రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, క్రూడాయిల్ ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయింది.
సెన్సెక్స్ ఉదయం 77,055.21 పాయింట్ల (క్రితం ముగింపు77,100.47) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,252.78 వద్ద గరిష్ఠాన్ని తాకగా, 76,621.75 వద్ద కనిష్ఠానికి చేరింది. 372.10 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 76,728.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 109.75 పాయింట్ల నష్టంతో 23,946.25 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.54గా ఉంది. సెన్సెక్స్‌లో ఎటర్నెల్, ట్రెంట్, బెల్, ఎన్‌టీపీసీ లాబాల్లో ఉండగా, కోటక్‌బ్యాంక్, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, నష్టాల్లో ముగిశాయి.







