రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అప్పలరాజును శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలుకు తరలించనున్నారు.
ఈనెల 10న అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్‌తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి తన కుమారుణ్ని తప్పించేందుకు అప్పలరాజు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో ఆయన్ను ఏ3గా చేర్చారు. బుధవారం సాయంత్రం కాశీబుగ్గలో జీఎంఈ కాలనీలోని నివాసంలో అప్పలరాజును అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. గురువారం ఆయనకు పలాస సీహెచ్‌సీలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు.







