రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
గత సెషన్ ముగింపు (77,616)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో చివరకు సెన్సెక్స్ 561 పాయింట్ల నష్టంతో 77,054 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 158 పాయింట్ల నష్టంతో 24,052 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్, నిఫ్టీలో బయోకాన్, కంటైనర్ కొర్పొరేషన్, అదానీ పవర్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, లోధా డెవలపర్స్, టాటా ఎలాక్సీ, ఎన్‌బీసీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో నడిచాయి. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 274 పాయింట్లు కోల్పోయింది.







