ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌..

రేపే సప్లిమెంటరీ ఫలితాలు

ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌! ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్‌ 18) మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 21 నుంచి జూన్‌ 4వరకు ఈ పరీక్షలు జరగ్గా.. దాదాపు 12.50లక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు.