బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఐర్లాండ్

32 articles

2027 వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్థాన్‌ ఎంపిక
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్థాన్‌ ఎంపిక

ఐర్లాండ్‌పై మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్‌ జట్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానాన్ని పదిలం చేసుకుని 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి వెళ్లిన అఫ్గాన్‌ జట్టుకు, ప్రపంచకప్‌లో స్థానం ఖాయం కావడంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తన స్థాయి మరింత బలపడింది.

11, ఆగ 2026

వన్డేల్లో అరుదైన ఘనతతో రషీద్ ఖాన్
క్రీడలు

వన్డేల్లో అరుదైన ఘనతతో రషీద్ ఖాన్

ఐర్లాండ్‌తో రెండో వన్డేలో రషీద్ ఖాన్ 10 ఓవర్లలో 34 పరుగులకు 6 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌కు 92 పరుగుల తేడాతో విజయం అందించాడు. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మూడుసార్లు సాధించిన ప్రపంచంలోని తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించి, వానిండు హాసరంగా , ఇమ్రాన్ తాహిర్ , షాహిద్ ఆఫ్రిది , అఖిల ధనంజయ , సందీప్ లామిచ్చనే , అజంతా మెండిస్ తదితరులపై ముందంజలో నిలిచాడు.

9, ఆగ 2026

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్
క్రీడలు

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్

సంజు శాంసన్ ఇకపై ఇతరుల అభిప్రాయాలు, జట్టులో పోటీ గురించి ఆలోచించకుండా తన నిబంధనల ప్రకారమే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో మూడు అర్ధశతకాలు చేసి భారత్ టైటిల్ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన సంజు, భవిష్యత్తు ప్రపంచ కప్‌ల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించడం, జట్టుకు అవసరమైనప్పుడు తన వంతు పాత్ర పోషించడమే లక్ష్యమని తెలిపాడు.

28, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

26, జులై 2026

జింబాబ్వేపై భారత్ ఘన విజయం
క్రీడలు

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలు, అభిషేక్ శర్మ, యశ్ ఠాకూర్ బౌలింగ్ ధాటితో భారత్ 219 పరుగులు చేసి, జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

26, జులై 2026

హరారేలో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం.. వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి
క్రీడలు

హరారేలో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం.. వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి

టీ20 ప్రపంచ కప్‌ తర్వాత వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియా, హరారేలో జింబాబ్వేపై తొలి టీ20లో విజయాలతో పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలతో భారత బ్యాటింగ్‌కు మెరుపు ఆరంభం, స్థిరత్వం కీలకం కాగా, సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే స్వదేశంలో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

23, జులై 2026

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు
క్రికెట్

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు

జూలై 23న హరారేలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్, సీనియర్‌లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లతో జట్టు రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

22, జులై 2026

జూలై 23 నుంచి జింబాబ్వేతో భారత్ టీ20 సిరీస్‌ ప్రారంభం..
క్రికెట్

జూలై 23 నుంచి జింబాబ్వేతో భారత్ టీ20 సిరీస్‌ ప్రారంభం..

జూలై 23 నుంచి 26 వరకు భారత్–జింబాబ్వే మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు హరారేలో జరగనున్నాయి. వరుస పరాజయాల తర్వాత ఈ సిరీస్‌లో విజయం సాధించడం ద్వారా శ్రేయాస్ ఇయర్ నాయకత్వాన్ని బలపరచుకోవాలని టీమ్ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్8 స్పోర్ట్స్ టీవీ ఛానళ్లలో, ఫ్యాన్ కోడ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానుండగా, వీక్షించాలంటే తప్పనిసరిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

21, జులై 2026

సిరీస్‌.. సాధిస్తారా? రెండో వన్డేలో టీమ్‌ఇండియా లక్ష్యం
క్రికెట్

సిరీస్‌.. సాధిస్తారా? రెండో వన్డేలో టీమ్‌ఇండియా లక్ష్యం

ఇంగ్లాండ్‌తో కార్డిఫ్‌లో జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్‌ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి వన్డేలో శుబ్మం గిల్ గాయం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్ వైఫల్యం ఆందోళన కలిగిస్తుండగా, జస్ప్రీత్ బుమ్రాహ్,ఆక్సర్ పటేల్ తో కూడిన బౌలింగ్‌ దళం బలంగా ఉంది. సిరీస్‌ నిలుపుకోవాలంటే ఇంగ్లాండ్‌ కూడా కసితో బరిలోకి దిగనుంది.

16, జులై 2026

యూకే పర్యటనలో భారత్‌కు తొలి విజయం
క్రీడలు

యూకే పర్యటనలో భారత్‌కు తొలి విజయం

యూకే పర్యటనలో వరుస టీ20 పరాజయాల తర్వాత భారత్‌ వన్డేల్లో పుంజుకుంది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌, తర్వాత అక్షర్‌–వాషింగ్టన్‌ సుందర్‌ అజేయ అర్ధశతకాలు భారత్‌కు విజయాన్ని అందించగా, రెండో వన్డే గురువారం జరగనుంది.

15, జులై 2026

సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది... : బీసీసీఐ
క్రీడలు

సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది... : బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా నుంచి తప్పించినప్పటికీ, అతనికి తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని BCCI వర్గాలు స్పష్టం చేశాయి. దేశవాళీ క్రికెట్‌లో రంజీ, సయ్యద్ ముష్తాఖ్ అలీ , విజయ్ హజారే టోర్నీల్లో నిలకడగా రాణిస్తే తిరిగి జట్టులోకి రావడానికి అర్హత సాధిస్తాడని సూచించాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రాహ్ తిరిగి జట్టులోకి చేరుతున్నారు.

14, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో వరుస పరాజయాల కారణంగా ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయి, ఇంగ్లాండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ వెనుకబడినా, బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మలు టాప్‌-2లో, బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా టాప్‌-10లో కొనసాగడం విశేషం.

12, జులై 2026

ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు మరో వైట్ వాష్‌ షాక్‌
క్రీడలు

ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు మరో వైట్ వాష్‌ షాక్‌

సౌథాంప్టన్‌లో జరిగిన ఐదో టీ20లో ఇంగ్లాండ్ భారత్‌పై 56 పరుగుల తేడాతో గెలిచి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. జోస్ బట్లర్ శతకం, హ్యారీ బ్రూక్ 95 పరుగులతో ఇంగ్లాండ్ 257/3 భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో భారత్ 201/8కే పరిమితమై, వరుసగా రెండోసారి టీ20 సిరీస్‌లో వైట్ వాష్‌ను ఎదుర్కొంది.

12, జులై 2026

శ్రేయస్ పోరాటం వృథా.. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
క్రీడలు

శ్రేయస్ పోరాటం వృథా.. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ ఇంగ్లాండ్‌ చేతికి 9 వికెట్ల తేడాతో ఓడి, అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ 80 పరుగులతో ఒంటరిగా పోరాడగా, మిగతా బ్యాటర్లు, బౌలర్లు విఫలమయ్యారు. Phil Salt, Harry Brook అజేయ అర్ధశతకాలతో ఇంగ్లాండ్‌ 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

10, జులై 2026

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20
క్రీడలు

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20

టీమ్‌ఇండియా వరుసగా నాలుగు టీ20ల్లో ఓటములు చవిచూసి, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 0-2తో వెనుకబడిన నేపథ్యంలో, బ్రిస్టల్‌లో నేడు జరగనున్న నాలుగో మ్యాచ్‌ ద్వారా సిరీస్‌లో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌ సహా భారత బ్యాటింగ్‌ పూర్తిగా విఫలమవుతుండగా, మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు ఈసారి భారత్‌పై తొలి టీ20 సిరీస్‌ విజయాన్ని సాధించాలని పట్టుదలగా ఉంది.

9, జులై 2026

నాటింగ్‌హామ్‌లో నేడే మూడో టీ20
క్రీడలు

నాటింగ్‌హామ్‌లో నేడే మూడో టీ20

భారత్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉండటంతో నాటింగ్‌హామ్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు కీలక ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను నిలుపుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రవి బిష్ణోయ్ స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

7, జులై 2026

ప్రపంచ క్రికెట్‌లో మాకు గౌరవం పెరిగింది : ఐర్లాండ్ క్రికెట్ చీఫ్
క్రీడలు

ప్రపంచ క్రికెట్‌లో మాకు గౌరవం పెరిగింది : ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

భారత క్రికెట్ జట్టును ఐర్లాండ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ వంటి ప్రపంచ ఛాంపియన్ జట్టుపై చారిత్రక టీ20 సిరీస్ విజయం ఐర్లాండ్ క్రికెట్ ప్రతిష్ఠను పెంచిందని ఆ దేశ బోర్డు అధ్యక్షుడు బ్రయాన్ ఓడొన్నెల్ పేర్కొన్నారు.

3, జులై 2026

ఇంగ్లాండ్‌పై మెరిసిన భారత్‌ బ్యాటింగ్‌.. తొలి టీ20 వర్షార్పణం
క్రీడలు

ఇంగ్లాండ్‌పై మెరిసిన భారత్‌ బ్యాటింగ్‌.. తొలి టీ20 వర్షార్పణం

చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో జరిగిన భారత్‌–ఇంగ్లాండ్‌ తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబె కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, వర్షం వల్ల ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కి అవకాశం లేకపోయినా, భారత్‌ బ్యాటింగ్‌ ఫామ్‌ తిరిగి రావడం జట్టుకు, అభిమానులకు ఊరట కలిగించింది.

2, జులై 2026

ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ఇండియాకు పరీక్ష..   వైభవ్ అరంగేట్రంపై ఆసక్తి
క్రీడలు

ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ఇండియాకు పరీక్ష.. వైభవ్ అరంగేట్రంపై ఆసక్తి

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ బుధవారం చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఓటముల తర్వాత టీమ్ఇండియా పునరాగమనం కోసం ప్రయత్నించనుండగా, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తొలి టీ20లోనే అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో బలమైన బ్యాటింగ్, పేస్‌ బౌలింగ్ దళాలు ఉండటంతో సిరీస్‌ ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది.

30, జూన్ 2026

ఐర్లాండ్‌ విజయానికి జై ముంద్రా కీలకం
క్రీడలు

ఐర్లాండ్‌ విజయానికి జై ముంద్రా కీలకం

రాజస్థాన్‌లో జన్మించిన జై ముంద్రా ఉన్నత విద్య కోసం ఐర్లాండ్‌ చేరి అక్కడే క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. లేమిన్స్టర్ క్లబ్‌ ద్వారా మెరిసి ఐర్లాండ్ ఇంటర్ - ప్రొవిన్సియల్ T20లో రాణించిన అతడు, టీమ్‌ఇండియాతో చారిత్రాత్మక సిరీస్‌లో ఐర్లాండ్‌ తరఫున అద్భుత బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకుని సిరీస్‌ విజయానికి కీలకంగా నిలిచాడు.

30, జూన్ 2026

అతివిశ్వాసం టీమ్‌ఇండియా కొంపముంచింది:  మాజీల ఆగ్రహం
క్రీడలు

అతివిశ్వాసం టీమ్‌ఇండియా కొంపముంచింది: మాజీల ఆగ్రహం

టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే ఐర్లాండ్‌ చేతిలో 0-2 తేడాతో ఓడిపోవడం టీమ్‌ఇండియాపై తీవ్ర విమర్శలకు దారితీసింది. అతివిశ్వాసం, చిన్న జట్టుగా నిర్లక్ష్య భావన, నాసిరక ఫీల్డింగ్‌, బాధ్యతారహిత బ్యాటింగ్‌, జట్టు ఎంపికలో మేనేజ్‌మెంట్‌ తీరు ప్రధాన కారణాలుగా మాజీ క్రికెటర్లు శఠగోపన్‌ రమేశ్‌, ఆకాశ్‌ చోప్రా, మహ్మద్‌ కైఫ్‌ సూచించారు. రాబోయే సిరీస్‌లకు ముందు వ్యూహాల్లో మార్పులు అవసరమని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

29, జూన్ 2026

ఐర్లాండ్‌దే సిరీస్‌ విజయం…  రెండో టీ20లోనూ భారత్‌ ఓటమి
క్రికెట్

ఐర్లాండ్‌దే సిరీస్‌ విజయం… రెండో టీ20లోనూ భారత్‌ ఓటమి

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ రెండో మ్యాచ్‌లోనూ ఓడి 2-0తో సిరీస్‌ను కోల్పోయింది. బెల్‌ఫాస్ట్‌లో జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్‌ 154 పరుగులకు 8 వికెట్లు, భారత్‌ 153 పరుగులకు 9 వికెట్లు చేసి ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. వరుసగా 16 టీ20 సిరీస్‌ల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియాకు ఇది తొలి సిరీస్‌ ఓటమిగా నమోదు కాగా, ఐర్లాండ్‌ భారత్‌పై ఏ ఫార్మాట్లోనైనా సిరీస్‌ గెలిచిన మొదటి సందర్భం ఇది.

29, జూన్ 2026

ఐర్లాండ్‌ చేతిలో షాక్‌.. అయినా సెమీస్‌కు విండీస్
క్రీడలు

ఐర్లాండ్‌ చేతిలో షాక్‌.. అయినా సెమీస్‌కు విండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌–2 నుంచి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సెమీఫైనల్స్‌కు చేరాయి. ఐర్లాండ్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడినా, న్యూజిలాండ్‌ ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలవడంతో వెస్టిండీస్‌ రెండో స్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అదే గ్రూప్‌లో శ్రీలంక స్కాట్లాండ్‌పై గెలిచింది కాగా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ జట్లు లీగ్‌ దశతోనే నిష్క్రమించాయి.

28, జూన్ 2026

ఐర్లాండ్‌తో రెండో టీ20 ఈరోజే.. అసలు సత్తా చూపాల్సిన భారత్‌
క్రీడలు

ఐర్లాండ్‌తో రెండో టీ20 ఈరోజే.. అసలు సత్తా చూపాల్సిన భారత్‌

ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీం ఇండియా ఆశ్చర్యకరంగా ఓడి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో కీలకమైన రెండో టీ20ను ఈరోజు బెల్‌ఫాస్ట్‌లో ఆడనుంది. శ్రేయాస్ ఇయర్ నాయకత్వంలో టాప్‌ ఆర్డర్‌ విఫలం, ప్రసాద్ కృష్ణ బౌలింగ్‌లో తేలిపోవడం భారత్‌ పరాజయానికి కారణమయ్యాయి. రెండో మ్యాచ్‌లో జట్టు కూర్పులో మార్పులు చేసి, బౌలింగ్‌ దాడిని బలోపేతం చేస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

28, జూన్ 2026

పరిస్థితులను అర్థం చేసుకోలేక ఓడిపోయాం : అభిషేక్‌ శర్మ
క్రీడలు

పరిస్థితులను అర్థం చేసుకోలేక ఓడిపోయాం : అభిషేక్‌ శర్మ

టీ20 ప్రపంచ కప్‌ తర్వాత తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లోనే టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. అదీనూ ఐర్లాండ్‌ వంటి జట్టు చేతిలో పరాజయం చవిచూసింది.

27, జూన్ 2026

ఐర్లాండ్‌ చేతిలో భారత్‌కు తొలి పరాజయం
క్రీడలు

ఐర్లాండ్‌ చేతిలో భారత్‌కు తొలి పరాజయం

ఐర్లాండ్‌ బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియాను 34 పరుగుల తేడాతో ఓడించి, భారత్‌పై అన్ని ఫార్మాట్లలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ బ్యాటింగ్‌ విభాగం విఫలమై 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఐర్లాండ్‌ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, రెండో టీ20 ఆదివారం జరగనుంది.

27, జూన్ 2026

ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు దక్కని అవకాశం
క్రికెట్

ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు దక్కని అవకాశం

బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకోగా, వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతని అరంగేట్రం కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో వైభవ్‌కు అవకాశం దక్కే అవకాశాలపై చర్చ నడుస్తుండగా, ఈ సిరీస్‌ను రెండు జట్లు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

26, జూన్ 2026

ప్రదర్శనే ముఖ్యం టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
క్రికెట్

ప్రదర్శనే ముఖ్యం టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌

ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా నియమించడంపై మహ్మద్‌ కైఫ్‌ స్పందించాడు. వైస్‌ కెప్టెన్‌ హోదా ఉన్నంత మాత్రాన జట్టులో స్థానం గ్యారంటీ కాదని, ఫామ్‌ లేకపోతే ఎవరికీ స్థిరమైన స్థానం ఉండదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుత కోచ్‌, సెలక్టర్ల దృష్టిలో హోదా కంటే ప్రతి మ్యాచ్‌లోని ప్రదర్శనకే ప్రాధాన్యం ఉందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

26, జూన్ 2026

వైభవ్‌ కోసం ఓపెనింగ్‌ కుర్చీలాట: సంజు శాంసన్‌నా? అభిషేక్‌ శర్మనా?
క్రీడలు

వైభవ్‌ కోసం ఓపెనింగ్‌ కుర్చీలాట: సంజు శాంసన్‌నా? అభిషేక్‌ శర్మనా?

ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మొదలయ్యే టీ20 సిరీస్‌తో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం దాదాపు ఖాయమవుతోంది. అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలంటే అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ల బ్యాటింగ్‌ క్రమంలో మార్పులు చేయాల్సి రావచ్చని, అలాగే బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌తో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేల్లో కొందరికి మాత్రమే తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

25, జూన్ 2026

ఐర్లాండ్‌ టీ20ల నుంచి నితీశ్‌ ఔట్‌ – ఇంగ్లాండ్‌ టూర్‌కు సందేహమే
క్రీడలు

ఐర్లాండ్‌ టీ20ల నుంచి నితీశ్‌ ఔట్‌ – ఇంగ్లాండ్‌ టూర్‌కు సందేహమే

తొడ కండరాల గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ నుంచి తప్పుకోగా, ఇంగ్లాండ్‌ పర్యటనకు కూడా అతని అందుబాటు అనుమానంగా మారింది. కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించగా, అతని స్థానంలో సూర్యాంశ్‌ షెడ్జెను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

23, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters