బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#విద్యాశాఖ

65 articles

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు అధికారికంగా ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారంతో కలిపి విద్యార్థులకు వరుసగా ఎక్కువ రోజుల విశ్రాంతి లభించనుండగా, అక్టోబర్ 22 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభమవుతాయి. సెలవుల సమయంలో పాఠశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, సెలవుల తర్వాత హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

3, అక్టో 2026

చిగురుపాడు గ్రామసభలో అధికారుల హాజరు – అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ
జిల్లా వార్తలు

చిగురుపాడు గ్రామసభలో అధికారుల హాజరు – అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం చిగురుపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, రెండవ మండల విద్యాశాఖ అధికారి బాణాల మునిరత్నం, పంచాయతీ అభివృద్ధి అధికారిణి భారతి హాజరై గ్రామస్థులతో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించారు. విద్యా సౌకర్యాలు, రహదారి, తాగునీరు, పారిశుధ్యంతో పాటు పంచాయతీ నిధుల పారదర్శక వినియోగంపై గ్రామస్థులు అభిప్రాయాలు వెల్లడించగా, అధికారులు స్థానిక సమస్యలను నోట్ చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం.

2, అక్టో 2026

రాష్ట్రవ్యాప్తంగా 6,240 పాఠశాల గదుల కూల్చివేతకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా 6,240 పాఠశాల గదుల కూల్చివేతకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో శిథిలావస్థలో ఉన్న 6,240 ప్రభుత్వ పాఠశాల గదులను ఈ నెల 30లోపు కూల్చివేయాలని విద్యాశాఖ ఆదేశించింది. 44,281 పాఠశాలల్లో నిర్వహించిన భద్రతా పరిశీలన ఆధారంగా ప్రమాదకర గదులను గుర్తించి తొలగించి, ‘మన బడి–మన భవిష్యత్తు’ పథకం కింద కొత్త గదులు నిర్మించాలని, ఈ ప్రక్రియలో విద్యార్థుల చదువుకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలని సూచించింది.

24, సెప్టెం 2026

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై సమగ్ర విచారణకు ఎస్‌వైఎఫ్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై సమగ్ర విచారణకు ఎస్‌వైఎఫ్ డిమాండ్

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు 2026–27 విద్యా సంవత్సరానికి సాధారణ ఫీజులకు అదనంగా నీట్, ఐఐటీ, ఒలింపియాడ్, ప్రత్యేక కోచింగ్ పేర్లతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఎస్‌వైఎఫ్ జిల్లా విద్యాశాఖను కోరింది. పాఠశాలల గుర్తింపు, అనుమతులు, ప్రకటించిన ఫీజులు, వాస్తవ వసూళ్లు, రసీదులు, పుస్తకాలు–యూనిఫాంల కొనుగోలు ఒత్తిళ్లపై పరిశీలించి, ఉల్లంఘనలు తేలితే చర్యలు తీసుకుని ATR సిద్ధం చేయాలని సంస్థ డిమాండ్ చేసింది.

22, సెప్టెం 2026

కళ్యాణదుర్గం పాఠశాలలో విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన – తెలుగు టీచర్‌ సస్పెన్షన్‌
జిల్లా వార్తలు

కళ్యాణదుర్గం పాఠశాలలో విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన – తెలుగు టీచర్‌ సస్పెన్షన్‌

కళ్యాణదుర్గం నార్త్ హైస్కూల్‌ తెలుగు ఉపాధ్యాయుడు రామచంద్రనాయక్‌ను విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో DEO అయూబ్ హుస్సేన్ తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేశారు. ఒక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేయగా, MEO విజయ్‌కుమారి విచారణ నివేదికపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పాఠశాలలకు విద్యాశాఖ సూచనలు జారీ చేసింది.

12, సెప్టెం 2026

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం
జిల్లా వార్తలు

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు దేవస్థానం ప్రతినిధులు, ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ విజయవాడలో ప్రత్యక్షంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమ క్రమం, ప్రత్యేక సేవల వివరాలు తెలియజేసి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించగా, 2026 ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.

4, సెప్టెం 2026

కొట్టాల గ్రామంలో టీడీపీ ఇంటింటి ప్రచారం
జిల్లా వార్తలు

కొట్టాల గ్రామంలో టీడీపీ ఇంటింటి ప్రచారం

కడప జిల్లా రాజుపాలెం మండలం కొట్టాల గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, వాడల్లో తిరిగి ప్రజల నుంచి స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై అభిప్రాయాలు సేకరించగా, ఈ ప్రచారం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

16, ఆగ 2026

ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో గర్జిస్తున్న Gen-Z యువత!
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో గర్జిస్తున్న Gen-Z యువత!

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై Gen-Z యువత ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో భారీ నిరసనలు చేపట్టి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ, ఉపాధ్యాయ నియామకాలు, నిరుద్యోగ భృతి హామీలపై స్పష్టత కోరుతూ #LOKESHRESIGN హాష్‌ట్యాగ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు.

9, ఆగ 2026

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్
జిల్లా వార్తలు

విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్. మక్బూల్

కదిరి ప్రాంతంలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న బి.యస్. మక్బూల్, DSC–2025 నియామకాలలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులు నియామకాలలో పారదర్శకత లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం, నిరుద్యోగ భృతి అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు.

9, ఆగ 2026

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం
జిల్లా వార్తలు

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం

నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల, కళాశాల స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి తిరుపతి పోటీలకు ఎంపిక చేసే అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. AUG 15–19 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేసి, 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

5, ఆగ 2026

మదనపల్లె ప్రైవేట్ పాఠశాలపై మతబోధనల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్
జిల్లా వార్తలు

మదనపల్లె ప్రైవేట్ పాఠశాలపై మతబోధనల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మిస్టర్ రెడ్డి ఈ.ఎం. ప్రైమరీ స్కూల్‌లో చిన్నారులకు పాఠ్యాంశాలతో పాటు మతపరమైన బోధనలు, అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలు, ఫోటోలు ఆధారంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వారు DEO, MEOలకు విజ్ఞప్తి చేశారు.

3, ఆగ 2026

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు
జాతీయం

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నెలరోజుల పాటు విద్యార్థుల నిరసనలు కొనసాగగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ దీర్ఘకాలిక ఆందోళనల మధ్య తరచూ కలుసుకుంటూ వచ్చిన కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమగా మారి చివరకు పెళ్లి బంధాలకు దారి తీసింది. ఈ జంటల కథలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.

31, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

28, జులై 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు!  ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు
నేరాలు

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు! ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు

కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో  ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్‌ ‘చలో సంసద్‌ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

28, జులై 2026

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలకడం, ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా, పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు పార్టీ సంస్థలో కొత్త బాధ్యతలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నాయకత్వం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

27, జులై 2026

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'..   కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!
జాతీయం

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'.. కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

26, జులై 2026

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు
జాతీయం

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.

25, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
జాతీయం

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ (CJP) తెగేసి చెప్పింది. లేకుంటే కేంద్రంతో చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని తేల్చిచెప్పారు.

25, జులై 2026

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు
జాతీయం

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?..  స్పష్టం చేసిన కేంద్రం..!
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?.. స్పష్టం చేసిన కేంద్రం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.

24, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters