బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఎమ్మెల్యేల

28 articles

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి..   పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?

కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు.

3, ఆగ 2026

ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్

ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించగా, కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, Telugu Desam Party నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు నుంచి పునాదిపాడుకు వందలాది వాహనాలతో నిర్వహించిన ర్యాలీతో ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకోగా, పార్టీ శక్తి, కార్యకర్తల ఉత్సాహం స్పష్టంగా ప్రతిఫలించింది.

27, జులై 2026

రాయలసీమ జలకళకు చంద్రబాబు పాలనే పునాది: మంత్రి సవిత
జిల్లా వార్తలు

రాయలసీమ జలకళకు చంద్రబాబు పాలనే పునాది: మంత్రి సవిత

మంత్రి ఎస్. సవిత రాయలసీమ జలకళకు తెలుగుదేశం ప్రభుత్వాల పాలన పునాదిగా నిలిచిందని, కృష్ణా జలాలను కుప్పం నుంచి మడకశిర వరకు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని పేర్కొన్నారు. పోలవరం, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులతో సాగునీటి భవిష్యత్తు మెరుగుపడుతోందని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయలతో ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.

23, జులై 2026

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్‌లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా స్మృతి వన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువుగా మారారని, తన రాజకీయ ప్రయాణానికి ఆయన గానం, స్ఫూర్తి పెద్ద ఆధారమని ముఖ్యమంత్రి భావోద్వేగంగా గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, గొంతులు అర్పించిన తొమ్మిది కుటుంబాలకు ఒక్కొక్కటికి కోటి రూపాయలు అందజేసిన విషయాన్ని, “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

19, జులై 2026

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు  : 27 నుంచి ఇంటింటికీ టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు : 27 నుంచి ఇంటింటికీ టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

16, జులై 2026

తిరుమల సంప్రదాయాలపై అవగాహన లేకుండా కర్ణాటక సీఎం వ్యాఖ్యలు: భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

తిరుమల సంప్రదాయాలపై అవగాహన లేకుండా కర్ణాటక సీఎం వ్యాఖ్యలు: భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం

తిరుమల నిత్యహారతులపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తిరుమల ఆలయ సంప్రదాయాలపై అవగాహన లేకుండా మాట్లాడటం, శ్రీవారి సన్నిధిని రాజకీయ క్షేత్రంగా మార్చే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కాదని ఆయన పేర్కొంటూ, డీకే శివకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

14, జులై 2026

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం
రాజకీయాలు

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం

జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

10, జులై 2026

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..
రాజకీయాలు

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..

అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

9, జులై 2026

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..   ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..
జాతీయం

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ.. ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

9, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర..   తోపుదుర్తి సంచలన ఆరోపణలు
జిల్లా వార్తలు

టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు

అనంతపురంలో వైసీపీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్‌ పేరుతో ప్రచారంలో ఉన్న “రెడ్‌బుక్” రాజకీయాలు అరాచకాలకు దారితీస్తున్నాయని విమర్శించారు.

2, జులై 2026

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర
జాతీయం

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు.

1, జులై 2026

టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి! : రేపు సీఎం విజయ్‌ కీలక సమావేశం
జాతీయం

టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి! : రేపు సీఎం విజయ్‌ కీలక సమావేశం

తమిళనాడులో టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్ర పక్ష పార్టీల నేతలతో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్‌ సమావేశం నిర్వహించనున్నారు.

30, జూన్ 2026

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం : హాజరైన ముగ్గురు సీఎంలు
జాతీయం

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం : హాజరైన ముగ్గురు సీఎంలు

కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌,  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు.

25, జూన్ 2026

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు
జిల్లా వార్తలు

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు

నంద్యాలలో జరిగిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ సభలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వివరించారు. ఈ పథకాలు చూసి ఓర్చుకోలేక వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఆరోపిస్తూ, అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, రాయలసీమ పురోగతికి కూటమి కట్టుబడి ఉందని, కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.

18, జూన్ 2026

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ
జిల్లా వార్తలు

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ

మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయని, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. అమర్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

18, జూన్ 2026

జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్  :  సమన్వయానికి 14 మందితో కమిటీ
రాజకీయాలు

జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ : సమన్వయానికి 14 మందితో కమిటీ

జనసేనలో చేరికలను సమన్వయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌కు 14 మంది సభ్యులతో ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థుల చేరికలను ఈ కమిటీ రూపకల్పన, అమలు, సమన్వయం చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ నమూనాలోనే త్వరలో తెలంగాణలో కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

16, జూన్ 2026

రాజీనామా చేయబోము..!  TMCలో తిరుగుబాటు ఎమ్మెల్యేల ట్విస్ట్‌
జాతీయం

రాజీనామా చేయబోము..! TMCలో తిరుగుబాటు ఎమ్మెల్యేల ట్విస్ట్‌

త్రిణమూల్ కాంగ్రెస్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు, తమ పదవులకు రాజీనామా చేయబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో, పార్టీ తీరుపై తమ అసంతృప్తిని కొనసాగిస్తూ, భవిష్యత్‌ రాజకీయ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

16, జూన్ 2026

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌
జాతీయం

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌

కాంగ్రెస్‌ సిద్ధాంతపరంగా నిలబడి ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనగల ఏకైక పార్టీగా ఉందని, వచ్చే రెండేళ్లలో పార్టీ మరింత బలపడుతుందని రాహుల్‌ గాంధీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించగా, మోదీ పాలనపై దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ విలీన వార్తలు ఆధారరహితమని కేసీ వేణుగోపాల్‌ ఖండించారు.

12, జూన్ 2026

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతున్న సంక్షోభం మధ్య, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా కూటమి సమావేశం, ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు–రాహుల్ గాంధీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడినా, ఇరు పార్టీలు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ, విలీనంపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

11, జూన్ 2026

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా
జాతీయం

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా

టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వారంలో రాజీనామా చేసిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా ఆమె నిలవగా, ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10, జూన్ 2026

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ
జాతీయం

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ

ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందం ఖాళీఘాట్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ లు లేరనే కారణంతో లోపలికి అనుమతించలేదని సమాచారం. అభిషేక్ బెనర్జీకి జారీ చేసిన నోటీసు గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వ నియామకాల పత్రాలపై నకిలీ సంతకాల ఆరోపణలపై కేసు కొనసాగుతోంది.

9, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

జనసేన రాజ్యసభగా అభ్యర్థి లింగమనేని నామినేషన్
ఆంధ్రప్రదేశ్

జనసేన రాజ్యసభగా అభ్యర్థి లింగమనేని నామినేషన్

జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ లకు చెందిన 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించి మద్దతు తెలిపారు.

6, జూన్ 2026

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
రాజకీయాలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులో గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. శివకుమార్‌తో పాటు 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా, జి.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, కొత్త ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశనిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

3, జూన్ 2026

రాజకీయ భవితవ్యంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న ఎండీఎంకే
తమిళనాడు

రాజకీయ భవితవ్యంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న ఎండీఎంకే

డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కొత్త వ్యూహాలు రచిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. డీఎంకే గుర్తుతో పోటీ చేయాల్సి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన దురై వైగో, టీవీకేకు బహిరంగ మద్దతు ప్రకటించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు, కూటమి నుంచి వైదొలగడం వంటి అంశాలను ఈ నెల 27న చెన్నైలో జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

3, జూన్ 2026

పనిచేయని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు: హెచ్చరించిన సీఎం
రాజకీయాలు

పనిచేయని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు: హెచ్చరించిన సీఎం

అమరావతి : పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంతకాలం మాత్రమే పదవి సురక్షితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్ (SIR) వర్క్ షాప్‌లో ఆయన నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters