రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
వైభవ్ చేతికి టీమిండియా జెర్సీ..
ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?..
భారత క్రికెట్ రంగానికి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయస్సులోనే టీమిండియాకు ఎంపికపై సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో తన అసాధారణను చూసిన BCCI ఈ వండర్ కిడ్‌కు జాతీయ టీ20 జట్టులో చోటు కల్పించింది. ఈ సందర్భంగా ఇటీవల బీసీసీఐ రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టీమిండియాకు ఆడడం అనేది ప్రతి క్రికెటర్ డ్రీమ్.. దీన్ని అచీవ్ చేయడానికి చాలా మందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కేవలం 15 ఏళ్లకే తన కలని నిజం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరుతో అందరిని ఆకర్షించిన వైభవ్..బీసీసీఐ సెలెక్టర్ మనసు గెలిచి 15 ఏళ్లకే ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ అయి అతి చిన్న వయస్సులోనే భారత జట్టుకు సెలెక్ట్ అయిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని ప్రతిబింబిస్తూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో, టీమ్ ఇండియా ప్రముఖ త్రోడౌన్ స్పెషలిస్ట్ ‘రఘు’ చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ జెర్సీని అందుకున్నాడు. జెర్సీని అందుకున్న సూర్యవంశీ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.







