ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం, ఇటీవల విడుదలైన పోస్టర్‌తోనే సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేట్రికల్ రైట్స్ బిజినెస్ డీల్స్‌ను వేగంగా ముగిస్తున్న ఈ చిత్ర బృందం, తాజాగా కర్ణాటక మార్కెట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

‘స్పిరిట్’ సినిమా కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దిగ్గజ పంపిణీ సంస్థ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ రెండు పెద్ద సంస్థలు కలిసి కర్ణాటక వ్యాప్తంగా ‘స్పిరిట్’ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయని చిత్ర బృందం తెలిపింది.

ప్రభాస్‌కు కర్ణాటకలో భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి’ వంటి చిత్రాలు అక్కడ రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించాయి. ఈ విజయాల నేపథ్యంలో ‘స్పిరిట్’ కోసం కూడా కర్ణాటకలో విస్తృతమైన విడుదల ప్రణాళికను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్నాయి.

కర్ణాటకలో కొత్త ఆల్ టైమ్ బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లు, రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా ‘స్పిరిట్’ విడుదలకు సిద్ధమవుతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది. ప్రభాస్ గత చిత్రాల విజయాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి మరింత పెద్ద స్థాయిలో థియేటర్ల సంఖ్యను పెంచే దిశగా డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం.

T- సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

‘స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. కర్ణాటక రైట్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకోవడంతో అక్కడి బాక్సాఫీస్‌పై ఈ చిత్రం ప్రభావం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మరింత పెరిగింది.