సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది..: బీసీసీఐ

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా తలుపులు ఇంకా మూసుకుపోలేదని బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వర్గాలు స్పష్టం చేశాయి. ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవడంతో అతడిని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులో స్థానం కూడా కోల్పోయిన విషయం తెలిసిందే.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు ఫామ్ కోల్పోవడంతో సెలెక్టర్లు సూర్యకుమార్‌పై వేటు వేసి, అతని స్థానంలో శ్రేయాస్ ఇయర్ కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. అయితే కొత్త కెప్టెన్ నాయకత్వంలో టీం ఇండియా ప్రదర్శన అత్యంత దారుణంగా మారింది. ఐర్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. చరిత్రలో ఐర్లాండ్‌పై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఇదే మొదటిసారి.

ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా టీం ఇండియా ఘోర పరాజయాలను చవిచూసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. మొత్తం సిరీస్‌ను 4-0 తేడాతో కోల్పోయింది. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో, మూడో మ్యాచ్‌లో 125 పరుగుల భారీ తేడాతో, నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో, చివరి టీ20లో Southampton‌ లో 56 పరుగుల తేడాతో భారత్ పరాజయం పొందింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి.

ఈ వరుస పరాజయాల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. టీమిండియాలో అతని స్థానం, తిరిగి అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI వర్గాలు సూర్యకుమార్‌కు ఇంకా అవకాశం ఉందని, అయితే ఒక కీలక షరతు నెరవేర్చాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

“సూర్యకుమార్ యాదవ్ కోసం తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. ప్రస్తుతానికి అతను మా ప్రణాళికల్లో లేకపోయినా, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే తిరిగి జట్టులోకి వచ్చేందుకు అర్హుడు”

అని BCCIకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అంటే, దేశవాళీ క్రికెట్‌లో సూర్యకుమార్ తన ఫామ్‌ను తిరిగి నిరూపించుకోవడం కీలకంగా మారింది. రంజీ, సయ్యద్ ముష్తాఖ్ అలీ , విజయ్ హజారే వంటి టోర్నమెంట్లలో అతడు స్థిరంగా రాణిస్తే, మళ్లీ Team Indiaలోకి పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ముగియడంతో ఇప్పుడు టీం ఇండియా దృష్టి వన్ డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్‌పై కేంద్రీకరించనుంది. ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నారు. అలాగే 2023 World Cup ఫైనల్ తర్వాత ODIలు ఆడని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాహ్ కూడా ఈ సిరీస్ ద్వారా మళ్లీ జట్టులోకి రావడం విశేషం.