రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
లంకను కసితీరా వేటాడిన వైభవ్..!
29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు
శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఎ ఓపెనర్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అత్యధిక సమయం బౌండరీ బయటే ఉందంటే అతిశయోక్తి కాదు. షిరాజ్ వేసిన మూడో ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో ఏకంగా 26 పరుగులు పిండాడు.
కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు సాధించాడు. అయితే, సహన్ బౌలింగ్‌లో 8.5వ బంతికి వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శతకం ముందు ఔటయ్యాడని ఫ్యాన్స్ బాధపడ్డా.. శ్రీలంకను ఆదిలోనే బలమైన దెబ్బకొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రియాంశ్ 39 పరుగులు చేసి దుల్‌జ్ బౌలింగ్‌లో వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకొన్నాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్, రుతురాజ్ ఉన్నారు. భారత్-ఎ 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.







