రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ (Mega PTM)ను వాయిదా వేయడం జరిగింది. జూలై 17, 2026న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 22, 2026కు మార్చారు.
విద్యాశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, కొత్త తేదీ జూలై 22, 2026 బుధవారం రోజునగా నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ , జిల్లా పరిషద్ , మండల్ పరిషద్ , మునిసిపల్ స్కూల్స్ లో ఒకేసారి మెగా PTM నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
మెగా PTM నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలు యథాతథంగా అమల్లో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. తేదీ మార్పు తప్ప, కార్యక్రమ నిర్వహణ విధానం, లక్ష్యాలు, కార్యకలాపాలు తదితర అంశాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.
సంబంధిత పాఠశాలల హెడ్ మాస్టర్స్ , టీచర్స్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫిసిఅల్స్ కొత్త తేదీకి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల హాజరు, విద్యార్థుల ప్రగతి వివరాలు, పాఠశాల అభివృద్ధి అంశాలపై చర్చలు సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మెగా PTM ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన, అవసరమైన సహాయక చర్యలపై సమగ్రంగా చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేదీ మార్పు గురించి తల్లిదండ్రులకు సమయానికి సమాచారం చేరేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
జూలై 22న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించనున్న మెగా PTMలో తల్లిదండ్రులు చురుకుగా పాల్గొనాలని, తమ పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో విస్తృతంగా చర్చించాలని విద్యాశాఖ అధికారులు పాఠశాలల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.







