల్లా ఓఎస్డీగా నియమించారు.
అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్ రామనాధ్ హెగ్డేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రోహిత్ కుమార్ చౌదరికి పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (ఏఎస్పీ) సుస్మితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.







