రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ మినీ వేలానికి ఇంకా నెలలు ఉన్నా, ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ చర్చలు మాత్రం వేడెక్కుతున్నాయి. సాధారణంగా డిసెంబరులో జరిగే మినీ వేలానికి ముందే కొన్ని జట్లు తమ కాంబినేషన్‌ను బలపర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే రిషబ్ ప్యాంటు , కుల్దీప్ యాదవ్ లు ట్రేడింగ్ ద్వారా జట్లు మార్చుకున్నారు. మరికొందరి పేర్లు కూడా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
క్రీడా వర్గాల సమాచారం ప్రకారం ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా కింగ్స్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ , సుంరీసెర్స్ హైదరాబాద్ వంటి జట్ల మధ్య పలు కీలక ఆటగాళ్ల మార్పిడి చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి అధికారిక ప్రకటనలు కాకపోయినా, ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ఆధారంగా కొన్ని పేర్లు బాగా హాట్‌టాపిక్‌గా మారాయి.
ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్య దూరమయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కోల్కతా కింగ్స్ రైడర్స్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ , ఖలీల్ అహ్మద్ ను వదులుకునేందుకు సిద్ధమవుతుండగా, అతనిని ముంబై ఇండియన్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
హార్దిక్ పాండ్య కోల్కతా కింగ్స్ రైడర్స్ లో చేరితే, అతని బదులుగా కామెరాన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ కు ట్రేడ్ చేసే దిశగా చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫినిషర్‌గా మెరిసిన అశుతోష్ శర్మ ను చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ చేయాలని ఢిల్లీ యాజమాన్యం చూస్తోందని సమాచారం. అతనికి బదులుగా ఒక స్పిన్నర్‌తో పాటు గుర్జాపునీటి సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఫినిషర్ అశుతోష్ శర్మ వస్తే, చాలా ఏళ్లుగా ఆ జట్టులో ఫినిషర్‌గా ఉన్న శివమ్ దూబే ను ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే అజింక్య రహానే పై “థాంక్యూ” చెప్పే దిశగా ఉన్న కోల్కతా కింగ్స్ రైడర్స్ , అతని స్థానంలో ముంబై ఇండియన్స్ నుంచి సూర్యకుమారి యాదవ్ ను తీసుకోవాలని చూస్తోందని టాక్.
సూర్యకుమారి యాదవ్ కోసం కోల్కతా కింగ్స్ రైడర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీపడుతున్నాయట. ఈ రెండు జట్లకూ అనుభవజ్ఞుడైన కెప్టెన్ అవసరం ఉన్న నేపథ్యంలో సూర్యను లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ముంబై ఇండియన్స్ నుంచి సూర్యకుమారి యాదవ్ రాజస్థాన్ రాయల్స్ కు వెళ్తే, అతని బదులుగా యశస్వి జైస్వాల్ ను ట్రేడ్ చేసుకోవాలనే ఆలోచన ముంబై యాజమాన్యంలో ఉన్నట్టు వినిపిస్తోంది.
ప్రశాంత్ వీర్ ను తీసుకున్నప్పటికీ అతనికి తగిన అవకాశాలు ఇవ్వలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ , ఇప్పుడు అతడిని లక్నో సూపర్ జెయింట్స్ కు ట్రేడ్ చేయాలని చూస్తోందని సమాచారం. రిటైన్ సమయంలో ఇషాన్ కిషన్ ను వదిలేసిన ముంబై ఇండియన్స్ , ఇప్పుడు అతడిని తిరిగి తీసుకునేందుకు సుంరీసెర్స్ హైదరాబాద్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్ ఖాయం అన్నట్టే కనిపిస్తోంది. తాజాగా వచ్చిన రిషబ్ ప్యాంటు కానీ, KL రాహుల్ కానీ ఆ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ ను లక్నో సూపర్ జెయింట్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ చేసే అవకాశాలపై కూడా చర్చలు సాగుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ప్రదర్శనపై ఆ జట్టు యాజమాన్యం పూర్తిగా సంతృప్తిగా లేనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ట్రేడింగ్ ప్రక్రియలో అతడూ జట్టు మారే అవకాశమున్నట్టు క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గమనిక: పై వివరాలన్నీ ప్రస్తుతానికి క్రీడా వర్గాల్లో ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. ట్రేడింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అధికారిక వివరాలను IPL నిర్వాహకులు, ఆయా ఫ్రాంచైజీలు ప్రకటిస్తాయి.







