బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఇరాన్‌పై

25 articles

ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్ అణు ముప్పు తగ్గించే ఒప్పందంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉన్నప్పటికీ, ఒప్పందం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, పరిస్థితుల ఆధారంగా భవిష్యత్‌లో మళ్లీ సమీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

3, ఆగ 2026

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..   ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత
అంతర్జాతీయం

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత

ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

2, ఆగ 2026

పశ్చిమాసియాను తక్షణమే ఖాళీ చేయండి..   పౌరులకు అమెరికా హెచ్చరిక
అంతర్జాతీయం

పశ్చిమాసియాను తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే మరింత తీవ్రమైన దాడులు జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ రాత్రికి గానీ.. రేపు రాత్రికి గానీ ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

1, ఆగ 2026

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండవు: ట్రంప్ స్పష్టం
అంతర్జాతీయం

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండవు: ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు పొందబోదని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి కూడా తెలుసని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరగనున్న కీలక సమావేశం ముందు చేసిన ఈ వ్యాఖ్యలతో ఇరాన్ అణు కార్యక్రమం, సైనిక ఒత్తిడి, దౌత్య చర్చలపై ఇద్దరి మధ్య వ్యూహాత్మక భేదాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

29, జులై 2026

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్
అంతర్జాతీయం

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి, హార్మూజ్‌ జలసంధి భద్రత, ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిపుణులు దౌత్య చర్చలు, పరిమిత దాడులు, పూర్తిస్థాయి యుద్ధం అనే మూడు మార్గాల్లో పరిస్థితి సాగవచ్చని, యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం ద్వారా భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

24, జులై 2026

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

24, జులై 2026

బంగారానికి మళ్లీ రెక్కలు.. రూ.1.50లక్షలకు చేరువలో..
బిజినెస్

బంగారానికి మళ్లీ రెక్కలు.. రూ.1.50లక్షలకు చేరువలో..

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు, ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ విపణిలో బుధవారం ఉదయం 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,49,400కు చేరింది.

22, జులై 2026

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.

22, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
అంతర్జాతీయం

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

19, జులై 2026

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అంతర్జాతీయం

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు

జోర్డాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో ప్రతీకార దాడులు ప్రారంభించడంతో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. మురఫ్ఫాక్ శాల్తీ , ప్రిన్స్ హస్సన్ ఎయిర్ బేస్ లపై దాడుల్లో అమెరికా సైనికులు గాయపడ్డారని స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ, యూఎస్ అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

18, జులై 2026

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి

ఇరాన్‌పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. గురువారం సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది.

17, జులై 2026

ఖర్గ్ ద్వీపం స్వాధీనమే ట్రంప్‌ లక్ష్యం!
అంతర్జాతీయం

ఖర్గ్ ద్వీపం స్వాధీనమే ట్రంప్‌ లక్ష్యం!

పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పక్కనపడిపోయింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సిచువేషన్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

16, జులై 2026

ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
అంతర్జాతీయం

ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాస సముదాయంపై జరిగిన దాడికి సంబంధించిన మొదటి వీడియో దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తాజాగా విడుదల చేసింది.

9, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు  .. ఉద్రిక్తత.. ఒకరు మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు .. ఉద్రిక్తత.. ఒకరు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

9, జులై 2026

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్
అంతర్జాతీయం

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్

పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది.

8, జులై 2026

ఇరాన్‌పై అమెరికా చమురు ఆంక్షలు మళ్లీ కఠినం
అంతర్జాతీయం

ఇరాన్‌పై అమెరికా చమురు ఆంక్షలు మళ్లీ కఠినం

ఇరాన్‌ చమురు రంగంపై అమెరికా మరోసారి ఆంక్షలను కఠినతరం చేస్తూ, గత నెలలో ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసింది. Foreign Assets Control కార్యాలయం సాధారణ అనుమతిని వెనక్కి తీసుకోవడంతో ఇరాన్‌ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలపై సడలింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

8, జులై 2026

ఇరాన్‌పై అవసరమైతే మళ్లీ దాడి’’.. నెతన్యాహు సంచలన ప్రకటన
అంతర్జాతీయం

ఇరాన్‌పై అవసరమైతే మళ్లీ దాడి’’.. నెతన్యాహు సంచలన ప్రకటన

పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న వేళ.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రపంచం ఉలిక్కిపడే ప్రకటన చేశారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని.. అవసరమైతే మరోసారి ఇరాన్‌పై దాడులు చేసి తీరతామని అంటున్నారాయన. అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక మరోసారి ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తోంది.

1, జులై 2026

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సైనిక కేంద్రాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ప్రతిగా IRGC దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేయగా, హర్మూజ్‌ జలసంధి వివాదం, లెబనాన్‌లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ ఘర్షణలతో మొత్తం ప్రాంతం అస్థిరత దిశగా సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

29, జూన్ 2026

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

28, జూన్ 2026

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్

ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

27, జూన్ 2026

అమెరికా–ఇరాన్ ఒప్పందం .. తగ్గే అవాకాశం ఉన్న చమురు, ఎల్ఎన్జీ ధరలు
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ ఒప్పందం .. తగ్గే అవాకాశం ఉన్న చమురు, ఎల్ఎన్జీ ధరలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ ధరలు తగ్గుముఖం పట్టి, బ్రెంట్ క్రూడ్ మూడు నెలల కనిష్టానికి చేరింది. ఇరాన్‌పై ఆంక్షలు సడలితే సరఫరాలు మెరుగై భారత ఇంధన దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశమున్నప్పటికీ, గ్లోబల్ ఇన్వెంటరీలు తక్కువగా ఉండటంతో ధరలు త్వరగా పాత కనిష్ట స్థాయికి చేరడం కష్టమని ఎనలిస్టులు భావిస్తున్నారు.

17, జూన్ 2026

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
అంతర్జాతీయం

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు. అయితే ‘ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.

11, జూన్ 2026

హోర్ముజ్‌ మూసివేత: అమెరికా దాడులు..  ఇరాన్‌ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు
అంతర్జాతీయం

హోర్ముజ్‌ మూసివేత: అమెరికా దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు, హోర్ముజ్‌ జలసంధి మూసివేత ప్రకటనతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్‌ ప్రతిదాడులు జరుపుతుండగా, హోర్ముజ్‌ ప్రాంతంలో విదేశీ నౌకలపై దాడుల్లో భారతీయ నావికులు కూడా ప్రమాదంలో పడుతున్నారు. తాజా దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు, 21 మందిని రక్షించినట్లు సమాచారం.

11, జూన్ 2026

ట్రాంప్ మద్దతు లేకున్నా ఇరాన్‌పై దాడులు చేస్తాం!
అంతర్జాతీయం

ట్రాంప్ మద్దతు లేకున్నా ఇరాన్‌పై దాడులు చేస్తాం!

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికా మద్దతు లేకున్నా ఇరాన్‌పై సైనిక చర్యలకు సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది, దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌ కూడా అమెరికా స్థావరాలపై ఎదురుదాడులు ప్రారంభించడంతో ప్రాంతంలో యుద్ధ భయం మరింతగా నెలకొంది.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters