రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, జోర్డాన్‌తో పాటు పలు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. జోర్డాన్‌లోని రెండు ప్రధాన యూఎస్ స్థావరాలపై శనివారం ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై అమెరికా వైమానిక దళం దాడులు చేసింది. వరుసగా ఏడో రోజు అమెరికా ఈ దాడులు కొనసాగించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, మిలిటరీ లాజిస్టిక్స్ సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు శనివారం తెల్లవారుజామున ఆ కమాండ్ నివేదికల్లో పేర్కొంది. ప్రిన్స్ హస్సన్ ఎయిర్ బేస్
దీనికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై కొత్త దాడుల దళాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. సిరియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, జోర్డాన్‌లలోని లక్ష్యాలపై తాము దాడులు జరిపినట్లు IRGC వెల్లడించింది. ఈ దాడుల్లో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లు వినియోగించినట్లు తెలుస్తోంది.
జోర్డాన్‌లోని రాయల్ జోర్దానీయాం ఎయిర్ ఫోర్స్ ఫోర్స్ కు చెందిన మురఫ్ఫాక్ శాల్తీ ఎయిర్ బేస్ లో అమెరికా ప్రధాన సైనిక స్థావరం ఉంది. ఇక్కడ యూఎస్ యుద్ధ విమానాలు, డ్రోన్‌లు, సహాయక దళాలు మోహరించి ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌పై జరిపే ఆపరేషన్లకు ఈ స్థావరాన్ని కేంద్రంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈశాన్య జోర్డాన్‌లో, సిరియా సరిహద్దు సమీపంలో ఉన్న టవర్ 22 అనే చిన్న సైనిక స్థావరంలో కూడా అమెరికా దళాలు ఉన్నారు. ప్రిన్స్ హస్సన్ ఎయిర్ బేస్ , కింగ్ ఫైసల్ ఎయిర్ బేస్ తో పాటు అనేక శిక్షణా, సరిహద్దు స్థావరాల్లో యూఎస్ సైనికులు మోహరించి ఉన్నారు.
జోర్డాన్‌లో మొత్తం 3,000–4,000 మంది అమెరికా సైనికులు ఉన్నట్లు అంచనా. శనివారం మురఫ్ఫాక్ శాల్తీ ఎయిర్ బేస్ , ప్రిన్స్ హస్సన్ ఎయిర్ Base లపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు అమెరికా సైనికులు గాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, యూఎస్ అధికారిక వర్గాలు ఈ సమాచారం పై ఇంకా ధృవీకరణ ఇవ్వలేదు.
కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అమెరికా స్థావరాలను ఇరాన్ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది. క్యాంపు అల్- మైరి, అలీ అల్ - సేలం ఎయిర్ బేస్ (కువైట్), అల్ - అజరాక్ ఎయిర్ బేస్ (జోర్డాన్), షేక్ ఇస ఎయిర్ బేస్ (బహ్రెయిన్)లలోని యూఎస్ సైనిక సదుపాయాలపై దాడులు జరిపినట్లు ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల్లో ఫైటర్ జెట్ కమాండ్ సెంటర్ , డ్రోన్ హాంగర్లు దెబ్బతిన్నాయని, అమెరికన్ సైనికులకు ప్రాణనష్టం జరిగిందని ఇరాన్ వర్గాలు అంటున్నాయి.
అమెరికా పాట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఈ దాడులను పూర్తిగా అడ్డుకోవడంలో విఫలమైందని ప్రాంతీయ నివేదికలు సూచిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పరస్పర దాడులు ప్రాంతీయ భద్రతా పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.







