రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
సమంత దంపతులకు చిరంజీవి శుభాకాంక్షలు
హైదరాబాద్: నటులు సమంత, రాజ్‌లకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విజయవంతం కావడంతో ఆ చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. టీమ్‌ను తన నివాసానికి ఆహ్వానించి, సినిమా గురించి విశేషంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా సమంత, రాజ్‌లకు చిరంజీవి దంపతులు నూతన వస్త్రాలతో పాటు ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ తర్వాత ఆ జంటతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు ‘మెగా బంగారం మూమెంట్’ అనే క్యాప్షన్‌తో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
అని సమంత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, సమంత తల్లి కానున్న నేపథ్యంలో చిరంజీవి దంపతులు సారె పెట్టారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలతో ఈ ఫొటోలను చిరంజీవి పంచుకున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
‘మా ఇంటి బంగారం’ చిత్రంపై చిరంజీవి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను సమతూకంగా మేళవిస్తూ, వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయన అభినందించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరమని చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు.
సమంత సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవీ పిక్చర్స్’పై నిర్మితమైన ‘మా ఇంటి బంగారం’కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత సమంత ఈ పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాతో వెండితెరపై మళ్లీ మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు దూసుకెళ్తున్న వేళ మెగాస్టార్ నుంచి వచ్చిన ప్రశంసలు చిత్ర యూనిట్‌కు మరింత ఉత్సాహాన్ని నింపాయి.
మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.43 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. విజయవంతమైన కలెక్షన్లు, ప్రముఖుల ప్రశంసలు, అభిమానుల ఆదరణతో ‘మా ఇంటి బంగారం’ ప్రస్తుతానికి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.







