రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో బుధవారం మధ్యాహ్నం 4.05 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు జాతీయ స్థాయి నేతలు, రాష్ట్ర నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన జి.పరమేశ్వర ఈసారి కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, ఎ.రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు.
డీకే శివకుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆయన భార్య ఉషా శివకుమార్, కుమార్తెతో పాటు పలువురు ఆధ్యాత్మిక నేతలు, విద్యార్థి ప్రతినిధులు, పౌరకార్మిక ప్రతినిధులు, రైతు ప్రతినిధులు, దళిత నేతలు, కన్నడ కార్యకర్తలు కార్యక్రమాన్ని వీక్షించారు.
డీకే శివకుమార్ క్యాబినెట్లో మొత్తం 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరితో గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఈ జాబితాలో కేజీ జార్జ్, జి.పరమేశ్వర, రామలింగా రెడ్డి, కృష్ణ బైరే గౌడ, యూటీ ఖాదెర్, ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, ప్రియాంక ఘర్గే, యతీంద్ర సిద్ధరామ్యయ, లక్ష్మీ హెబ్బాల్కర్ తదితరులు ఉన్నారు.
కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశ లభించనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనకు శ్రీకారం చుట్టింది.







