బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దశలో

90 articles

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి
జిల్లా వార్తలు

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి

ఏపీఎస్పీడీసీఎల్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల సీనియారిటీ, ప్రస్తుత స్థితి తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే సర్వీసు స్థితి వెంటనే స్క్రీన్‌పై కనిపించేలా వ్యవస్థను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తమ ప్రాంత విద్యుత్ కార్యాలయాల్లో దరఖాస్తు నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది.

8, ఆగ 2026

కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి విజయానికి విరాట్ కోహ్లీ కీలక మద్దతు
క్రీడలు

కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి విజయానికి విరాట్ కోహ్లీ కీలక మద్దతు

కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన బాక్సర్ సాక్షి చౌదరి తన విజయ ప్రయాణంలో విరాట్ కోహ్లీ, ఆయన ఫౌండేషన్ మద్దతు కీలకమైందని పేర్కొంది. మూడు సంవత్సరాల పాటు కోహ్లీ స్పాన్సర్‌గా నిలిచి ఆర్థికంగా అండగా ఉండటం వల్ల తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టగలిగానని, ఆ సహకారం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అంతర్జాతీయ వేదికపై విజయాన్ని అందించిందని ఆమె తెలిపింది.

8, ఆగ 2026

కడప ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ తుది దశలో, 2027 జనవరిలో అందుబాటులోకి
జిల్లా వార్తలు

కడప ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ తుది దశలో, 2027 జనవరిలో అందుబాటులోకి

కడప ఎయిర్‌పోర్ట్‌లో రూ.266 కోట్లతో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ పనులు 70 శాతం పూర్తయ్యి తుది దశలోకి చేరాయి. రాయలసీమ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గండికోట కాన్సెప్ట్‌తో రూపకల్పన చేస్తున్న ఈ టెర్మినల్‌ 2027 జనవరి నాటికి ప్రయాణికుల వినియోగానికి సిద్ధం కానుంది. టెర్మినల్‌ విస్తరణ, రన్‌వే, నైట్‌ ల్యాండింగ్‌ సదుపాయాల అభివృద్ధితో రాయలసీమ విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

5, ఆగ 2026

రజనీ, కమల్ కొత్త ప్రాజెక్టులపై దృష్టి – స్క్రిప్ట్ మార్పులతో ముందుకు
సినిమా

రజనీ, కమల్ కొత్త ప్రాజెక్టులపై దృష్టి – స్క్రిప్ట్ మార్పులతో ముందుకు

కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ తమ తదుపరి చిత్రాల కోసం స్క్రిప్ట్, దర్శకుల ఎంపికలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రజనీ 173వ చిత్రం ‘ధర్మన్’ కోసం అశ్వత్ మారిముత్తు కథకు ఓకే చెప్పగా, కమల్ 237వ ప్రాజెక్ట్‌గా ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతూ, నటుడిగా, నిర్మాతగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

30, జులై 2026

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రాత్మక స్పెల్‌.. పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌కు కీలక ఆధిక్యం
క్రీడలు

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రాత్మక స్పెల్‌.. పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌కు కీలక ఆధిక్యం

పాకిస్థాన్‌పై జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ చారిత్రాత్మక స్పెల్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, టెస్టు క్రికెట్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతుండగా, నాలుగో రోజు ఆటలో బ్యాటర్ల ప్రదర్శనపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

28, జులై 2026

మణిరత్నం కొత్త చిత్ర షూటింగ్ జోరుగా
సినిమా

మణిరత్నం కొత్త చిత్ర షూటింగ్ జోరుగా

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కొత్త చిత్రాన్ని విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటతో తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతాలో మొదటి షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగుతుండగా, తరువాత పుదుచ్చేరి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కథ అవసరాలకు అనుగుణంగా షూటింగ్ జరపాలని యూనిట్ యోచిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ తేదీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

24, జులై 2026

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం..
బిజినెస్

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం..

ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించేందుకు ఫ్లిప్‌కార్ట్ బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. భారీ డిస్కౌంట్లు, విస్తృత రెస్టారెంట్ నెట్‌వర్క్, ONDC ప్లాట్‌ఫామ్ వినియోగంపై వ్యూహాలు రూపొందిస్తూనే, FIRST సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై అనుచిత వ్యాపార విధానాలు, GST మినహాయింపుల దుర్వినియోగంపై CCI వద్ద ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామాలపై పరిశ్రమ వర్గాలు కన్నేసి ఉన్నాయి.

24, జులై 2026

పార్లమెంట్ మార్చ్ విద్యార్థి నిరసనలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయం

పార్లమెంట్ మార్చ్ విద్యార్థి నిరసనలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

సుప్రీంకోర్టు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనలపై పోలీసుల చర్యలపై అత్యవసర విచారణ కోరిన పిటిషన్‌ను తిరస్కరించింది. సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, వీడియోలు చూడడానికి సమయం లేదని, కోర్టు సమయాన్ని వృథా చేయకూడదని స్పష్టం చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

22, జులై 2026

కర్ణాటకలో ‘స్పిరిట్’ థియేట్రికల్ హక్కులు ఆ  రెండు సంస్థలకే..
టాలీవుడ్

కర్ణాటకలో ‘స్పిరిట్’ థియేట్రికల్ హక్కులు ఆ రెండు సంస్థలకే..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రానికి కర్ణాటక థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, Asian Suresh Entertainment సొంతం చేసుకున్నాయి. ప్రభాస్‌కు అక్కడ ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2027 మార్చి 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

22, జులై 2026

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం
జాతీయం

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌ QDENGAకు DCGI ఆమోదం తెలిపింది. 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారికి, గతంలో డెంగీ సోకిందా లేదా అన్న పరీక్షల అవసరం లేకుండానే, మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఈ టీకా ఇవ్వొచ్చు. నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఈ వ్యాక్సిన్‌ ఆసుపత్రి భర్తీలను, తీవ్ర కేసులను గణనీయంగా తగ్గించే అవకాశముందని అధ్యయనాలు, నిపుణులు సూచిస్తున్నారు.

20, జులై 2026

ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలా?
బిజినెస్

ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలా?

ఆగస్టు 15న మహీంద్రా కొత్త SUVను ఆవిష్కరించే అవకాశముందని, ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు ఆటో రంగం అంచనా వేస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో బాహ్య రూపకల్పన, క్యాబిన్, ఫీచర్లలో గణనీయ మార్పులు ఉండొచ్చని, అయితే ప్రస్తుత 2.2 లీటర్ల టర్బో డీజిల్, 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగించే అవకాశముందని చెబుతున్నారు.

20, జులై 2026

అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్

అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ను ఇస్రో, ఇన్-స్పేస్ సహకారంతో విజయవంతంగా ప్రయోగించగా, ఇది భారత అంతరిక్ష రంగంలో కొత్త దశకు నాంది పలికిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ శాస్త్రీయ ప్రతిభ, ప్రైవేట్ భాగస్వామ్యానికి నూతన అవకాశాలు, యువతకు స్ఫూర్తి కలిగించే మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.

18, జులై 2026

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ
బిజినెస్

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ

భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్ జారీ చేసింది.

18, జులై 2026

చరిత్ర సృష్టించిన పీవీ సింధు! జపాన్ ఓపెన్ ఫైనల్‌కు..
క్రీడలు

చరిత్ర సృష్టించిన పీవీ సింధు! జపాన్ ఓపెన్ ఫైనల్‌కు..

తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తొలిసారి జపాన్ ఓపెన్‌ సూపర్ 750 టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత మహిళా షట్లర్‌గా రికార్డు నమోదు చేసింది. సెమీస్‌లో సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌పై విజయం సాధించింది.

18, జులై 2026

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?:   ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన
రాజకీయాలు

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?: ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన

ఏపీ బీజేపీ మైలేజ్‌ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? పోలవరం ప్రాజెక్ట్‌ను కాషాయవరంగా మార్చుకోవాలనుకుంటోందా? ప్రాజెక్ట్‌ నిర్మాణం కొలిక్కి వస్తున్న దశలో ఆ పార్టీ లీడర్స్‌ స్వరం సవరించుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి మైక్‌ల ముందు చెప్పడం అందులో భాగమేమా? పోలవరం మైలేజ్‌ విషయంలో కాషాయ వ్యూహం ఎలా ఉంది? చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏంటి?

17, జులై 2026

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..
అంతర్జాతీయం

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..

అమెరికా, ఇజ్రాయిల్‌లను ప్రధాన శత్రువులుగా చూస్తున్న ఇరాన్, ఇప్పుడు ఖతార్, పాకిస్తాన్, ఒమన్ వంటి మధ్యవర్తి, మిత్ర దేశాలపైనా క్షిపణి, డ్రోన్ దాడులు జరుపుతూ ఒత్తిడి పెంచుతోంది. గల్ఫ్ ప్రాంతంలో మధ్యవర్తిత్వం, రవాణా భద్రత దెబ్బతినడంతో పాటు, ఈ దాడులు కొనసాగితే ఇరాన్ అంతర్జాతీయ వేదికపై మరింత ఒంటరై, యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

17, జులై 2026

‘ఓ సుకుమారి’ : ఆసక్తికరమైన కాన్సెప్ట్
సినిమా

‘ఓ సుకుమారి’ : ఆసక్తికరమైన కాన్సెప్ట్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా వచ్చిన ‘ఓ సుకుమారి’ చిత్రం “ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే విభిన్న కాన్సెప్ట్‌తో ఆసక్తి రేకెత్తించినా, తెరపై అమలులో స్పష్టత లోపించి భాగంగా మాత్రమే పనిచేసింది. తెలంగాణ యాసలోని కామెడీ, నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బలంగా నిలిచినా, ప్రధాన ఘర్షణ, భావోద్వేగాల్ని బలంగా మలచలేకపోవడంతో సినిమా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

17, జులై 2026

పుంజుకున్న భారత స్టాక్ మార్కెట్ : స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు
బిజినెస్

పుంజుకున్న భారత స్టాక్ మార్కెట్ : స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు

ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, మధ్యాహ్నం వరకూ అదే ఊపును కొనసాగించినప్పటికీ ఆ తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ ఇవాళ్టి ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి.

15, జులై 2026

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం పాత కాగితం రేషన్ కార్డులకు బదులుగా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. తొలి దశలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఆధార్ అనుసంధానం, క్యూఆర్ కోడ్, భద్రతా లక్షణాలతో నకిలీ కార్డులు, డూప్లికేట్ లబ్ధిదారుల సమస్యలను తగ్గించి పేద కుటుంబాలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

14, జులై 2026

'కొరియన్‌ కనకరాజు' టీజర్ విడుదల
సినిమా

'కొరియన్‌ కనకరాజు' టీజర్ విడుదల

వరుణ్‌తేజ్‌ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రం గ్రామీణ, రాయలసీమ నేపథ్యంతో హాస్యం, హారర్‌, యాక్షన్‌, ఫాంటసీ మేళవింపుగా వస్తోంది. ప్రభాస్‌ విడుదల చేసిన టీజర్‌లో వరుణ్‌తేజ్‌ రాయలసీమ యాసలో చెప్పే సంభాషణలు, కొత్త బాడీ లాంగ్వేజ్‌ ఆకట్టుకోగా, ఆగస్టు 7న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

14, జులై 2026

టీజీ20 తొలి సీజన్‌ ఛాంపియన్‌గా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌
క్రీడలు

టీజీ20 తొలి సీజన్‌ ఛాంపియన్‌గా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌

టీజీ20 తొలి సీజన్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు ఖమ్మం ఏసెస్‌పై ఫైనల్లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 158 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించడంలో కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి, వైష్ణవ్‌ రెడ్డి, షణ్ముఖ అశ్విన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, బౌలింగ్‌లో యశ్వీర్‌ గౌడ్‌ 3 వికెట్లతో మెరిశాడు.

13, జులై 2026

ప్రపంచకప్‌ స్టేజ్‌-4లో ధీరజ్‌, కీర్తి జంటకు నిరాశ
క్రీడలు

ప్రపంచకప్‌ స్టేజ్‌-4లో ధీరజ్‌, కీర్తి జంటకు నిరాశ

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-4లో రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత జంట ధీరజ్‌ బొమ్మదేవర, కీర్తి కాంస్య పతక పోరులో ఇటలీ జంట రాబర్టా ఫ్రాన్సెస్కో, మెటో బొర్సాని చేత 3-5తో ఓడిపోయింది. ఒక దశలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కీలక సెట్లలో పొరపాట్లు చేయడంతో పతకం చేజారగా, ఈ ప్రదర్శన భవిష్యత్‌ అంతర్జాతీయ పోటీలకు విలువైన అనుభవాన్ని అందించనుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

13, జులై 2026

లార్డ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం..
క్రీడలు

లార్డ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం..

లార్డ్స్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌ మహిళల జట్టు ఘన విజయానికి చేరువైంది. 457 పరుగుల లక్ష్యంతో ఆడుతున్న ఇంగ్లాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 130/6తో కష్టాల్లో ఉంది. యాస్తిక భాటియా శతకం, రిచా ఘోష్‌ అర్ధశతకంతో భారత్‌ భారీ ఆధిక్యం సాధించగా, సయాలి, క్రాంతి, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు.

13, జులై 2026

ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో అర్జెంటీనా
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో అర్జెంటీనా

ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌పై అదనపు సమయంలో 3-1 తేడాతో గెలిచి అర్జెంటీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. మెస్సీ సృష్టించిన అవకాశాలను స్విస్ గోల్‌కీపర్ కోబే పలుమార్లు అడ్డుకున్నా, అదనపు సమయంలో జూలియన్ అల్వారెజ్, లౌటారో మార్టినెజ్ గోల్స్‌తో అర్జెంటీనా ఆధిక్యాన్ని పెంచింది. సెమీఫైనల్‌లో అర్జెంటీనా, నార్వేను ఓడించిన ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

12, జులై 2026

టీజీ20లో కొనసాగుతున్న హైదరాబాద్‌ దూకుడు
క్రికెట్

టీజీ20లో కొనసాగుతున్న హైదరాబాద్‌ దూకుడు

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ జట్టు క్వాలిఫయర్‌-2లో Karimnagar Diamonds‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. లీగ్‌ దశలో వరుసగా ఏడు విజయాల తర్వాత క్వాలిఫయర్‌-1లో ఓటమి ఎదురైనా, త్వరగా కోలుకుని మళ్లీ దూకుడు కొనసాగించింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో హైదరాబాద్‌ , అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

11, జులై 2026

సూపర్ హీరో బాబు: అర్జున్ దాస్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
సౌత్ ఇండియా

సూపర్ హీరో బాబు: అర్జున్ దాస్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

11, జులై 2026

దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డే జంటగా ‘శ్రీ శ్రీ’
సినిమా

దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డే జంటగా ‘శ్రీ శ్రీ’

దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డే జంటగా రవి నెలకుదిటి దర్శకత్వంలో, సుధాకర్‌ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతున్న రొమాంటిక్‌ చిత్రం ‘శ్రీ శ్రీ’ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలై ఆసక్తి రేపుతున్నాయి. ప్రేమ, వినోదం, కుటుంబ భావోద్వేగాలను మేళవించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.

11, జులై 2026

వింబుల్డన్‌ సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్‌
క్రీడలు

వింబుల్డన్‌ సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్‌

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ 6-4, 6-4, 6-4తో నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించి అతని 25వ గ్రాండ్‌స్లామ్‌ ఆశలను భగ్నం చేశాడు. మరో సెమీలో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఆర్థర్‌ ఫెరీపై సునాయాస విజయం సాధించగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మార్సెలో అరెవాలో–వొస్తాపెంకో జంట టైటిల్‌ గెలుచుకుంది.

11, జులై 2026

20 గంటలు నీటిలో యాక్షన్‌ చేసిన రష్మిక
సినిమా

20 గంటలు నీటిలో యాక్షన్‌ చేసిన రష్మిక

రష్మిక నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మైసా’లో ఆమె గోండ్‌ గిరిజన యువతిగా సవాల్‌ విసిరే పాత్రలో కనిపించబోతోంది. Mixed Martial Arts‌లో శిక్షణ తీసుకున్న ఆమె, ప్రమాదకరమైన అండర్‌వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డూప్‌ లేకుండా స్వయంగా చేసి, రెండు రోజుల్లో దాదాపు 20 గంటలు నీటిలో గడిపి షూటింగ్‌ పూర్తి చేసినట్టు యూనిట్‌ తెలిపింది.

10, జులై 2026

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ వంటి ప్రాజెక్టుల స్థితిని వివరంగా తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రభావం, అవసరమైన వనరులు, గడువులు, పనుల నాణ్యతపై దృష్టి పెట్టి, నిర్ణయించిన టైమ్‌లైన్‌లో పనులు పూర్తి చేయాలని సూచించారు.

8, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters