బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైకాపా

21 articles

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్
రాజకీయాలు

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్

వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

23, జులై 2026

ఒంగోలు వైకాపా కార్యాలయంలో కలకలం: మహిళా నేత ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు వైకాపా కార్యాలయంలో కలకలం: మహిళా నేత ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా ఒంగోలు వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సందర్భంగా జరిగిన వాగ్వాదం, దాడి ఘటనలతో మనస్తాపానికి గురైన వైకాపా మహిళా నాయకురాలు పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ సంఘటనతో పార్టీ అంతర్గత విభేదాలు, మహిళా నాయకుల భద్రతపై చర్చలు మళ్లీ చెలరేగుతున్నాయి.

11, జులై 2026

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ
రాజకీయాలు

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ

వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.

8, జులై 2026

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు
జిల్లా వార్తలు

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైకాపా నేతలపై, ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో తనపై పెట్టిన కేసులు, ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల కుటుంబం ఎదుర్కొన్న నష్టాలను గుర్తుచేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, ఆ సమయంలో వైకాపా నేతలకు తగిన రాజకీయ పాఠం చెబుతానని హెచ్చరించారు.

2, జులై 2026

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.. తాడిపత్రిలో ఉద్రిక్తత
రాజకీయాలు

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌.. తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

26, జూన్ 2026

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి
జిల్లా వార్తలు

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి

కడప ఉక్కు కర్మాగారానికి జులై 3న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు పరిసరాల్లో పునాది రాయి వేయనున్నారు. రూ.16,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసే ఈ మెగా స్టీల్ ప్లాంట్‌కు గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా, 1,100 ఎకరాల భూబదిలీ పూర్తి కాగా, 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

24, జూన్ 2026

వైకాపా ఎమ్మెల్యే విరుపాక్షిని అడ్డుకున్న పార్టీ నాయకులు
జిల్లా వార్తలు

వైకాపా ఎమ్మెల్యే విరుపాక్షిని అడ్డుకున్న పార్టీ నాయకులు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. సస్పెండ్ అయిన మండల కో కన్వీనర్ వీరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే విరుపాక్షి కారును అడ్డుకుని వివరణ కోరడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నాయకుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా, ఈ ఘటన వైకాపాలో అసంతృప్తికి నిదర్శనంగా మారింది.

23, జూన్ 2026

తెదేపా కార్యకర్తపై హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్‌
జిల్లా వార్తలు

తెదేపా కార్యకర్తపై హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్‌

కర్నూలు నగరంలో తెదేపా కార్యకర్తపై జరిగిన హత్యాయత్నం కేసులో వైకాపా వర్గీయులైన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు పాతబస్తీ ఖడక్‌పురకు చెందిన జలీల్‌ అహ్మద్‌, అతని కుమారులు జునైద్‌, ఫైసల్‌, వారి బంధువు ఆరిఫ్‌ను కర్నూలు ఒకటో పట్టణ పోలీసు అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

20, జూన్ 2026

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు
జిల్లా వార్తలు

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు

నంద్యాలలో జరిగిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ సభలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వివరించారు. ఈ పథకాలు చూసి ఓర్చుకోలేక వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఆరోపిస్తూ, అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, రాయలసీమ పురోగతికి కూటమి కట్టుబడి ఉందని, కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.

18, జూన్ 2026

ఏపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ అరెస్ట్‌
నేరాలు

ఏపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ అరెస్ట్‌

ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది.

18, జూన్ 2026

చిత్తూరు పరిసరాల్లో జోరుగా జూదం
జిల్లా వార్తలు

చిత్తూరు పరిసరాల్లో జోరుగా జూదం

చిత్తూరు నగర శివారు, సమీప మండలాల్లో జూద స్థావరాలు వేగంగా పెరుగుతున్నాయి. నిర్వాహకులు వాహనాలు, నగదుకు భరోసా ఇస్తూ సుదూర ప్రాంతాల నుంచి జూదరులను ఆకర్షిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జూదం జరుగుతోందని సమాచారం ఉన్నా పోలీసులు పెద్దగా స్పందించడంలేదని విమర్శలు వస్తుండగా, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు.

18, జూన్ 2026

ఉనికి కోసమే వైకాపా పాకులాట: తెదేపా జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు
జిల్లా వార్తలు

ఉనికి కోసమే వైకాపా పాకులాట: తెదేపా జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నందున, ఉనికి కోసం వైకాపా అసత్య ప్రచారం, పాకులాటలకు దిగుతోందని తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 25 నుంచి 45 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నియమావళి ఉల్లంఘనకు ముగ్గురు కార్యకర్తలకు తాఖీదులు జారీ చేసి, ఎనిమిది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

18, జూన్ 2026

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ
జిల్లా వార్తలు

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ

మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయని, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. అమర్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

18, జూన్ 2026

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత
జిల్లా వార్తలు

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత

మంత్రి సవిత పుట్టపర్తిలో జరిగిన విజయోత్సవ సభలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుల విమర్శలను ఖండిస్తూ, రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, హార్టికల్చర్‌ హబ్‌, ఆరోగ్యశ్రీ వ్యయాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేందుకు కృషి చేస్తోందని మంత్రి సవిత, మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు.

17, జూన్ 2026

మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైకాపా నైజం
రాజకీయాలు

మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైకాపా నైజం

హోంమంత్రి అనితపై వైకాపా నేతల అవమానకర, మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. అనిత కష్టపడే, ధైర్యవంతమైన ప్రజానాయకురాలని, ఆమెపై వ్యక్తిగత దాడులతో వైకాపా మహిళల పట్ల అసమ్మానం, అసహనాన్ని చూపుతోందని పేర్కొంటూ, అనితతో పాటు ప్రతి మహిళ, ప్రతి దళితుడికి క్షమాపణ చెప్పాలని, ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

17, జూన్ 2026

హోంమంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

హోంమంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: పవన్‌ కల్యాణ్‌

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండిస్తూ, అవి మహిళలందరినీ కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు విధానాలకే పరిమితమై ఉండాలని, వ్యక్తిగతంగా మహిళలను అవమానించే భాష అసహ్యకరమని ఆయన హెచ్చరిస్తూ, కూటమి నేతలు ఇలాంటి వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టాలని సూచించారు.

16, జూన్ 2026

వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా పోలీసు కస్టడీకి.. కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్

వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా పోలీసు కస్టడీకి.. కోర్టు అనుమతి

హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర కేసులో అరెస్టయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మూడు రోజుల పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. గండిపేట సమీపంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారు. వీటి ఆధారంగా ఈ కేసులో అరెస్టయిన మరికొందరు నిందితులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు.

15, జూన్ 2026

గనులు లాక్కున్న వైకాపా ప్రభుత్వం: మంత్రి రవీంద్ర ఆరోపణ
జిల్లా వార్తలు

గనులు లాక్కున్న వైకాపా ప్రభుత్వం: మంత్రి రవీంద్ర ఆరోపణ

గత వైకాపా ప్రభుత్వ కాలంలో మైనింగ్‌ రంగంలో భారీ అక్రమాలు జరిగి, క్వారీ యజమానులను వేధించి గనులను లాక్కున్నారని రాష్ట్ర మైనింగ్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మూతపడిన క్వారీలను తిరిగి ప్రారంభించడంతో ప్రభుత్వ ఆదాయం సుమారు 40 శాతం పెరిగిందని, ఖనిజ వనరులను పారదర్శకంగా వినియోగిస్తూ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

12, జూన్ 2026

తాడిపత్రిలో హైటెన్షన్!...    పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని జేసీ డిమాండ్‌
రాజకీయాలు

తాడిపత్రిలో హైటెన్షన్!... పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని జేసీ డిమాండ్‌

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు, కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ భారీ నిరసన చేపట్టగా, పరిస్థితి అదుపులో ఉండేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో పహారా కట్టారు.

12, జూన్ 2026

నకిలీ జీవోలు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌
రాజకీయాలు

నకిలీ జీవోలు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌

హైదరాబాద్‌ గండిపేట ప్రభుత్వ భూములను కాజేయడానికి నకిలీ జీవోలు సృష్టించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గండిపేటలో 9 ఎకరాలు 28 గుంటల భూమి అక్రమ స్వాధీనానికి ఆయన తెర వెనక నుంచి మంత్రాంగం నడిపినట్లు, రూ.1.25 కోట్లు బ్యాంకు లావాదేవీ కీలక ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters