టోక్యో: ప్రముఖ భారత డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. గత రెండేళ్లుగా ఒక్క టైటిలూ సాధించలేకపోయిన ఈ ద్వయం.. ఈసారి జపాన్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఫార్మ్‌ తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్ శెట్టి

భుజం గాయం కారణంగా సాత్విక్‌ ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌కు దూరమయ్యాడు. ఆ టోర్నమెంట్‌లో పాల్గొనలేకపోయిన సాత్విక్‌-చిరాగ్‌ జంటకు జపాన్‌ ఓపెన్‌ పునరాగమనం టోర్నీగా నిలవనుంది. గాయం నుంచి కోలుకున్న సాత్విక్‌ మళ్లీ కోర్టులోకి అడుగుపెడుతుండగా, ఈ జంట ప్రదర్శనపై బ్యాడ్మింటన్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

పురుషుల డబుల్స్‌ విభాగంలో తొలి రౌండ్లో డెన్మార్క్‌ ఆటగాళ్లు డానియెల్‌-మాడ్స్‌ జంటతో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ తలపడనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్థిరమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న భారత జంటకు ఈ మ్యాచ్‌ కీలకంగా భావిస్తున్నారు. గతంలో అనేక సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఈ ద్వయం.. టైటిల్‌ దిశగా పయనించేందుకు తొలి అడుగు వేయాలని చూస్తోంది.

జపాన్‌ ఓపెన్‌లో భారత క్రీడాకారులు వివిధ విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో P.V. సింధు మలేసియా క్రీడాకారిణి వాఙ తో పోటీపడనుంది. ఇటీవల ఫార్మ్‌ కోసం పోరాడుతున్న సింధు కి ఈ మ్యాచ్‌ ముఖ్యమైన పరీక్షగా భావిస్తున్నారు.

అలాగే చైనీస్ తైపీ కు చెందిన హుయాంగ్ తో యువ క్రీడాకారిణి ఉన్నతి హోదా తలపడనుంది. అంతర్జాతీయ స్థాయిలో అనుభవాన్ని పెంచుకుంటున్న ఉన్నతి కి ఇది మరో మంచి అవకాశం. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య Sen తొలి రౌండ్లో జపాన్‌ ఆటగాడు కోకి తో ఆడనున్నాడు. లక్ష్య ఇటీవల కొన్ని టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచిన నేపథ్యంలో, జపాన్‌ ఓపెన్‌లోనూ మంచి ఫలితాల కోసం ప్రయత్నించనున్నాడు.

థాయిలాండ్ కు చెందిన విడిట్ సర్న్ తో ఆయుష్ శెట్టి పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో తలపడతాడు. యువ క్రీడాకారుడైన ఆయుష్ కు ఇది కీలక పోటీగా భావిస్తున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ధృవ్ కపిల- తానిషా , రుత్విక -రోహన్ జంటలు భారత తరఫున బరిలోకి దిగుతున్నాయి. ఈ జోడీలు కూడా తొలి రౌండ్లలో విజయాలతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మొత్తం మీద జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ అభిమానులు దృష్టి సారించారు. ముఖ్యంగా సాత్విక్‌-చిరాగ్‌ జంట పునరాగమనం ఎలా ఉంటుందో చూడాలని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.